E-Paper
Advertisement

ఈ డాల్ హెడ్ తో పెట్టుకుంటే దబిడి దిబిడే… ‘స్క్విడ్ గేమ్’ లాంటి థ్రిల్లర్

ఈ డాల్ హెడ్ తో పెట్టుకుంటే దబిడి దిబిడే… ‘స్క్విడ్ గేమ్’ లాంటి థ్రిల్లర్
Advertisement

Japanese Horror movie: బొమ్మలు చూడడానికి ఎంత క్యూట్ గా ఉంటాయో కదా. కానీ అవే బొమ్మలు దెయ్యాల్లా మారి ప్రాణాలు తీస్తే… అయ్యా బాబోయే ఊహించుకుంటేనే గుండె దడ పెరుగుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ మాత్రం అచ్చం ‘స్క్విడ్ గేమ్’లా ఉంటుంది. ఈ బొమ్మ ముందు నుంచి కదిలితే డైరెక్ట్ గా నరకానికి టికెట్ కన్ఫామ్ చేస్తుంది. ఆ సూపర్‌నేచురల్ డార్క్ హారర్-థ్రిల్లర్ చిత్రమే ‘యాస్ ది గాడ్స్ విల్’ (As the Gods Will). 2014లో విడుదలైన ఈ జపనీస్ సినిమా ప్రేమికులను షాక్ కి గురి చేసింది. మరి థ్రిల్లర్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులో ఉందా లేదా ? అనే విషయాలను తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

షున్ తకహత అనే హైస్కూల్ విద్యార్థి ఇందులో హీరో. తన జీవితం చాలా బోరింగ్‌గా సాగుతోందని, ఏదైనా వింత జరిగితే బాగుంటుందని ఎప్పుడూ అతను అనుకుంటూ ఉంటాడు. కానీ అతను ఊహించని విధంగా స్కూల్లో ఒక భయంకరమైన ఆట మొదలవుతుంది. మొదటి ఆట దారుమా సాన్: ఒకరోజు క్లాస్ జరుగుతుండగా, క్లాస్ టీచర్ తల ఒక్కసారిగా పేలిపోతుంది. ఆ స్థానంలో ‘దారుమా’ అనే సాంప్రదాయ జపనీస్ బొమ్మ ప్రత్యక్షమవుతుంది. ఆ బొమ్మ విద్యార్థులతో “రెడ్ లైట్, గ్రీన్ లైట్”.. అంటే మనం చిన్నప్పుడు ఆడిన స్టాచ్యూ ఆట లాంటి ఆట ఆడుతుంది.

Advertisement

బొమ్మ వెనక్కి తిరిగినప్పుడు కదిలిన ప్రతి విద్యార్థి తల పేలిపోయి చనిపోతారు. సమయం ముగిసేలోపు బొమ్మ వెనుక ఉన్న బటన్‌ ను నొక్కిన షున్ మాత్రమే ఆ క్లాస్ నుండి ప్రాణాలతో బయటపడతాడు.కేవలం షున్ క్లాస్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో ఇలాంటి ఆటలే జరుగుతున్నాయని అతనికి తెలుస్తుంది. స్కూల్ నుండి బయటపడటానికి మిగిలిన విద్యార్థులు మరికొన్ని వింతైన, భయంకరమైన జపనీస్ సాంప్రదాయ ఆటలు ఆడాల్సి వస్తుంది.

రెండో ఆట మనెకి… నెకో అనే పిల్లి బొమ్మ… ఆ బొమ్మ ముందు విద్యార్థులు ఎలుక డ్రెస్‌లు వేసుకుని, దాని మెడలో ఉన్న గంటలో బాస్కెట్‌ బాల్ వేయాలి. ఓడిపోయిన వారిని పిల్లి నమిలి చంపేస్తుంది. మూడో ఆట కగోమే కగోమే: కళ్లకు గంతలు కట్టుకుని, తమ వెనుక ఉన్న బొమ్మ పేరును సరిగ్గా చెప్పాలి. తప్పు చెప్పేవారు చనిపోతారు. నాల్గో ఆట షిరోకుమా అంటే తెల్ల ఎలుగుబంటి: అందరూ కలిసి నిజం మాత్రమే మాట్లాడాలి. ఎవరైనా అబద్ధం చెప్తే ఎలుగుబంటి వారిని చంపేస్తుంది.

Advertisement

ఈ ఆటలలో విద్యార్థులు కేవలం బొమ్మలతోనే కాకుండా, బ్రతకడం కోసం తోటి స్కూల్ విద్యార్థులతో కూడా పోటీ పడాల్సి వస్తుంది. కొందరు స్వార్థంతో ఇతరులను చంపడానికి కూడా వెనకాడరు. ఈ ఆటలు వారి మానసిక స్థితిని పూర్తిగా మార్చేస్తాయి.చివరి ఆట పోలీస్ అండ్ రాబర్స్: చివరికి షున్, అతని స్నేహితుడు అమ్మయా మాత్రమే మిగులుతారు. అప్పుడు ఒక ‘కోకేషి బొమ్మ’ వచ్చి వారికి ఐస్ క్రీమ్ ఇస్తుంది. ఆ ఐస్ క్రీమ్ స్టిక్ పైన ఎవరికైతే “లైవ్” అని ఉంటుందో వారు మాత్రమే బ్రతుకుతారు, “డై” అని ఉన్నవారు చనిపోతారు. అంటే ఇంతవరకు ఆడిన ఆటలన్నీ కేవలం అదృష్టం మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయని వాళ్ళకి అర్థమవుతుంది. చివరికి షున్, అమ్మయాలలో ఎవరు బతికారు ? ఈ డెడ్లీ డెత్ గేమ్స్ ఆడిస్తుంది ఎవరు ? చివరకు ప్రాణాలతో ఎవరైనా బయట పడ్డారా లేదా ? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమాను మస్ట్ వాచ్.

తెలుగులో లేదు

‘యాస్ ది గాడ్స్ విల్’ జీవితం గురించి ఆలోచింపజేసే అద్భుతమైన సినిమా. షున్ హిరోషి నటన, బొమ్మల ఆటల సీక్వెన్స్‌లు అదిరిపోతాయి. ప్రస్తుతం Apple TV, Amazon Prime Videoలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో ఇంకా అందుబాటులో లేదు. హిరోకి టాబాటా రాసిన ప్రసిద్ధ మంగా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ‘స్క్విడ్ గేమ్’ సిరీస్‌కు స్ఫూర్తి అని చాలా మంది నమ్ముతారు.

Read Also: ఉన్నట్టుండి డబ్బుల ప్రింటింగ్ మిషన్ ఊడిపడితే… లాస్ట్ ట్విస్ట్ అస్సలు మిస్ అవ్వొద్దు

Related News

కోట్ల ఆస్తి, విలాసవంతమైన కుటుంబం… కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్… మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

ది బీటిల్స్ నుంచి హాలీవుడ్ పాప్ స్టార్ల వరకు… ప్రపంచ దిగ్గజాల వెనుక ఉన్న మ్యూజిక్ మొఘల్ కథ

కట్స్ లేకుండా ఒకే ఒక్క షాట్‌లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్… నిజంగానే ఆ భయంకరమైన ఇంట్లో ఉన్న థ్రిల్లిచ్చే థ్రిల్లర్

ఆ వర్షపు రాత్రి చేసిన ఒక్క తప్పు… చిన్న పొరపాటుకు జీవితాంతం శిక్ష… హార్ట్ టచింగ్ స్టోరీ

హీరో కావాలంటే ఇన్ని అవమానాలా? ఒక్క అవకాశం కోసం జీవితాన్నే పణంగా పెట్టిన యువకుడి కథ

ఒకే ఇంట్లో ఉన్నా ఒకరికొకరు దూరం… లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మినీ సిరీస్

30 పెళ్లి సంబంధాలు ఫెయిల్.. 31వ పెళ్లి కూడా పెటాకులు… ఈ అమ్మాయి చేసిన పనికి హ్యాట్సాఫ్

తండ్రిని కాదని ప్రేమికురాలి కోసం వెళ్తే… దెబ్బకు గుర్తొచ్చే గత జన్మ…

Big Stories

Advertisement
×