Ring Riyaz: రింగ్ రియాజ్(Ring Riyaz) పరిచయం అవసరం లేని పేరు. ఈయనని రింగ్ రియాజ్ అనడం కంటే కూడా గల్లీ బాయ్ రియాజ్ అంటే అందరూ టక్కున గుర్తుపడతారు. ఇలా గల్లీ బాయ్ రియాజ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇతను కమెడియన్ గా బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రియాజ్ పలు కార్యక్రమాలలో పాల్గొంటూ తన కామెడీ పంచ్ డైలాగులతో అందరిని మెప్పిస్తున్నారు. ఇకపోతే ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే రింగు రియాజ్ వాల్గ్స్ అంటూ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈ యూట్యూబ్ ఛానల్ కు భారీ స్థాయిలో సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే ఈయన నాతో ప్రయాణం అంటూ మరొక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారని తెలుస్తుంది. ఇక ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈయన ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా తాను ఇండియా వదిలి వెళ్ళిపోతున్నానని చెప్పడంతో ఒకసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే ఈయన ఇండియా వదిలి ఎక్కడికెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు అనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
ఇటీవల కాలంలో ఎంతోమంది యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభించి పలు దేశాలకు వెళుతూ ఎన్నో వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రింగ్ రియాజ్ సైతం ఇలా యూట్యూబ్ ఛానల్ కోసమే థాయిలాండ్ వెళ్తున్నారని వెల్లడించారు. ఇలా నాతో ప్రయాణం అనే కొత్త యూట్యూబ్ ఛానల్ లో ఇలా టూర్స్ కి సంబంధించిన వీడియోలు మాత్రమే షేర్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈయన తన మొదటి ట్రిప్ లో భాగంగా థాయిలాండ్ వెళ్లి అక్కడ అన్ని ప్రదేశాలను కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడమే కాకుండా ఆ ట్రిప్ వెళ్లడానికి ఎంత ఖర్చవుతుంది ఏంటి అనే విషయాలను కూడా వెల్లడించబోతున్నట్లు తెలియజేశారు.
ఈ విధంగా రింగ్ రియాజ్ కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఆ యూట్యూబ్ ఛానల్ కోసమే విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని తెలియడంతో అభిమానులు కొందరు ఆల్ ద బెస్ట్ చెప్పగా మరికొందరు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రింగ్ రియాజ్ ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎంతో బిజీగా ఉంటున్నారు అయితే ఈయన కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా ఓ రెస్టారెంట్ అ కూడా ప్రారంభించారని గతంలో వెల్లడించారు. నెల్లూరులో ఈయన రింగ్ రియాజ్ స్ట్రీట్ ఫుడ్ అండ్ కేప్ అనే రెస్టారెంట్ ను ప్రారంభించినట్లు తెలిపారు.. ఇకపోతే రాజకీయాల్లో పరంగా కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ వైసీపీ పార్టీకి పూర్తిస్థాయిలో తన మద్దతును కూడా తెలియజేసిన సంగతి తెలిసిందే.
Also Read: Dark Chocolate Teaser: డార్క్ చాక్లెట్ టీజర్ రిలీజ్.. టీజర్ మొత్తం బూతులే !