E-Paper
Advertisement

Samsung Galaxy S26 ఫోన్‌కు One UI 9 అప్‌డేట్ విడుదల.. కొత్త AI ఫీచర్లు, కీలక మార్పులు ఇవే!

Samsung Galaxy S26 ఫోన్‌కు One UI 9 అప్‌డేట్ విడుదల.. కొత్త AI ఫీచర్లు, కీలక మార్పులు ఇవే!
Advertisement

Galaxy S26 One UI 9 Update: శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఒక సరికొత్త అప్‌డేట్ అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అయిన Samsung Galaxy S26 సిరీస్ కోసం One UI 9 బీటా ప్రోగ్రామ్‌ను కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. ఆండ్రాయిడ్ 17 ఆధారంగా పనిచేసే ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా వినియోగదారులు కొత్త ఫీచర్లను అందరికంటే ముందే ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ బీటా వెర్షన్ భారత్, అమెరికా, సౌత్ కొరియాతో పాటు కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

లుక్ మార్చేసిన క్విక్ ప్యానెల్:

ఈ కొత్త అప్‌డేట్‌లో శాంసంగ్ తమ క్విక్ ప్యానెల్ డిజైన్‌ను పూర్తిగా మార్చేసింది. వినియోగదారులు తమకు నచ్చినట్టుగా బ్రైట్‌నెస్, సౌండ్, మీడియా కంట్రోల్స్‌ను విడివిడిగా అడ్జస్ట్ చేసుకునేలా దీనిని రూపొందించారు. అంతేకాకుండా.. స్క్రీన్ లేఅవుట్ సైజులను కూడా మార్చుకునే వీలు కల్పించారు. దీంతో ఫోన్ వాడకం మరింత సులువుగా మారుతుంది.

యాప్స్‌లో సరికొత్త మార్పులు:

Advertisement

ఫోన్ లోని ఇన్‌బిల్ట్ యాప్స్‌లో కూడా శాంసంగ్ కొన్ని ఆసక్తికరమైన మార్పులు చేసింది. శాంసంగ్ నోట్స్ యాప్‌లో రకరకాల డెకరేటివ్ టేప్ ఎఫెక్ట్స్, కొత్త పెన్ స్టైల్స్ వచ్చాయి. దీనివల్ల నోట్స్ రాసుకోవడం మరింత సరదాగా ఉంటుంది. అలాగే కాంటాక్ట్స్ యాప్ నుండి నేరుగా క్రియేటివ్ స్టూడియోను ఉపయోగించి, వేరే యాప్స్ ఓపెన్ చేసే పనిలేకుండానే సొంతంగా ప్రొఫైల్ కార్డ్స్ డిజైన్ చేసుకోవచ్చు.

Also Read: షాకింగ్.. Google Pixel 10పై రూ.15 వేలకు పైగా తగ్గింపు.. ఈ ప్రైస్‌కి ఇప్పుడు కొనడం వర్తా?

మెరుగైన సెక్యూరిటీ, యాక్సెసిబిలిటీ:

Advertisement

వినియోగదారుల భద్రతకు ఈ అప్‌డేట్‌లో పెద్దపీట వేశారు. ఫోన్‌లోకి వచ్చే ప్రమాదకరమైన యాప్స్‌ను ఇది ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. అవసరమైతే వాటి ఇన్‌స్టాలేషన్‌ను కూడా నిలిపివేస్తుంది. అలాగే చూపు తక్కువగా ఉన్నవారి కోసం ‘టెక్స్ట్ స్పాట్‌లైట్’ అనే ఫీచర్ తెచ్చారు. ఇది స్క్రీన్‌పై ఉన్న అక్షరాలను పెద్దగా, స్పష్టంగా చూపిస్తుంది. శాంసంగ్, గూగుల్ టాక్‌బ్యాక్ ఫీచర్లను కూడా ఇందులో ఒకేచోటికి చేర్చారు.

ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

గెలాక్సీ S26, S26+, S26 అల్ట్రా వాడుతున్న వారు ఈ బీటా అప్‌డేట్‌ను సులభంగా పొందవచ్చు. దీనికోసం ముందుగా ఫోన్‌లోని Samsung Members యాప్‌ను ఓపెన్ చేయాలి. అందులో కనిపించే వన్ యూఐ 9 బీటా బ్యానర్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆప్షన్ ద్వారా దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ అప్‌డేట్ మిగిలిన శాంసంగ్ ఫోన్లకు కూడా అందుబాటులోకి రానుంది.

Also Read: ఫోన్ వెనుక లైటింగ్ ఎఫెక్ట్స్.. 8000mAh బ్యాటరీ.. Tecno Pova 8 5G ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు!

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×