E-Paper
Advertisement

Pandu Master Health Update : పండు మాస్టర్ డ్యాన్స్ చెయ్యలేడా..? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..?

Pandu Master Health Update : పండు మాస్టర్ డ్యాన్స్ చెయ్యలేడా..? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..?
Advertisement

Pandu Master Health Update : ఒక తెలుగు ఛానల్ ఈటీవీలో ప్రసారమవుతున్న టాప్ డాన్స్ షో ఢీలో చేస్తున్న పండు మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకవైపు మాస్టర్ గా మరోవైపు కంటెస్టెంట్ గా చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఎంతోమంది సెలబ్రిటీ డాన్సర్లుగా మారిపోతున్నారు.. 20వ సీజన్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. డాన్సర్ గా ఎన్నో పెర్ఫార్మెన్సులు చేసి ప్రేక్షకులను మెప్పించారు.. ఇలాంటి పండు మాస్టర్ కి రీసెంట్ గా భారీ యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే.. ఆయనకు ప్రమాదం జరగడం బాధాకరం.. ప్రస్తుతం పండు మాస్టర్ హాస్పిటల్ లోనే శస్త్ర చికిత్స చేయించుకుంటున్నాడు. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే ఈ ప్రమాదం జరగడం అనేది ఆయన అభిమానులను తీవ్రఆవేదనకు గురిచేస్తుంది.. ప్రస్తుతం ఈ ప్రమాదం వల్ల కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో మాస్టర్ ఇక జన్మలో డ్యాన్స్ చెయ్యలేడా అని అభిమానులు ఫీల్ అవుతున్నారు.. మరి ఇప్పుడు పండు మాస్టర్ ఆరోగ్యం ఎలా ఉంది..? డాక్టర్లు ఏం చెబుతున్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

పండు మాస్టర్ డ్యాన్స్ చెయ్యలేడా..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ ప్రమాదం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈయన రెండు కాళ్లకు ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయాలయ్యాయి. కొంతమంది సోషల్ మీడియా లో పండు మాస్టర్ ఇక జీవితం లో డ్యాన్స్ చేయలేడని , ఇక మీదట ఆయన్ని బుల్లితెర పై చూడలేమని, ఇక బుల్లితెరపై పండు మాస్టర్ డాన్స్ ని చూడలేమంటూ సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది.. అయితే నిజానికి ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు అని డాక్టర్లు చెబుతున్నారు. పండు మాస్టర్ కి అవసరమయ్యే సర్జరీ పూర్తి అయ్యిందని, కేవలం మూడు నెలల్లోనే ఆయన మళ్లీ మామూలుగా మారతాడని డాక్టర్లు చెబుతున్నారు.. ఆ తర్వాత ఆయన ఎటువంటి డాన్స్ షో కైనా పాల్గొనవచ్చు అని వెల్లడించారు. ఇది విన్న పండు అభిమానులు త్వరలోనే మళ్లీ మాస్టర్ని బుల్లితెరపై చూడాలి మీరు త్వరగా కోలుకొని రండి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Also Read :ట్రోలర్స్ కు బుట్టబొమ్మ స్ట్రాంగ్ కౌంటర్.. అస్సలు ఊహించలేదు మావా..!

బిగ్ బాస్ 10లోకి పండు మాస్టర్..

బుల్లితెర టాప్ రియాలిటీ బిగ్ బాస్ సీజన్ 10 లోకి పండు కంటెస్టెంట్ గా రాబోతున్నాడు అని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగో లేకపోవడంతో ఆ షోలోకి కంటెస్టెంట్ గా వస్తాడా రాడా అన్న ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి.. పండు మాస్టర్ కి సర్జరీ పూర్తయినందువల్ల ఆయన మరో మూడు నెలల్లో కోలుకొని ఆ షోలో పాల్గొనే అవకాశం కూడా ఉంది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. నిజంగానే పండు మాస్టర్ త్వరగా కోలుకొని ఈ షోలో కనిపిస్తే షో రేటింగ్ పెరుగుతుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు.. మరి పండు మాస్టర్ ఈ షోలో పాల్గొంటాడా లేదా అన్నది చూడాలి..

Related News

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Big Stories

Advertisement
×