Mohammad Nabi Retire: ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ( Afghanistan) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ రిటైర్మెంట్ ( Retirement) ప్రకటించాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు చెందిన స్టార్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ గురించి తెలియని వారు ఉండరు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎన్నో విజయాలు అందించి… మహమ్మద్ నబీ ( Mohammad Nabi) తన సత్తాను చాటారు.
Also Read: Rinku Singh: ఐపీఎల్ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !
అయితే అలాంటి ఆఫ్గనిస్తాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ ( Mohammad Nabi) తాజాగా సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు… తాజాగా వెల్లడించారు ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ ( Mohammad Nabi). ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు.
Also Read: IPL 2025: అందరి దృష్టి ఈ ప్లేయర్లపైనే…కేవలం వారికే రూ.90 కోట్లు పక్కా..!
2025 ఛాంపియన్ ట్రోఫీ అనంతరం తాను అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు దూరంగా ఉంటానని ప్రకటించాడు మహమ్మద్ నబీ ( Mohammad Nabi). అప్పటి వరకు వన్డే క్రికెట్ ఆడతానని తెలిపాడు. దీంతో ఆఫ్గనిస్తాన్ ఫ్యాన్స్ అందరూ నిరాశకు గురయ్యారు. అయితే టీ20 మ్యాచ్ లు, దేశ వాలి ఇటు ఐపీఎల్ టోర్నమెంట్లో… మహమ్మద్ నబీ ( Mohammad Nabi) ఆడే అవకాశాలు ఉన్నాయి. కాగా 2019 లోనే టెస్టులకు మహమ్మద్ నబీ ( Mohammad Nabi) రిటైర్మెంట్ ప్రకటించాడు.