BigTV English

Brahmamudi Serial Today October 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  వ్రతం మధ్యలో బాంబు పేల్చిన రుద్రాణి – కావ్యను కూల్‌ చేసిన రాజ్‌

Brahmamudi Serial Today October 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  వ్రతం మధ్యలో బాంబు పేల్చిన రుద్రాణి – కావ్యను కూల్‌ చేసిన రాజ్‌

Brahmamudi serial today Episode: దాంపత్య వ్రతంలో కూర్చోనన్న కావ్యను నువ్వే ఒప్పించాలి బాబు అంటూ కనకం, రాజ్‌ను వేడుకుంటుంది. ఇప్పటి వరకు మీకోసం ఇదంతా చేశాను. కానీ ఇప్పుడు మీ కూతురిని కూడా నేనే ఒప్పించాలంటే నావల్ల కాదండి అంటాడు రాజ్‌. మీరే అలా అంటే ఎలా బాబూ అంటూ కనకం దగ్గుతుంది. దీంతో రాజ్‌ సరే అత్తయ్యగారు మీరేం బాధపడకండి నేనే ఒప్పిస్తాను అని కావ్య దగ్గరకు వెళ్తాడు రాజ్‌. మధ్యలో అపర్ణ రాజ్‌ను పిలిచి మీ అత్తగారి పరిస్థితి చూస్తుంటే నా గుండె చెరువు అవుతుంది రాజ్‌ అంటుంది. నీ గుండె చెరువే అవుతుంది అపర్ణ నా గుండె సముద్రం అవుతుంది అంటుంది ఇందిరాదేవి.


రాజ్‌ ఎలాగైనా కనకాన్ని  ఈ ఆకరి క్షణంలో సంతోషంగా నువ్వే ఉంచాలిరా..? కావ్యకు నిజం తెలియదు కాబట్టి వ్రతంలో కూర్చోనని బెట్టు చేస్తుంది. కావ్యకే కానీ నిజం తెలిస్తే.. ఇంకేమన్నా ఉందా? అటుంది ఇందిరాదేవి. అత్తయ్యామ దీర్ఘాయుష్సుమాన్‌ భవ అని దీవించాల్సిన మనమే అలా మాట్లాడకూడదు అంటూ అపర్ణ ఎమోషనల్‌ అయినట్టు నటిస్తుంది. దీంతో రాజ్‌.. సెంటిమెంట్‌ గా ఫీలవుతూ కావ్యను నేనే కచ్చితంగా ఒప్పిస్తాను మమ్మీ అని కావ్య దగ్గరుకు వెళ్లి నీ తో మాట్లాడాలి అని వరండాలోకి తీసుకెళ్తాడు రాజ్‌. చూడు నీకు నాకు ఏమైనా ఉంటే ఈ ఫంక్షన్‌ అయ్యాక  ఎక్కడికైనా వెళ్లి తేల్చుకుందాం అని కావ్యకు చెప్తాడు రాజ్‌.

ఎక్కడికి వెళ్దాం. బూతు బంగ్లాకే కదా? నేను ఎక్కడికి రాను అంటుంది కావ్య . ఇప్పుడు దాంపత్య వ్రతానికి వచ్చి కూర్చుంటావా? లేదా? అని అడుగుతాడు రాజ్‌. దాంపత్య వ్రతంలో దంపతులే కూర్చుంటారు. నాకు నీకు ఏ సంబంధం లేదన్నావు కదా? ఎలా కూర్చోవాలి అని అడుగుతుంది కావ్య.  ఈ వ్రతం నా కోసం కాదు. మీ అమ్మా కోసం మీ అమ్మా తన ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు అల్లుళ్లు వ్రతంలో కూర్చోవాలని కోరుకుంటుంది అని రాజ్‌ చెప్పగానే కావ్య అయితే మా అమ్మతో నేను మాట్లాడుకుంటానులే.. కట్టుబట్టలతో అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలిసి కూడా ఇలాంటి కోరికలు ఎలా కోరిందో నేను తేల్చుకుంటాను అంటుంది.


రాజ్‌ కోపంగా ఇదిగో నువ్వు ఏదైనా అనాలనుకుంటే నన్ను అను మీ అమ్మను ఒక్కమాట అన్నా ఊరుకోను. నీకు పుణ్యం ఉంటుందే వచ్చి వ్రతంలో కూర్చోవే.. అంటూ బతిమాలుతాడు రాజ్‌. అవునా  వ్రతంలో ఏలా కూర్చోవాలి. నీ భార్యగా కూర్చోవాలా? కనకం కూతురిగా కూర్చోవాలా? దుగ్గిరాల ఇంటి కోడలిగా కూర్చోవాలా..? అని ప్రశ్నిస్తుంది. దీంతో రాజ్‌ నా భార్య స్థానంలో కూర్చో.. అని చెప్పగానే కిటికీలోంచి చూస్తున్న అపర్ణ, ఇందిర, కనకం హ్యాపీగా ఫీలవుతారు. కావ్య షాక్‌ అవుతుంది.

ఇంతలో రాజ్‌..  చూడు నేను మీ అమ్మగారి ఆనందం కోసమే కాదు.. మా అమ్మకోసమే కాదు మన గురించి కూడా ఆలోచించి మాట్లాడుతున్నాను. ఇది మన ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయం. నేను అన్ని మర్చిపోయి పిలుస్తున్నాను. నువ్వు అన్ని గుర్తు పెట్టుకుని రానంటే అది నీ ఇష్టం.  నేను వెళ్లి పీటల మీద కూర్చుంటున్నాను. నువ్వు వస్తావో రావో నీ ఇష్టం కళావతి. ఇది నేను మనఃస్పూర్తిగా చెప్తున్న మాట అని రాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

అప్పు రూంలో రెడీ అవుతుంటే బంటి పూలు తీసుకెళ్లడానిక వచ్చి కనకం గురించి తనలో తానే మాట్లాడకుంటాడు. పెద్దమ్మది ఎంత తెలివి లేకపోతే రాజ్ బావనే ఒప్పిస్తుందా? అనుకుంటాడు. బంటి మాటలు విన్న అప్పు ఏం మాట్లాడుతున్నావురా? అమ్మ ఏం చేసింది అని అడుగుతుంది. భయపడిపోయిన బంటి ఏం లేదు అక్కా అంటాడు. నువ్వేదో దాస్తున్నావు బంటి నిజం చెప్పకపోతే నీకుంటుంది చూడు అని బెదిరిస్తుంది అప్పు.  బంటి భయంగా కనకం ఆడుతున్న నాటకం గురించి మొత్తం అప్పుకు చెప్తాడు. అప్పు వెంటనే ఓరేయ్‌ నాకు చెప్పినట్టు ఇంకెవరికీ చెప్పొద్దు అని పంపిస్తుంది. అయితే రుద్రాణి కిటికీలోంచి మొత్తం వింటుంది. నేను విన్నానుగా ఇక చూడు కథ ఎలా నడిపిస్తానో అనుకుంటుంది.

అందరూ వ్రతం దగ్గర కూర్చుని ఉంటారు. కావ్య మాత్రం రూంలో ఉండిపోతుంది. అందరూ కావ్య కోసమే ఎదురుచూస్తుంటారు. ఇంతలో విసుగ్గా ధాన్యలక్ష్మీ  ఏంటీ అక్కా కూర్చుంది.. చెల్లి కూర్చుంది.. ఈవిడకు ఏమైందో.. ఈవిడ ఇంట్లో జరిగే వ్రతానికి కూడా బొట్టు పెట్టి పిలవాలా? అని వెటకారంగా మాట్లాడుతుంది. ఇంతలో కావ్య రెడీ అయి రూండోర్‌ తెరుస్తుంది. కావ్యను చూసిన రాజ్, హ్యాపీగా ఫీలవుతాడు. ప్రకాష్‌ కూడా హ్యపీగా ఫీలవుతూ ధాన్యలక్ష్మీని తిడతాడు. బొట్టు అవసరం లేదే కావ్యనే వస్తుంది. నోటికి ఎంత వస్తే అంత అరవడమే.. చూడు కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు అంటాడు. కావ్య వచ్చి రాజ్‌ పక్కన కూర్చుంటుంది.

పంతులు పూజ మొదలు పెడతాడు. రుద్రాణి మాత్రం నిజం ఎప్పుడు చెప్పాలా? అని ఎదరుచూస్తుంది. ఇంతలో పంతులు వ్రతంలో కూర్చున్న అందరూ బొట్టు పెట్టుకుని కంకణాలు కట్టుకోమని చెప్తాడు. మూడు జంటలు అలాగే చేస్తుంటే.. రుద్రాణి చప్పట్లు కొడుతుంది. ఎందుకు అలా కొడుతున్నావని కనకం అడిగితే నాటకం రసవత్తరంగా ముగిసిపోయాక ప్రేక్షకులు కొట్టే చప్పట్లు ఇవి అంటూ నీ నాటకం గురించే మాట్లాడుతున్నాను కనకం అంటుంది రుద్రాణి. దీంతో అపర్ణ రుద్రాణిని తిడుతూ ఏమైనా ఉంటే ఇంటికి వెళ్లాక మాట్లాడుకుందాం అంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×