E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను ఇంట్లోకి తీసుకొచ్చిన శివనారాయణ 

Karthika Deepam 2 Serial Today Episode June 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను ఇంట్లోకి తీసుకొచ్చిన శివనారాయణ 
Advertisement

Karthika Deepam 2 serial today Episode: ఆఫీసులో ఉన్న దీపకు ఫుడ్‌ ఆర్డర్‌ మెయిల్‌ వస్తుంది. అది చూసిన మేనేజర్‌ ఏదో ఫుడ్‌ ఆర్డర్‌ వచ్చినట్టు ఉంది చూడండి అని చెప్పగానే.. అదంతా ఇంగ్లీష్‌లో ఉందని ఒకసారి చూడమని దీప మేనేజర్‌కు చెప్పగానే.. తాను చూడనని తన మీద నమ్మకం లేదని వెళ్లిపోతాడు. దీంతో దీప కార్తీక్‌ చెప్పిన ట్రాన్స్‌లేట్‌ చేసే యాప్‌ గురించి గుర్తు చేసుకుని యాప్‌లో ట్రాన్స్‌లేట్‌ చేసుకుని చూస్తుంటే.. జ్యో దగ్గరకు వెళ్లి ఏమో ఫిఫ్త్‌ క్లాస్‌ ఏం చేస్తున్నావు.. అని అడగ్గానే.. పోవే కల్తీదానా.. అంటూ తిట్టగానే.. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది.

ఇంతలో కార్తీక్‌ వచ్చి జ్యోత్న్సను తిడతాడు. జ్యోత్స్న మాత్రం ఏం జరిగినా నువ్వు మాత్రం దీపకు హెల్ప్‌ చేయకూడదు.. అంటూ కండీషన్‌ గుర్తు చేస్తుంది. అంటే ఇప్పుడు సూరజ్‌ వస్తేనే దీప ఆన్సర్ ఇవ్వాలా..? అంటూ చెప్తుండగానే.. అవును వాడు ఇప్పుడు ఆఫీసుకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు.. వాడి కాలు చాలా పెద్దగా ఫ్రాక్చర్‌ అయింది వాడిక వారం పది రోజుల వరకు ఆఫీసుకు రాడు అని చెప్తుండగానే.. సూరజ్‌ ఆఫీసుకు వస్తాడు. సూరజ్‌ను చూసిన జ్యోత్స్న షాక్‌ అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఆఫీసుకు ఎందుకు వచ్చావని కార్తీక్‌ అడిగితే తన వల్ల దీప ఇబ్బంది పడకూడదని సూరజ్‌ చెప్తాడు. వెంటనే దీపకు వచ్చిన మెయిల్‌ చదివి రిప్లై ఇస్తుంటాడు. దీప, కార్తీక్ క్యాంటీన్‌లోకి వెళ్లి కాఫీ తాగుతూ సూరజ్‌ గురించి మాట్లాడుకుంటారు. సూరజ్‌ మన అంత మంచోడు కాదులే జ్యోత్స్నకు ఎలా బుద్ది చెప్పాలో సూరజ్‌కు తెలుసు అంటూ ఈ అటాక్‌ కూడా జ్యోత్స్న ఎందుకు చేయించకూడదు అంటూ అనుమాన పడుతాడు కార్తీక్‌.

Advertisement

సూరజ్‌ పని చేసుకుంటూనే.. జ్యోత్న్స టేబుల్‌ మీద ఒక పేపర్ మీద ఐలవ్యూ అని రాసి ఫైల్‌లో పెట్టేస్తాడు. అది చూసిన జ్యో కోపంగా వీడు చచ్చాడు ఇవాళ నా చేతుల్లో అంటూ ఆ పేపర్‌ తీసుకుని సూరజ్‌ టేబుల్ మీద పెట్టగానే.. నేను పనిలో బిజీగా ఉన్నాను అవన్నీ ఇప్పుడు పట్టించుకోను అంటూ చెప్పగానే.. మరి ఇదేంటి అని అడుగుతుంది జ్యో. అందులో ఏముంది అని సూరజ్‌ అడగ్గానే.. ఐలవ్యూ అని ఉంది కదా అనగానే.. మిమ్మల్ని నేను ప్రేమించడం లేదు. అంటూ తలతిక్కలా మాట్లాడుతుంటే.. అప్పుడే శివనారాయణ వస్తాడు. జ్యోత్స్న కోపంగా ఆ పేపర్‌ను శివనారాయణకు చూపిస్తుంది. అందులో ఐలవ్యూకు బదులు థాంక్యూ అని ఉంటుంది. దీంతో శివనారాయణ అందులో ఏముంది అసలు నువ్వే రాయాలి అది సూరజ్‌ రాశాడని కంప్లైంట్‌ చేస్తావేంటి..? అంటూ శివనారాయణ కోప్పడగానే.. జ్యోత్స్న పేపర్‌ చూసి షాక్‌ అవుతుంది. అప్పుడే శివనారాయణ, సూరజ్‌ను ఎక్కడుంటావని.. పెళ్లైందా అంటూ వివరాలు అడగ్గానే.. సూరజ్‌ తనకు పెళ్లి కాలేదని.. మణికొండలో ఉంటున్నానని చెప్తాడు. దీంతో సూరజ్‌ ను ఇంటికి వెళ్లినప్పుడు తనతో రమ్మని చెప్పి వెళ్లిపోతాడు శివనారాయణ. జ్యోత్స్న మాత్రం పేపర్‌లో అక్షరాలు ఎలా మారిపోయాయని ఆలోచిస్తుంది.

తర్వాత కార్తీక్‌, సూరజ్‌ను ఇంటికి తీసుకెళితే ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారిన సూరజ్‌ అడుగుతాడు. తాతయ్యే తీసుకురమ్మన్నారని చెప్పగానే.. ఎందుకు అని సూరజ్‌ అడగ్గానే.. నువ్వు మమ్మల్ని కాపాడావు కదా..? సన్మానం చేయడానికి ప్లాన్‌ చేశారేమో అని జ్యోత్స్న చెప్పగానే.. అయితే నేను ఇంట్లోకి రావడం లేదని వెళ్లిపోతుంటే.. కార్తీక్‌ బలవంతంగా ఇంట్లోకి తీసుకొస్తాడు. దీంతో శివనారాయణ అందరి ముందు సూరజ్‌ను తమ ఇంట్లోనే ఉంటాడని అదే నిర్ణయం తీసుకున్నానని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. జ్యోత్స్న కోపంగా మనింట్లో సూరజ్‌ ఉండటం ఏంటి తాత అని అడగ్గానే.. మన ఇంట్లో కాదు అవుట్‌ హౌస్‌లో ఉంటాడని చెప్పగానే.. పారిజాతం వద్దని టెన్షన్‌ పడుతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Big Stories

Advertisement
×