E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవో ఓటింగ్ లో పరంధామయ్య ట్విస్ట్ 

Brahmamudi Serial Today Episode June 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవో ఓటింగ్ లో పరంధామయ్య ట్విస్ట్ 
Advertisement

Brahmamudi serial today Episode: తనను కిడ్నాప్‌ చేసిన ఐశ్వర్యతో ఇందు ఎమోషనల్‌ అవుతుంది. తాను మనందరి కోసమే సీఈవో అవుతున్నానని ఎంత చెప్పినా ఐశ్వర్య కోపంగా తిడుతూ.. నువ్వేం చేసినా నేను నిన్ను వదలను నా నుంచి కాపాడటానికి ఎవ్వరూ రారు.. అంటూ చెప్పగానే.. బయటి నుంచి చూస్తున్న నారాయణ నేను వచ్చాను కదా అనుకుంటాడు. ఇది పొగరు బోతు గిత్తే అనుకున్నా కానీ బాగా పొగరున్న డీజిల్‌ బండి దీన్ని నేనే డీల్‌ చేయాలి.. అనుకుంటూ ఎలాగైనా ఇందును తప్పించాలని అనుకుంటాడు.

మరోవైపు బోర్డు మీటింగ్‌లో అందరూ ఇందు కోసం వెయిట్‌ చేస్తుంటారు. ఇందు ఇంకా రాలేదేంటి…? ఫోన్‌ స్విచ్చాప్‌ వస్తుందేంటి..? అని మనసులో అనుకుంటుంది. రాజు కూడా పరంధామయ్యను తనకు హెల్ప్‌ చేయమని.. లేదంటే మళ్లీ రేఖ సీఈవో అవుతుందేమోనని భయపడుతుంటాడు. ఇంతలో అందరూ కలిసి మీటింగ్‌ స్టార్ట్‌ చేస్తారు. కంపెనీ గురించి అందరికీ రేఖ చెప్తుంది. మళ్లీ తనను కంపెనీ సీఈవోగా చేస్తే..  కంపెనీలో ఎలాంటి ప్రాబ్లమ్స్‌ రాకుండా తాను ముందుకు తీసుకెళ్తానని తనకు పోటీగా నిలబడే ఈ రాజుకు ఏమైనా ఎక్స్‌పీరియన్స్‌ లేదని చెప్తుంది. అసలు వర్క్‌ ఎలా చేయాలో తెలియని ఈ రాజుకు మీరు పట్టం కడతారో.. లేక కంపెనీని ఇన్ని రోజులు నడిపించే తనకు సీఈవోగా పట్టం కడతారో మీరే ఆలోచించుకోండి అని చెప్తుంది.

Advertisement

దీంతో రాజు ఎక్స్‌ఫీరియన్స్‌ ఏముంది..? రోజు వచ్చి హాజరు వేసుకుంటే కూడా ఎక్స్‌ఫీరియన్స్‌ వస్తుంది. వ్యాపారం అంటే లాభాలు మాత్రమే చూసుకోవాలి. నువ్వు కంపెనీలో స్టాప్‌కు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకెళ్లావు.. ఎన్ని కంపెనీలు పోటీలో ఉన్న ఒక్క అడుగు కూడా తగ్గకుండా పోటీలో నిలబడాలి అంటూ రాజు చెప్పగానే.. రేఖ అవును కోటి నుంచి యాభై లక్షలు, యాభై నుంచి ఇరవై లక్షలకు వచ్చినప్పుడే అర్థం అయింది నీ సామర్థ్యం అనగానే అందరూ షాక్‌ అవుతారు. ఏం జరిగింది మేడం అని అందరూ అడగ్గానే.. ఏం లేదని రాజు, రేఖ చెప్తారు. రాజు వెంటనే సీఈవో కోసం ఓటింగ్‌ పెట్టమని చెప్తాడు. ఓటింగ్‌లో ఇద్దరు రేఖకు ఇద్దరు రాజుకు సపోర్టు చేస్తారు. పరంధామయ్య ఎవ్వరికి సపోర్టు చేస్తే వాళ్లే సీఈవో అనే ఉత్కంఠ నెలకొంటుంది. దీంతో పరంధామయ్య తనకు కొంచెం టైం కావాలని సీఈవో ఎంపికకు పన్నెండు గంటల వరకు టైం ఉంది కదా ఈలోపు మీరు కాఫీ తెప్పించుకుని తాగండి నేను ఆలోచించుకుని చెప్తాను అంటూ వెళ్లిపోతాడు. దీంతో రేఖ ఇందు గురించి ఆలోచిస్తుంది. అది వస్తేనే నేను సీఈవో అవుతాను అంటూ బాధపడుతుంది.

ఇందుకు కాపలాగా ఉన్న రౌడీలు మందు తాగుతుంటే.. ఐశ్వర్య వెళ్లి ఇప్పుడు మందు తాగుతున్నారేంటి అని అడగ్గానే.. మేము మందు తాగితేనే చాలా స్ట్రాంగ్‌ గా ఉంటాము అని చెప్పగానే.. ఐశ్వర్య సరే అంటూ లోపలికి వెళ్తుంది. ఇంతలో తాగుబోతు నారాయణ వచ్చి రౌడీలతో మాట కలిపి మందు తాగుతూ.. రౌడీలత గొడవ పెట్టుకుని అందరినీ చితక్కొడతాడు. రౌడీలను కొట్టుకుంటూ లోపలికి వెళ్తాడు. ఐశ్వర్య కోపంగా నారాయణను తిడుతుంది. దీంతో నారాయణ కోపంగా ఐశ్వర్యను బెదిరిస్తూ.. ఇందును తాను కాపాడతానని చెప్తాడు. దీంతో ఐశ్వర్య కోప్పడుంతుంది. నువ్వు దీన్ని కాపాడతావా..? నువ్వు తనను తీసుకెళ్తూ.. ఉంటే నేను చూస్తూ ఉంటానా..? అనగానే.. చూడకపోతే ఏం చేస్తావు.. ఈ రౌడీలతో కొట్టిస్తావా..? అనగానే.. ఐశ్వర్య షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Big Stories

Advertisement
×