E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode June 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన గుప్త

Nindu Noorella Saavasam Serial Today Episode June 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన గుప్త
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: బుజ్జమ్మ స్కూల్ కు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటుంది. మిగతా పిల్లలందరూ స్కూల్‌కు వెళ్లిపోయాక అమర్‌, మిస్సమ్మతో కూడా మాట్లాడాలని బయటకు తీసుకెళ్తాడు. మిస్సమ్మ, అమర్‌ బయటకు వెళ్తుంటే.. బుజ్జమ్మ సెండాఫ్‌ ఇచ్చి ఇంట్లోకి వెళ్తుంటుంది. అప్పుడే వచ్చిన గుప్త ఇంట్లోకి వెళ్లొద్దు బాలిక అంటూ హెచ్చరిస్తాడు. దీంతో బుజ్జమ్మ నా ఇంట్లోకి నేను వెళ్తుంటే వద్దంటున్నారేంటి గుప్తగారు అంటూ అడగ్గానే.. గుప్త లోపల ప్రమాదం పొంచి ఉన్నది బాలిక అని చెప్పగానే.. బుజ్జమ్మ తెలుసు అంటుంది. అయితే తెలిసి ప్రమాదంలో అడుగుపెడతావా..? అని గుప్త అడిగితే అవును గుప్త గారు అంటుంది బుజ్జమ్మ.

దీంతో గుప్త బాలిక నువ్వు చిన్న పిల్లవు అనగానే.. బుజ్జమ్మ చాలా కాన్ఫిడెంట్‌గా కాదు నేను అరుంధతిని అని చెప్పగానే.. గుప్త భయంగా వాడు సామాన్యుడు కాదు బాలిక.. మంత్ర, తంత్ర విద్యలలో ఆరితేరినవాడు. దయ, కరుణ, జాలి లేని మానవత్వం లేని క్రూరుడు అని చెప్తుంటే.. బుజ్జమ్మ మాత్రం వాడు ఎవడైతే ఏంటి గుప్త గారు.. ఇందాక వాణ్ని ఇంట్లో అడుగుపెట్టకుండా ఆపగలిగాను కదా..? అనగానే.. అప్పుడు అతగాడు నీ శక్తిని తక్కువ అంచనా వేశాడు అని గుప్త చెప్పగానే.. అయితే నాకు శక్తులు ఉన్నాయని అతనికి అర్థం అయింది కదా అంటూ బుజ్జమ్మ చెప్పగానే.. అతగాడికి ఎలాంటి శక్తులు ఉన్నాయో నీకు తెలియడం లేదు.. ఇప్పుడు నువ్వు అతగాడిని తక్కువ అంచనా వేస్తున్నావు అంటూ గుప్త హెచ్చరించగానే.. బుజ్జమ్మ మాత్రం నాకేం కాదు గుప్త గారు అంటుంది. దీంతో గుప్త ఈ అతి విశ్వాసం వినుము.. నా మాట వినుము.. నీ తల్లిదండ్రులు వచ్చు వరకు నువ్వు వెలుపలనే ఉండుము.. అని చెప్పినా బుజ్జమ్మ వినకుండా నాది అతి విశ్వాసం కాదు ఆత్మవిశ్వాసం అని చెప్తుంది.

Advertisement

దీంతో గుప్త పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు బాలిక.. ఇప్పుడు నీకున్న వయస్సు.. శరీరం చాలా చిన్నవి.. నువ్వు ఆ ప్రచండుడిని ఢీకొట్టలేవు అని చెప్పగానే.. బుజ్జమ్మ మాత్రం చూడండి గుప్త గారు.. విడిపోయిన మా అమ్మానాన్న కలవాలి. ఆ మనోహరిని ఇంటి నుంచి బయటకు పంపించాలి అందుకు నేను ఏమైనా చేస్తాను అనగానే.. గుప్త కోపంగా మేము ఎంత చెప్పిననూ నీ చెవికి వినబడుట లేదా బాలిక. జరగరానిది ఏదైనా జరిగినచో.. అనగానే.. బుజ్జమ్మ ఏం జరుగుతుంది గుప్త గారు. అయినా మీరుండగా నాకేం జరుగుతుంది అనగానే.. గుప్త పరిస్థితులు విషమించినప్పుడు మేమును ఎమీనూ చేయజాలము బాలిక.. అంటూ చెప్తుండగానే.. బుజ్జమ్మ అన్నింటికి ఆ దేవుడే ఉన్నాడు. నేను లోపలికి వెళ్తున్నాను అని చెప్తూ బుజ్జమ్మ లోపలికి వెళ్లిపోతుంది. గుప్త భయంతో ప్రభూ.. ఈ భూలోకమున ఏమి జరుగుతున్నది. సమయమునకు సలహా ఇచ్చుటకు ఆ నారద మహర్షి వారు కూడా లేరే.. జగన్నాథ ఆ బాలికను నువ్వే కాపాడు స్వామి అంటూ ఎమోషనల్ అవుతుంటాడు గుప్త.

బుజ్జమ్మ మెయిన్‌ డోర్ దగ్గరకు వెళ్లి నిలబడి లోపలికి చూస్తుంది. ప్రపండ మెట్లు దిగితూ బుజ్జమ్మను చూస్తూ.. మనోహరి రూంలోకి వెళ్తాడు. మనోహరి కోపంగా ఏంటి ప్రచండ మనం ప్లాన్‌ చేస్తున్నామా..? అది ప్లాన్‌ చేస్తుందా..? అని అడుగుతుంది. చంభా కూడా తనకు ఎంత ధైర్యం ఉంటే అమ్మానాన్నలను బయటకు పంపించి తను ఒక్కతే ఇంట్లో ఉంటుంది అని అడగ్గానే.. ఆ పిల్లకు చావు ముంచుకొస్తుంది. తన మృత్యువు తరుముకొస్తుంది. అందుకే ఇలా చేస్తుంది అనగానే.. చావు తరుముకొస్తుంది తనకా..? నీకా..? ప్రచండ అంటుంది మనోహరి.. చంభా కూడా జాగ్రత్త ప్రచండ అది సామాన్యమైనది కాదు అది నీకు బాగా అర్థం అయి ఉంటుంది అంటూ హెచ్చరించగానే.. ప్రచండ కోపంగా చూస్తుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Big Stories

Advertisement
×