Brahmamudi serial today Episode: కంపెనీ ఎంప్లాయీస్‌కు బోనస్ ఇచ్చేందుకు ప్రకాష్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. సీతారామయ్య, కావ్యను వెళ్లి చెక్స్ ఇవ్వమని చెప్తాడు. కావ్య మాత్రం ఆలోచనలో పడిపోతుంది. పెద్దవాళ్లు మీరంతా ఉండగా అలాగే మా ఆయన ఉండగా నేనెలా చెక్స్ ఇవ్వగలను అంటూ మోహమాటపడుతుంది. రుద్రాణి కూడా కావ్య చేత చెక్స్ ఎలా ఇప్పిస్తారు నాన్న అంటూ అడుగుతుంది. ధాన్యలక్ష్మీ ఏకంగా మా ఆయన ఉండగా ఆవిడగారితో ఎలా బోనస్ ఇప్పిస్తారు అంటుంది. దీంతో సీతారామయ్య కోపంగా నేను కంపెనీకి చైర్మన్ ను నా నిర్ణయమే పైనల్ అది కాక కావ్య కంపెనీకి సీఈవో అందుకే కావ్య చేతనే బోనస్ లు ఇప్పిస్తాను అంటాడు.
అపర్ణ కూడా కలగజేసుకుని రుద్రాణి నిన్ను బాగా ప్రబావితం చేస్తుంది ధాన్యలక్ష్మీ. నేను కోడలిగా అడుగుపెట్టినప్పుడు, నువ్వు కోడలిగా అడుగుపెట్టినప్పుడు దీపావళికి బోనస్ లు నీతోనే ఇప్పించారు కదా..? అప్పుడు నాకు అర్హత లేదని నేను అనలేదు. నీకు అర్హత లేదని నువ్వు అనలేదు. నా కొడలు దాకా వచ్చే సరికి ఆపడానికి నువ్వెవరు..? ఆ ధాన్యలక్ష్మీ ఎవరు..? అంటూ నిలదీస్తుంది. ఇందిరాదేవి కూడా రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఇది ఇంటి సమస్య. బోనస్ లు ఇవ్వడం సీఈవో బాధ్యత. దాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. చైర్మన్ గా నా భర్త చెప్పినట్టు చేయాల్సిందే అంటుంది. ఇంతలో రాహుల్ కలగజేసుకుని రాజ్ హర్ట్ అవుతాడేమో ఒకసారి ఆలోచించండి అమ్మమ్మా..? అంటాడు.
రాజ్ మాత్రం అలాంటిదేం లేదని.. కంపెనీ వర్కర్స్ కు బోనస్ ఇవ్వడం అనేది మన బాధ్యత. ఎవరి చేత ఇప్పించాము అనడం కన్నా స్టాఫ్ అందరూ దీపావళి సంతోషంగా జరుపుకోవడం ముఖ్యం అని చెప్పగానే రుద్రాణి, రాహుల్, ధాన్యలక్ష్మీ షాక్ అవుతారు. సీతారామయ్య మాత్రం రాజ్ నిర్ణయాన్ని మెచ్చుకుంటాడు. మంచి మాట చెప్పావు రాజ్ ఇప్పుడు నా మనవడు అనిపించుకున్నావు. అమ్మ కావ్య ఇక నీ సంశయాలు తీరినట్టేగా వెళ్లి బోనస్ లు ఇవ్వు అమ్మ అని చెప్పగానే కావ్య వెళ్లి బోనస్ లు ఇస్తుంది. చివరలో కవర్ మీద రాజ్ మేనేజర్ అని రాసి ఉండటం ఊసి కావ్య సంశయిస్తుంది. ఆ కవర్ ఎవరిదో వాళ్లకు ఇవ్వు కావ్య అని ఇందిరాదేవి చెప్తుంది. అది కావాలనే నేనే రాశాను బావ అని సీతారామయ్యకు చెప్తుంది. కావ్య మాత్రం రాజ్‌కు కవర్ ఇవ్వడానికి భయపడుతుంది. కవర్ పై తన పేరు ఉండటం గమనించిన రాజ్ మొదట సీరియస్ అయినా కావ్య దగ్గర కవర్ తీసుకుని మళ్లీ చైర్మన్ గారి మనవడిగా సీఈవో గారికి నేను బోనస్ ఇస్తున్నాను అని రిటర్న్ ఇస్తాడు.
అనామికకు ఫోన్ చేసిన రుద్రాణి కోపంగా నువ్వు ఏదో చేస్తానని చెప్పావు ఏం చేస్తున్నావో అర్తం కావడం లేదు. కానీ ఇక్కడ అందరూ కలిసిపోయి పండగ చేసుకుంటుంన్నారు. అసలు వేలం పాటలో ఓడిపోయినట్టు ఇప్పుడు కూడా ఓడిపోవు కదా? అనామిక అని అడుగుతుంది. అలాంటిదేం లేదు ఆంటీ.. మీరేం వర్రీ కావొద్దు..బాంబు పేలాల్సిన టైం దగ్గర పడింది. పేలుతుంది. అంతవరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
ఇంట్లో రాజ్‌ను తమ మాటలతో ఆటాడుకుంటుంటారు అపర్ణ, ఇందిరాదేవి. కావ్యతో పెట్టుకుని ఇప్పుడు మేనేజర్ అని చెప్పుకోవాల్సి వస్తుంది నీకు అంటుంది అపర్ణ. అందుకే కదా అపర్ణ మన పెద్దవాళ్లు అనేది ఆడవాళ్లతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయని అని ఇందిర అంటుంది. వాళ్ల మాటలకు పిచ్చ కోపంగా కడుపునిండా తిన్నారు కదా… అది అరిగే వరకు నా గురించే మాట్లాడుకోవాలా..? వెళ్లండి ఇక్కడి నుంచి.. అంటూ వాళ్లను తిట్టి కావ్య కోసం వెతుకుతుంటాడు. ఇంతలో కావ్య రాజ్ వెనక నుంచి రాగానే రాజ్ భయంతో కిందపడబోతాడు. కావ్య పట్టుకుంటుంది. ఏవండి నేనేమైనా హీరోనా..? మీ నడుము పట్టుకుని ఇలా ఉండటానికి. లేవండి అంటుంది కావ్య. అయినా వెళ్లిపోయావు కదా? మళ్లీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు రాజ్. నేను ఎందుకు వచ్చానండి నన్ను రమ్మని పిలిచింది అమ్మమ్మ తాతయ్య వాళ్లకు చెప్పే వెళ్లిపోతా..? అంటుంది. అయితే త్వరగా చెప్పి వెళ్లు అంటాడు రాజ్.
అందరూ హాల్ లో కూర్చుని ఉండగా కావ్య వచ్చి ఇందిరాదేవి, సీతారామయ్యకు తాను వెల్లిపోతున్నట్లు చెప్తుంది. అప్పుడు వెళ్తావా ఇంకాసేపు ఉండు అని ఇందిరాదేవి అడుగుతుంది. దీంతో రాజ్ వెటకారంగా మాటలాడతాడు. వాడి మాటలేం పట్టించుకోకు నేను ముగ్గురు కోడళ్లకు దీపావళి కానుక తెచ్చాను వాటిని అందరికి ఇస్తాను అవి తీసుకున్న తర్వాత వెళ్లండి అని అపర్ణ అవి తీసుకురాపో అని చెప్పగానే అపర్ణ లోపలికి వెళ్లి గిఫ్టులు తీసుకొస్తుంది. ఇవి ముత్యాలా హారాలు ఒక్కోక్కరు తీసుకుని వారి వారి భార్యల మెడల్లో వేయండి అని ఇందిరాదేవి చెప్పగానే నేను వేయను అంటూ రాజ్ పక్కకు వెళ్లిపోతాడు. దీంతో కావ్య రాజ్ ను పక్కకు తీసుకెళ్లి బొద్దింకల గురించి చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.