E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి మాస్టర్ ప్లాన్.. మాట నిలబెట్టుకున్న అవని.. కమల్ దెబ్బ అదుర్స్ కదూ..

Intinti Ramayanam Today Episode: పల్లవి మాస్టర్ ప్లాన్.. మాట నిలబెట్టుకున్న అవని.. కమల్ దెబ్బ అదుర్స్ కదూ..
Advertisement

Intinti Ramayanam Today Episode july 8th: రాత్రి శ్రీకర్ తీసుకొచ్చిన బిర్యాని తిని అందరూ చాలా సంతోషంగా పడుకుంటారు. మన ఆస్తులు మనకు వచ్చేస్తాయి ఆ ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు అని అందరూ అనుకుంటారు.. ఈ విధంగా ఆ ఇంట్లో లగేజ్ నంతా ప్యాక్ చేసుకొని మొత్తం ఎక్కించేసిన తర్వాత పల్లవి ఇంకా రాలేదు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది పల్లవి రెడీ కాకుండా అలానే ఉండడంతో అవన్నీ ఏమైందని షాక్ అవుతుంది.. నాకు ఏమి కాలేదు నేనైతే ఆ ఇంటికి రాను అని చెప్తుంది. మీకు పిల్లలు పుట్టారు. మీరు ఆస్తిని అనుభవిస్తారు కానీ నాకు పిల్లలు పుట్టలేదు. నా మొగుడు నన్ను దగ్గర కూడా రానివ్వలేదు.నాతో కాపురం చేయడం లేదు నేను ఆ ఇంటికి రాను అని తెగేసి చెప్తుంది. నా మొగుడు నాతో కాపురం చేస్తేనే నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను అని పల్లవి ఫిట్టింగ్ పెడుతుంది. అవని మాత్రం నీ భర్తతో సంతోషంగా ఉండాలని నువ్వు ప్రయత్నించాలి ఒకరు చెప్తే రాదు అని వార్నింగ్ ఇస్తుంది..

పల్లవి ఫిట్టింగ్ పెట్టింది..

నేను ఇంట్లోంచి రాను అని పల్లవి అనగానే ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అక్కడికి వచ్చినా నేను సంతోషంగా ఉండేది ఏమీ లేదు కదా ఇక్కడున్న నేను సంతోషంగా ఉండేది ఏమీ లేదు కదా అందుకే నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అని పల్లకి చెప్పేసి లోపలికి వెళ్తుంది.. పల్లవి అలా అనడంతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఏమైంది పల్లవి ఇలా ఇప్పుడు పెడుతుందని అసలు అనుకోలేదు అని అనుకుంటారు.. తను తీరా వెళ్లేటప్పుడు ముహూర్తానికి టైం అవుతున్నప్పుడు ఇలా మాట్లాడుతుందని నేను కూడా అస్సలు ఊహించలేదు అని పార్వతి అంటుంది. ఏది ఏమైనా కూడా పల్లవి ఇలాంటి మాటలు మాట్లాడటం అస్సలు ఊహించలేకపోతున్నాము అని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా.. పల్లవిని ఒప్పించి తీసుకొని వచ్చే బాధ్యత నాది మీరేమి కంగారు పడకండి అని అవని అంటుంది. కమల్ నువ్వు నాతో రా నీతో పని ఉంది అని అవని తనని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది.

అవని మాటతో కలిసిపోయిన కమల్..

Advertisement

లోపలికి వెళ్ళిన పల్లవి తన ప్లాను సక్సెస్ అయిందని సంతోష పడిపోతూ ఉంటుంది.. అప్పుడే లోపలికి వచ్చిన భానుమతి నువ్వు కరెక్ట్ గా వెళ్లే టైంకి బలే ఫిట్టింగ్ పెట్టావు కదా.. ఇక జన్మలో వాళ్ళు నీ జోలికి రారు అన్నట్టుగా మనవరాలు పై పొగడ్తలు వర్షం కురిపిస్తుంది.. అక్కడికి వెళ్లలేక ఇక్కడ ఉండలేక వాళ్ళు చచ్చిపోతారే నువ్వు బాగానే చేశావు అని భానుమతి పల్లవిని పొగిడేస్తూ ఉంటుంది.. అప్పుడే లోపలికి వచ్చిన అవని కమల్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను చెప్పినట్టు విని పల్లవితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు కన్నయ్య అని అవని చెప్పగానే సరే వదినా అని అంటాడు. ఇక పల్లవిని బయటికి పిలవగానే తను వస్తుంది. కమల్ నీతో సంతోషంగా ఉండటమే కదా నీకు కావాలి ఇకమీదట నుంచి నీతో కమల్ సంతోషంగా ఉంటాడు. నువ్వు కూడా తనతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్తుంది.. ఇక ఇద్దరూ ఒకరికొకరు మాట్లాడుకొని సంతోషంగా ఉంటామని అవనికి మాట ఇస్తారు.

అవని పై ప్రశంసలు..

ఏంటి పల్లవి వాళ్ళు లోపలికి వెళ్లి ఇంకా రాలేదు ఏమైంది అని బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు.. శ్రీకర్ శ్రీయ మా వదిన అనుకునింది అంటే కచ్చితంగా సాధించి తీరుతుంది నువ్వేమీ కంగారు పడదు వస్తుంది అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అవనిని చూసి ఏంటి అవని ఒక్కటే వస్తుంది అని అందరూ అనుకుంటూ ఉండగా కాసేపటికి కమల్ అలాగే పల్లవి ఇద్దరు చేయి చేయి పట్టుకొని అన్యోన్య జంటగా బయటికి రావడం చూసి అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మా వదిన మాటంటే మాటే చూసావా శ్రేయ అని శ్రీకర్ అవని పై ప్రశంసలు కురిపిస్తాడు. కమల్ అలాగే పల్లవిలు చేతులు పట్టుకొని మరి చాలా స్టైల్ గా బయటికి రావడం చూసి ఇంట్లోని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు..

ఇల్లు మనకు ఒక బడి..

Advertisement

ఎన్నో అనుబంధాలని అవమానాలని, మరెన్నో జ్ఞాపకాలని మిగిల్చిన ఈ ఇల్లు వదిలి వెళ్లాలంటే ఏదోలా ఉంది.. ఇక్కడ మనకు ఎన్నో పాఠాలు నేర్పించారు. మనకు ఇదొక బడి లాంటిది.. ఎన్నో తప్పులను కూడా సరిచేసింది అని అవని ఆ ఇంటిని చూసి ఎమోషనల్ అవుతుంది.. ఇక ఇంటి ఓనర్ రాగానే ఆయన చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అని అక్షయ కూడా ఆయనపై ప్రశంసలు వర్షం కురిపిస్తాడు.. అదేవిధంగా ఆయన కూడా మీలాంటి మంచి మనసులు నా ఇంటిని వదిలి వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు. ఇకపోతే ఆ ఇంటి నుంచి అందరూ ఎవరి కార్లలో వాళ్ళు ఫ్యామిలీ లాగా వెళ్ళిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : ఎన్టీఆర్ నుంచి రాజమౌళి వరకు.. సెలబ్రిటీల జోస్యం చెప్పిన వేణుస్వామి..

Related News

Brahmamudi Serial Today Episode August 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పోలీస్ ట్రైనింగ్ క నందు – ఏదో ఒకటి చేయాలనుకున్న రేఖ      

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

బిగ్ బాస్ ను రిజెక్ట్ చేసిన కామాక్షి.. ఎందుకంటే?

పెళ్లిపై కామాక్షి క్రేజీ రియాక్షన్?

కామాక్షి డైరెక్టర్ గా చేసిన సినిమాలేంటో తెలుసా?

చైనాలో కప్పలు, పాములు తినడంపై కామాక్షి రియాక్షన్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి అవమానం.. బాలు ప్లాన్  సక్సెస్.. ప్రభావతికి గుండెపోటు..

Karthika Deepam 2 Serial Today Episode August 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను మాలిని ఇంట్లో చూసిన కార్తీక్      

Big Stories

Advertisement
×