Intinti Ramayanam Today Episode October 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. కమల్ పల్లవి టెన్షన్ పడడం చూసి ఆ డబ్బులు నువ్వు తీసావా అని అడుగుతాడు. నాకెందుకో నువ్వే తీసావని అనుమానంగా ఉంది అని పల్లవితో కమలంటాడు. ఇంకేం అవసరం బావ డబ్బులు తీయాల్సిన అవసరం నాకేంటి అని రివర్స్లోనే పల్లవి అడుగుతుంది. వాళ్ళు వస్తున్నారు అంటే నువ్వు ఎందుకు టెన్షన్ పడ్డావు నాకు అర్థం కావట్లేదు.. నువ్వు నిన్న వద్దన్నావు కదా అందుకే నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది అని కమలంటాడు. ఇంట్లో అత్తయ్య మామయ్య అమ్మమ్మ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ డబ్బులు ఎవరు తీసారో తెలిస్తే వాళ్ళు టెన్షన్ పడిపోతారు.
అందుకే నేను వద్దని అన్నాను. అంతేగాని డబ్బులు నేనెందుకు తీస్తాను నాకేం అవసరమని పల్లవి అడుగుతుంది. ఏం జరుగుతుందో రేపు చూద్దాం కదా అని కమలంటాడు. పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. చక్రధర్ కు చెప్పిన విషయాన్ని మర్చిపోతాడేమో అనుకొని అనుకుంటుంది. కచ్చితంగా డాడ్ డబ్బులు తీసుకొస్తాడు ఆ డబ్బులు ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తాను అని అనుకుంటూ ఉంటుంది.. పల్లవికి అవని నువ్వు తీసిన డబ్బులని అక్కడ పెట్టేసేయ్ నువ్వు సేవ్ అవుతావు లేకపోతే నీకు ఇదే ఆఖరి రోజు అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి మాత్రం టెన్షన్ పడుతూ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది. చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మరింత టెన్షన్ పడుతూ ఈరోజు నా పని అయిపోయినట్లే అని అనుకుంటుంది.. ఎలాగైనా సరే ఇంట్లో వాళ్లకి తెలియకుండా ఆ డబ్బులు నీ అక్కడ పెట్టేయాలని అనుకుంటుంది పల్లవి. వాళ్ల నాన్న అడిగి డబ్బులు తీసుకొచ్చి ఎవరికీ తెలియకుండా డబ్బులను అక్షయ్ గదిలో పెట్టబోతుంది. పల్లవి గదిలో డబ్బులు పెట్టడం చూసినా కమల్ అవని వీడియో తీసి మరి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు.
పల్లవి సేఫ్ గా డబ్బులను పెట్టేసాను నేను సేవ్ అయినట్టే అని అనుకుంటుంది. అప్పుడే వెనక్కి తిరిగి చూడగానే అవని కమల్ ఉంటారు వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఇన్ని రోజులు ఆ డబ్బులు నువ్వే తీసావ్ అని అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు తీసావని కన్ఫామ్ అయిపోయింది. నీ సంగతి తేలుస్తాను రా అని కమల్ పల్లవిని తీసుకొని కిందకు వెళ్తాడు. ఇంట్లోనే వాళ్ళందరినీ కేకలు వేసి పిలుస్తాడు. అయితే ఏమైంది అని పార్వతి భానుమతి అడుగుతారు..
ఇన్ని రోజులు నువ్వు మంచి దానివి అని నమ్మాను కానీ నువ్వు ఈ డబ్బులు తీసావని అక్షయ్ కూడా అంటాడు.. ఆ డబ్బులు తీసుకున్న చేయి ముందు ఆ పెట్టను ఓపెన్ చేసి అందులో డబ్బులు ఉన్నాయో లేక ఖర్చు చేసిందో ఒకసారి కన్ఫామ్ చేసుకోండి అని అవని అంటుంది. అందులో డబ్బులు లేకపోవడం చూసినా అక్షయ్ షాక్ అవుతాడు.. ఇందులో డబ్బులు లేవు అనగానే కమల్ ఆ డబ్బులు ఏం చేస్తావో చెప్పు అని ఎంత అడిగినా కూడా పల్లవి మౌనంగా ఉంటుంది. అయితే కమల్ కత్తి తీసుకొని వచ్చి నేను చంపేస్తాను అని బెదిరించడంతో ఆ డబ్బులు ఎక్కడున్నాయో చెప్తానని అంటుంది.
శ్రీయా మాత్రం కొంపదీసి నా పేరు చెబుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఇక ఆ డబ్బులు మా ఇంట్లోనే ఉన్నాయి అని అంటుంది. నువ్వు ఇలాంటి పని చేసేవా నిన్ను ఎంతగా నమ్మేమో కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు నమ్మలేదు అని పార్వతి అంటుంది. నువ్వు నా మనవరాలు విని నెత్తిన పెట్టుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు ఛీ ఏం బుద్ధి నీది అని భానుమతి కూడా తిడుతుంది. అందరూ కూడా అవనీది తప్పు అని అన్నావు కదా ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి అని అందరూ తిడతారు.
Also Read: ప్రభావతి షాకిచ్చిన బాలు.. మీనాతోనే ఆ పని..రోహిణికి కడుపు మంట..
డబ్బులు దొంగతనం చేసి మా వదిన మీద నిందలు వేస్తావని అందరూ పల్లవి పై సీరియస్ అవుతారు. అటు శ్రీకర్ కూడా మా వదిన దొంగతనం చేసిందని అంటావా అని పల్లవి పై అరుస్తాడు. శ్రీయ కూడా నీకు అవని అక్క మీద కోపం ఉంటే వేరేలా తెచ్చుకోవాలి అంతేగాని ఇలా తీర్చుకోవడం ఎందుకు అని పల్లవి పై సీరియస్ అవుతుంది. ప్రణతి కూడా మా వదినని ఇలా ఇరికించడం మంచిదా అనుకుంటున్నావా..? మా వదిన తప్పంటావా అని బుద్ధి పెడుతుంది. భరత్ కూడా తనకు సాయం చేస్తుంటే మంచి దానివి అని అనుకున్నాను కానీ ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని సీరియస్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…