E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode July 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం చెప్పమని రాథోడ్‌ ను నిలదీసిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today Episode July 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం చెప్పమని రాథోడ్‌ ను నిలదీసిన మిస్సమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ బయటకు వెళ్లడానికి కిందకు వస్తుంటాడు. అప్పుడే మిస్సమ్మ కూడా పైకి వెళ్లడానికి స్టెప్స్‌ దగ్గరకు వెళ్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా ఢీకొట్టుకుంటారు. దీంతో అమర్‌ కోపంగా మిస్సమ్మను ఏయ్‌ లూజ్‌ చూసుకోవా..? అంటూ తిట్టగానే.. మిస్సమ్మ షాక్‌ అవుతుంది. ఏం మాట్లాడారు మీరు అంటూ అడుగుతుంది. ఏయ్‌ అన్నాను అని అమర్‌ చెబితే.. దాని తర్వాత ఏమన్నారు అంటూ మిస్సమ్మ ఆత్రుతగా అడిగితే చూసుకోవా..? అన్నాను అంటాడు అమర్‌. దానికన్నా ముందు ఏమన్నారు అనగానే.. అమర్‌ కావాలనే లూజ్‌ అన్నాను అంటాడు. దీంతో మిస్సమ్మ హ్యాపీగా ఫీలవుతూ.. ఒక్క నిమిషం ఇక్కడే ఆగండి అంటూ దేవుడి రూంలోకి వెళ్లి మొక్కుతూ  దేవుడా నువ్వు ఉన్నావు.. ఆయనకు కొంచెం కొంచెం నేను జ్ఞాపకం వస్తున్నాను అంటూ మొక్కి బయటకు వచ్చి అమర్‌ దగ్గరకు వెళ్తుంది.

అమర్‌ కోపంగా చూస్తూ.. ఎక్కడికి వెళ్లి వస్తున్నావు.. అంటూ అడుగుతాడు. అది సరే కానీ నన్ను మళ్లీ లూజ్‌ అని పిలవవా..? అని అడుగుతుంది. మిస్సమ్మ మాటలకు అమర్‌ నీకేమైనా పిచ్చా అంటూ తిడతాడు. ఇద్దరి మధ్య చిన్న పాటి గొడవ జరుగుతుంది. అమర్‌ కోపంగా మిస్సమ్మను తిట్టినట్టు నటిస్తూ వెళ్లిపోతుంటే.. ఒకసారి ఢీకొంటే కొమ్ములు వస్తాయట.. రెండోసారి ఢీ కొట్టండి అంటుంది అందుకు అమర్‌ సరే అంటూ మిస్సమ్మ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఢీ కొట్టబోతూ మిస్సమ్మను రొమాంటిక్ గా చూస్తుంటాడు. అప్పుడే బయటి నుంచి వస్తున్నా మనోహరి, యాదమ్మ వాళ్లను చూస్తారు. మనోహరి షాక్‌ అవుతుంది. యాదమ్మ మాత్రం మనోహరి నువ్వు సార్‌కు  దగ్గర అయ్యేలోపే భాగీ సార్‌ను తన చుట్టు తిప్పుకునేలా ఉంది అంటుంది. మనోహరి కోపంగా మరేం చేయాలి చంభా అమర్‌కు నేను ఎంత దగ్గర అవుదామన్నా అమర్‌ నన్ను పట్టించుకోవడం లేదు. దాన్ని ఎంత దూరం చేద్దామన్నా అది దగ్గర అవుతుంది అంటూ బాధపడుతుంది. ఇంతలో అమర్‌ రెండోసారి మిస్సమ్మ తలకు డాష్‌ ఇచ్చి వెళ్లిపోతాడు.

Advertisement

తర్వాత ఇంట్లోకి వెళ్లిన తర్వాత యాదమ్మ, మనోహరిని తిడుతుంది. నువ్వు హీరోయిన్‌కు తక్కువ జోకర్ కు ఎక్కువ నువ్వు హీరోయిన్‌వి ఎప్పుడు అవుతావు అంటూ నిలదీస్తుంది. మనోహరి కోపంగా యాదమ్మను తిడుతూ.. నేను హీరోయిన్‌ అవుతాను.. ఈరోజు రాత్రికే ఆ ప్రచండ గాడు బుజ్జమ్మను బయటకు తీసుకెళ్లి తన శక్తులన్నీ వశం చేసుకుని చంపేస్తాడు. అది సాకుగా చూపించి భాగీని ఇంట్లోంచి గెంటేసి పిల్లల కోసం అని అమర్‌ను నేను పెళ్లి చేసుకుంటాను.. అప్పుడు చెప్తాను నేనేంటో.. అంటూ మనోహరి చెప్పగానే.. అదంతా జరిగినప్పుడు చూద్దాంలే అని యాదమ్మ మనసులో అనుకుంటుంది.

మిస్సమ్మ, రాథోడ్‌ను పక్కకు తీసుకెళ్లి నీతో మాట్లాడాలి రాథోడ్‌.. అని చెప్పగానే.. ఏం మాట్లాడాలి మిస్సమ్మ అని రాథోడ్‌ అడిగితే ఆయన విషయంలో నువ్వు నాకేమైనా అబద్దం చెప్పావా..? అని అడగ్గానే.. రాథోడ్‌ తడబడుతూ.. సార్‌ విషయంలో కూడా చిన్న చిన్న అబద్దాలు చెప్పి ఉంటాను మిస్సమ్మ అంటే ఆఫీసు నుంచి ఇంటికి రావడం లేటు అయినప్పుడు అంటూ చెప్తుంటే.. మిస్సమ్మ కోపంగా ఏంటి రాథోడ్‌ ఏం మాట్లాడుతున్నావు.. ఆయనకు గతం గుర్తుకు వచ్చిందా…? నేను ఎవరో గుర్తుకు వచ్చిందా అని అడగ్గానే.. రాథోడ్‌ తడబడుతూ.. లేదు మిస్సమ్మ అంటాడు. రాథోడ్‌ మాటకు మిస్సమ్మ అనుమానంగా మరెందుకు గుడికి వెళ్లి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇందాకే నన్ను లూజ్‌ అన్నారు అంటూ జరిగింది చెప్తుంది. రాథోడ్‌ ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తుండిపోతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

రామ్ చరణ్ నన్ను నమ్మలేదు… ఒకేసారి అంత మాట అన్నారా: రంగస్థలం మహేష్

రెమ్యూనరేషన్ పై మహేష్ అచంట కామెంట్స్… రంగస్థలందే ఇప్పుడు తీసుకుంటున్నానంటూ!

రంగస్థలం మహేష్ బ్రేకప్స్ గురించి తెలుసా? అంతమంది ఎలా పడ్డారు బ్రో!

భార్యతో గొడవలు… సెలబ్రిటీల నుంచి ఫోన్లు.. అసలు విషయం చెప్పిన మహేష్!

పెళ్లి పీటలెక్కిన కావ్య శ్రీ.. ఇదెక్కడి ట్విస్ట్!

ఆమెపై పగబట్టిన హౌస్ మేట్స్.. ఎలిమినేషన్ తప్పదా?

ఛాలెంజ్ యాక్సెప్టెడ్.. మరో వీడియోతో అదరగొట్టేసిన అనసూయ!

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్?

Big Stories

Advertisement
×