Gundeninda GudiGantalu Today episode October 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి ప్రభావతికి మంచి బిజినెస్ ఐడియా ఇస్తుంది. మీరు కూడా మంచి సొంతంగా బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మంచిది అని సలహా ఇస్తుంది ప్రభావతి ఆ సలహాని తీసుకొని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది.. నేను చిన్నప్పుడు నుంచి ఒక పెద్ద డాన్సర్ ని కచ్చితంగా నేను డాన్స్ స్కూల్ పెట్టి బాగా డబ్బులను సంపాధిస్తాను అని ప్రభావతి అంటుంది.. అయితే ఈ ఇంట్లో పెట్టడం కుదరదు. కామాక్షి వాళ్ళ ఇంట్లో మీరు ఉన్నది ఇద్దరే కదా.. అన్నయ్య ఎలాగో డ్యూటీకి పోతాడు నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా మరి మీ ఇంటి నాకు ఇవ్వవా డాన్స్ స్కూల్ పెట్టుకుంటాను అని అడుగుతుంది.
అందరూ బలవంతం చేయడంతో కామాక్షి తప్పక డాన్స్ స్కూల్ గురించి ఒప్పుకుంటుంది. ఇక కామాక్షి ఒప్పుకోవడంతో ప్రభావతి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. నా ఫ్రెండ్ వి.. నాకోసం నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు చాలా థాంక్స్ నీకు కూడా డాన్స్ నేర్పిస్తాను అని అంటుంది. అంతేకాదు బిజినెస్ గురించి అప్పుడే చేసుకుంటుంది. 50 మందికి నేర్పితే కచ్చితంగా లక్ష రూపాయలు వచ్చేస్తాయి అంటూ కలలు కంటుంది. ఉదయం లేవగానే మీనా పైకి ఎదురుచూస్తూ కనిపించడంతో సత్యం ఏమైంది అని అడుగుతాడు. రెడీ అవుతుంది డాన్స్ స్కూల్ పెట్టబోతుంది మీరు అది చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అని అంటుంది.
ఈ వయసులో ఇలాంటి పనులు అవసరమా దానికి.. ఇది చూసి నా గుండె ఆగుతుందా అని అంటాడు. అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. ఏమైంది నాన్న గుండె రుద్దుకుంటున్నావు. హాస్పిటల్ కి వెళ్దామా అని అడుగుతాడు. కాసేపు ఆగిన తర్వాత ఆలోచిద్దాం రా ఏం జరుగుతుందో అని అంటాడు.. ప్రభావతిని భరతనాట్యం డ్రెస్ లో చూసి అందరూ షాక్ అవుతారు. వయసులో రిస్క్ తీసుకోవడం అవసరమా అని ఎంత చెప్పినా సరే నన్ను ఎవరు ఆపలేరు ప్రభావతి 2.0 అంటూ డైలాగులు చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. భరత నాట్యం చేస్తున్న ప్రభావతిని చూసిన బాలు షాక్ లో బిగుసుకుపోతాడు.. ఈ వయసులో రిస్క్ అవసరమా అని సత్యం ఎంత చెప్పిన సరే ప్రభావతి మాత్రం ప్రభావతి 2.0 అంటూ డాన్స్ స్కూల్ గురించి చెప్తుంది. ప్రభావతి కామాక్షి ఇంట్లో ఏర్పాటు చేసిన డాన్స్ స్కూల్ గురించి అందరికీ చెప్తుంది. రిబ్బన్ కట్ చేయడానికి శృతి వాళ్ళ అమ్మని పిలుద్దామని అనుకున్నాను. కానీ కుదరలేదు. ముందు జ్యోతి ప్రజ్వల చేయాలి అనగానే ప్రభావతి షాక్ అవుతుంది. దీంతో రిబ్బన్ కట్ చేస్తే నా డాన్సర్ స్కూల్ మూసుకోవాల్సిందే అని ప్రభావతి అనుకుంటుంది.
ఇద్దరి కోడళ్లతో జ్యోతి వెలిగించినప్పుడు నా భార్యతో రిబ్బన్ కట్ చేయాల్సిందే అని బాలు వార్నింగ్ ఇస్తాడు. కామాక్షి మాత్రం మీనా నువ్వు దీపాలు కడిగి పెట్టినప్పుడు మూడు ఒత్తులేసావు కదా మరి ఇక్కడ రెండే ఉన్నాయి ఒక ఒత్తు మీ అత్త మింగేసిందా అని అడుగుతుంది. ఏమో పిన్ని అని మీనా అనగానే ప్రభావతి నేనే ఆకలేసి ఒక వ్యక్తిని మింగేసాను అని అంటుంది. ప్రభావతి మాట విన్న బాలు మా అమ్మ ఆకలావతే కచ్చితంగా మింగేసే ఉంటుంది అని సెటైర్లు వేస్తాడు.
ఈ స్కూల్ కి రిపన్ కట్ చేయాలంటే కచ్చితంగా మంచి రిచ్ గా డబ్బులు మనిషై ఉండాలని ప్రభావతి అంటుంది. ఇప్పటికీ నీ బుద్ధి పోనిచ్చుకోవా.. మీనా లాంటి మంచి మనిషి రిబ్బన్ కట్ చేస్తే కచ్చితంగా నీ డాన్స్ స్కూల్ ముందుకెళ్తుందని సత్యం క్లాస్ పీకుతాడు. కానీ ప్రభావతి మాత్రం ఇష్టం లేకుండానే మీ నాతో ఆ పని చేయిస్తుంది.. రోహిణి చూశారా అత్తయ్య బాలు ఎలా అంటున్నారు మీరు గనక ఇప్పుడు ఆ రిబ్బన్ కట్టేది చేయించకపోతే కచ్చితంగా ఈ స్కూలు తెరిచిన మొదటి రోజే ముస్కోవాల్సి వస్తుంది అని అంటుంది.
Also Read :‘గుండెనిండా గుడిగంటలు ‘ ప్రభావతి రియల్ లైఫ్.. అస్సలు ఊహించలేదు..
శృతి కూడా మీనా కి సపోర్ట్ చేస్తూ మాట్లాడటంతో ప్రభావతి ఏం చేయలేక నాకు ఇష్టం లేకపోయినా సరే మీ నాతో రిబ్బన్ కట్ చేయిస్తున్నాను అని ఇండైరెక్టుగా చెప్తుంది. మాక్సిమాత్రం సందు దొరికితే ప్రభావతిపై సెటైర్లు వేస్తూనే ఉంటుంది. మీనా ఎందుకండీ ఇవన్నీ అత్తయ్యకి ఇష్టం లేకుండా మనం చేయడం ఎందుకు అని ఎంత చెబుతున్నా సరే బాలు లేదు మీనా మా అమ్మకి ముగ్గురు కోడలు ఒకటే అని ఎంత చెప్పినా ఆమె వినడం లేదు కచ్చితంగా నువ్వు రిబ్బన్ కట్ చేయాల్సిందే అని మొండికేసి కూర్చుంటాడు. ఇక అందరూ కూడా మీనాతో చేయించాలని అంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది… రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..