Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ ఇంటికి రాత్రికి స్పృహలోకి వస్తాడు. మిస్సమ్మ, రాథోడ్, మనోహరి, పిల్లలు అందరూ అక్కడే ఉంటారు.. ఇంతలో రాథోడ్ అసలు అక్కడ ఏం జరిగింది సార్ అంటాడు. రణవీర్ వైఫ్ ఎవరో కనుక్కుందామని నేను నటిస్తూ అక్కడికి వెళ్లాను కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తు లేదు అని చెప్పగానే.. మనోహరి మనసులో థాంక్యూ గాడ్ నేను సేఫ్. చంభా చెప్పినట్టు అమర్‌కు ఏమీ గుర్తు లేదు. అనుకుంటుంది. అంటే రణవీర్ వైఫ్ ఎవరో మీరు తెలుసుకోలేకపోయారా అండి అని మిస్సమ్మ అడుగుతుంది. దీంతో అమర్ నేను కిడ్నాప్ అయ్యానని తెలిసి రణవీర్‌కు కాల్ చేసింది. నన్నేమీ చేయోద్దని చెప్పింది అనగానే మీ పైన రణవీర్ వైఫ్‌కు అత శ్రద్ద ఏంటి సార్ అంటాడు రాథోడ్.
అదే నాకు అర్తం కావడం లేదు. తను ఎవరో కానీ మనకు దగ్గరలోనే ఉన్నట్టు ఉంది. అని అమర్ అనగానే.. చాలా దగ్గరలోనే ఉందండి.. మీ గురించి ఆమెకు అంతా తెలసినట్టు ఉంది. లేకపోతే మీపైన అంత కేరింగ్ ఎందుకు తీసుకుంటుంది అంటుంది మిస్సమ్మ. మీరు స్పృహ తప్పినట్టు నటించారు కదా సార్ మీకు ఏమీ గుర్తు లేకపోవడం ఏంటి..? అని రాథోడ్ అడగ్గానే.. అదే నాకు అర్థం కావడం లేదు.. నేను స్పృహలో లేననుకుని రణవీర్ నాపై అటాక్ చేయబోయాడు. అంతలోనే నా ఒంట్లోకి ఏదో ప్రవేశించినట్టు అనిపించింది.. ఆ తర్వాత ఏం ఆటోచించినా గుర్తు రావడం లేదు.. కళ్లు తెరచి చూస్తే ఇక్కడ ఉన్నాను. అని చెప్పగానే.. అంటే ఆరుంధతి మేడం ఆత్మ సార్ లోకి ప్రవేశించి ఆ రణవీర్ ఆట కట్టించింది అన్నమాట అని మనసులో అనుకుంటాడు రాథోడ్. ఏదో పెద్ద ఫైట్ చేసినట్టు ఒళ్లంతా నొప్పులు గా ఉంది అంటాడు అమర్. దీంతో మనోహరి రిలాక్స్ అవుతుంది. ఫైట్ జరిగింది అమర్ కాకపోతే ఫైట్ చేసింది నువ్వు కాదు.. నీ భార్య ఆరు.. అదే నన్ను సేఫ్ చేసింది. అని మనసులో అనుకుంటుంది. తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
మరోవైపు ఆరు ఆత్మ గురించి ఆలోచిస్తూ చంభా ఒక దగ్గర వెయిట్ చేస్తుంది. ఇంతలో ఘోర వస్తాడు. చంభాను చూసి నువ్వేనా నన్ను కలవాలని పిలిపించింది అని అడగ్గానే.. అవునని నా పేరు అంటూ చెప్పబోతుంటే ఘోర ఆగు నీ పేరు చంభా కలకత్తా మాత్రికురాలివి అని చెప్తాడు. అవును నన్ను రణవీర్ పిలిపించాడు.. అని చెప్పగానే.. ఎందుకు అని ఘోర అడుగుతాడు. ఆ అరుందతి ఆత్మను పట్టుకోవడానికి అని చంభా చెప్పగానే.. అది అసాధ్యం ఆ ఆత్మకు దివ్య శక్తులు ఉన్నాయి. అంటాడు ఘోర.. తెలుసు నాలాగే నువ్వు కూడా ఆ ఆత్మను బంధించడానికి ప్రయత్నం చేసి విఫలం అయ్యావని కూడా తెలుసు అంటుంది చంభా..
అన్ని తెలిసి నన్నెందుకు పిలిపించావు అంటాడు ఘోర. ఆ ఆత్మను పట్టుకోలేనన్న అవమానంతో నువ్వు కుంగిపోయావని తెలుసు. నేను కూడా అదే ఓటమి భారంతో ఉన్నాను.. ఇప్పుడు ఆ ఆత్మను గెలవడానికి మనకొక అవకాశం వచ్చింది అని చంభా చెప్పగానే.. అదెలా దాని శక్తులన్నీ అంతరించిపోయాయా..? అని ఘోర అడగ్గానే.. లేదు రేపు అది అంతర్ధానం కాబోతుంది. దాని అస్థికలు గంగలో కలపబోతున్నారు. ఆ ఆత్మ ఈ జన్మ విడిచి మరు జన్మ ఎత్తబోతుంది అని చంభా చెప్పగానే.. మరి ఎలా ఆ ఆత్మను గెలుస్తాం.. అది అంతర్దానం అయితే దాన్ని పట్టుకోవడం అసాధ్యం కదా అని ఘోర అడుగుతాడు. దాని అస్థికలు గంగలో కలపకపోతే అది మన చేతికి దొరుకుతుంది అని చంభా చెప్పగానే.. ఆ ఆస్తికలు మనకెలా దొరుకుతాయి అని ఘోర అడగ్గానే.. దానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. ఇప్పుడు నువ్వు నాతో చేతులు కలుపు.. మన ఉమ్మడి శత్రువైన అరుంధతి ఆత్మను ఓడిద్దాం.. ఆ ఆత్మకు మరు జన్మ లేకుండా చేద్దాం అంటుంది చంభా.. దీంతో ఘోర సరే అంటాడు.
తర్వాత చంభా, మంగళను కలిసి డబ్బులు ఆశ చూపించి అమర్ ఇంట్లో ఉన్న ఆరు ఫోటో ముందు ఆస్తికలు గురించి చెప్పి వాటిని తీసుకురావాలని చెప్తారు. దీంతో సరే అంటుంది మంగళ ఎవ్వరూ లేని టైం చూసి అమర్ ఇంట్లోకి వెళ్లి ఆరు ఫోటో ముందు తాను తీసుకొచ్చి డమ్మీ ఆస్తికలు పెట్టి నిజమైన అస్థికలు తీసుకెళ్లి చంభాకు ఇస్తుంది. అంతా చూస్తున్న ఆరు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.