SA vs IND 1st T20I: టీమిండియా ( Team India) వర్సెస్ సౌతాఫ్రికా ( South Africa) జట్ల మధ్య ఇవాల్టి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో సొంత గడ్డపై టీమిండియా ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ బాధ నుంచి తీరుకునేందుకు ఇప్పుడు…. దక్షిణాఫ్రికా టూర్కు టీమిండియా జట్టు. ఇక్కడ నాలుగు టి20 సిరీస్ ఆడనుంది. అయితే… టి20 సిరీస్ కావడంతో సీనియర్లు లేకుండానే బరిలోకి దిగబోతుంది టీమిండియా.
టీమిండియా కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ( Surya kumar yadav) ఒక్కడే సీనియర్ గా కనిపిస్తున్నారు. ఆయన సారథ్యంలో… టీమిండియా ముందుకు వెళ్లనుంది. అటు హార్దిక్ పాండ్యా ఉన్నప్పటికీ… భారం మొత్తం సూర్యకుమార్ పైన పడే అవకాశాలు ఉన్నాయి. ఇక సంజు సామ్సన్, రింకు సింగ్, హర్షద్దీప్ సింగ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ లాంటి తోపు ప్లేయర్లు తప్ప… అందరూ ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన వారే.
Also Read: Rinku Singh: ఐపీఎల్ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !
అంటే యంగ్ టీమ్ ఇండియా… సౌత్ ఆఫ్రికా ( South Africa) గడ్డ పైన అడుగుపెట్టిందన్నమాట. ఇక ఇవాళ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం అవుతుంది. ఈ మొదటి టెస్ట్… డర్బన్ వేదికగా నిర్వహిస్తున్నారు. మన భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో… ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుందట. ఇక ఈ మ్యాచ్లో మొదటి టాస్ నెగ్గిన జట్టు…. బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్.. జియో యాప్ లో ఫ్రీగా చూడవచ్చు. అలాగే స్పోర్ట్స్ 18 లో కూడా ప్రసారం అవుతోంది.
Also Read: Mohammad Nabi: అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ నబీ రిటైర్మెంట్ !
టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాల్టి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానున్న తరుణంలో.. సూర్య కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇవాళ్టి మ్యాచ్ లో హర్ధిక్ పాండ్యాను ఫస్ట్ డౌన్ లో పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే..4వ వికెట్ కు సూర్యకుమార్ యాదవ్ రానున్నారని సమాచారం.
ఇరు జట్ల వివరాలు:
దక్షిణాఫ్రికా స్క్వాడ్ : ర్యాన్ రికెల్టన్ (wk), ఐడెన్ మార్క్‌రామ్ (c), రీజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, న్కాబయోమ్జి పీటర్
టీమిండియా స్క్వాడ్ : సంజూ శాంసన్ (WK), సూర్యకుమార్ యాదవ్ (c), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్,