E-Paper
Advertisement

Aqib Javeed: అల్లా మీద ఒట్టు…ఏషియ‌న్ గేమ్స్ లో టీమిండియాను క‌చ్చితంగా ఓడిస్తాం

Aqib Javeed: అల్లా మీద ఒట్టు…ఏషియ‌న్ గేమ్స్ లో టీమిండియాను క‌చ్చితంగా ఓడిస్తాం
Advertisement

Aqib Javeed:  2027 ఆసియా క్రీడాలు ( Asian Games 2026) ఈ సారి జపాన్ లో జరగనున్నాయి. సెప్టెంబర్ మాసంలో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇక ఈ ఏషియన్ గేమ్స్ సందర్భంగా పురుషుల క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ మూడవతో ఇది వరకు జరగనుంది. ఇందులో టీమిండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. ఈ టోర్నమెంట్ మొత్తం టి20 ఫార్మాట్ లోనే జరగనుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మధ్య కచ్చితంగా మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ ( Aqib Javeed ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను ఈ టోర్నమెంట్ సందర్భంగా చిత్తుగా ఓడిస్తామని శపథం చేశారు. టీమిండియాను ఓడించే సత్తా… పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. అలా మీద ఒట్టేసి చెబుతున్నా… కచ్చితంగా టీం ఇండియన్ ఓడించి.. వాళ్ళ బలుపు తగ్గిస్తామని హెచ్చరించారు. దీంతో ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

ఏషియ‌న్ గేమ్స్ లో టీమిండియాను క‌చ్చితంగా ఓడిస్తాం

Advertisement

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా కంటే పాకిస్తాన్ చాలా బలంగా ఉందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ సంచలన కామెంట్స్ చేశారు. టీమిండియా కంటే స్ట్రాంగ్ గా ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అల్లా మీద తనకు నమ్మకం ఉందని… ఆయన అండదండలతో టీమిండియాను ఓడిస్తామని ఛాలెంజ్ విసిరారు. అలాగే వరల్డ్ కప్ 2027 ప్రిపరేషన్ పైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ స్పందించారు.

వరల్డ్ కప్ 2027 నేప‌థ్యంలో ఎవ‌రూ టెన్ష‌న్ ప‌డొద్దు

వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు. ఈ టోర్నమెంట్ కు సంవత్సరంకు పైగా సమయం ఉందని.. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రిపరేషన్ త్వరలోనే ప్రారంభం కానుందని వెల్లడించారు ఆకిబ్ జావేద్. ఇప్పుడే వరల్డ్ కప్ పైన దృష్టి చూడదని కోరారు. ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్ లపైన పాకిస్తాన్ దృష్టి సారిస్తే బాగుంటుందన్నారు. వచ్చే అక్టోబర్ మాసం నుంచి ఆఫ్రికా పిచ్ లకు పాకిస్తాన్ అలవాటుపడేలా వాతావరణం క్రియేట్ చేస్తామని వెల్లడించారు. అక్కడి బౌన్స్ పిచ్ లకు అనుకూలంగా జట్టును తయారు చేయడం జరుగుతుందన్నారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచే దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌న్నారు.

Advertisement

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

Related News

ధోని లేక‌పోయింటే…ఆ రోజునే ఆత్మ‌హ‌**త్య చేసుకునేవాడిని

అజింక్య రహానే షాకింగ్ నిర్ణ‌యం…నేపాల్ త‌ర‌ఫున ఆడేందుకు ఒప్పందం ?

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు..డ్రెస్సింగ్ రూంలోనే త‌న్నుకుంటున్నారు

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

పేరుకే 3D ప్లేయ‌ర్‌..కానీ చివ‌రి ఓవ‌ర్ లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌డం చేత‌కాదు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన ర‌షీద్ ఖాన్‌..SRH ప్లేయ‌ర్ పై దాడికి య‌త్నం

Big Stories

Advertisement
×