E-Paper
Advertisement

Brahmamudi Serial Today October 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  విడాకులు ఇస్తానన్న కావ్య – షాక్‌ లో స్వరాజ్‌

Brahmamudi Serial Today October 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  విడాకులు ఇస్తానన్న కావ్య – షాక్‌ లో స్వరాజ్‌
Advertisement

Brahmamudi serial today Episode: రాజ్‌ను అందరూ హాల్లో నిలబెట్టి నిలదీస్తుంటారు. కావ్య కూడా తనను ఎందుకు డాక్టర్‌ను కలవకుండా చేశావు.. అబార్షన్‌ ఎందుకు చేయించాలని చూశావు అంటూ నిలదీస్తుంది. అసలు నేను తాగే జ్యూస్‌లో కూడా అంటూ ఆగిపోతుంది. జ్యూస్‌ ఏంటి..? మళ్లీ ఏం  చేశాడు వీడు అని అపర్ణ కోపంగా అడుగుతుంది. దీంతో కావ్య నా నోటితో నేనే ఎందుకు చెప్పడం లేండి అత్తయ్యా అది విని మీరు తట్టుకోలేరు అంటుంది కావ్య.. నువ్వేదో నన్ను కాపాడుతున్నట్టు కవరింగ్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు.. అవును జ్యూస్‌ గ్లాస్‌లో అబార్షన్‌ టాబ్లెట్‌ నేనే కలిపాను.. అని చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు.

ఆ విషయం నీకు చెప్పకుండా నీకు తాగించడానికి ప్రయత్నించాను.. కానీ దానికి కారణం ఎవరు..? నువ్వు కాదా..? నేను చెప్తున్న నువ్వు నా మాట వినకపోవడం వల్ల కాదా.. అందుకే ఇదంతా చేశాను అంటాడు రాజ్‌. అదే ఎందుకు అలా దొంగచాటుగా చేశారని అడుగుతున్నా…? మీరు వినాయక చవితి వరకు బాగానే ఉన్నారు. ఆ రోజు నన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారో చెప్పారు కానీ ఉన్నట్టుండి ఎందుకిలా మారిపోయారు. ఆ రోజు ఏదో జరిగింది మీకు ఏదో విషయం తెలిసింది. అప్పటి నుంచి మీలో ఇలా మార్పు మొదలైంది. నిజం చెప్పండి నా దగ్గర ఏం దాస్తున్నారు మీరు. మన బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నారు.. అంటూ అడగ్గానే.. రాజ్ కోపంగా నీకు నువ్వే ఏదో ఊహించుకుని నీకు నచ్చినట్టు  కథలు రాసేసుకుంటే నేనేం చేయలేను. నీతో కలిసి కొంతకాలం సంతోషంగా ఉంటానని చెప్పాను కదా..? అయినా సరే పదేపదే అడుగుతుంటే నేనేం చేయగలను చెప్పగలను.. అంటాడు రాజ్‌.

Advertisement

అది అబద్దం అని మీకు తెలుసు..? నాకు తెలుసు..? ఇంకా దాచి పెట్టాలని చూడకండి అంటుంది కావ్య. దాచిపెట్టాల్సిన అవసరం నాకేంటి..? ఇక్కడ నేను ఎవరిని చూసి భయపడాలి ఎందుకు భయపడాలి.. అయినా నా మాట మారుస్తుంది నువ్వు… నా మాట వినకుండా తప్పించుకుని తిరుగుతుంది నువ్వు అంటాడు రాజ్‌. దీంతో అప్పుడు ఇప్పుడు నాది ఒక్కటే మాట నాకు బిడ్డే ముఖ్యం.. అని కరాకండిగా చెప్తుంది.. అయినా నా బిడ్డను చంపాలనుకున్న హక్కు మీకు ఎవరిచ్చారు అని నిలదీస్తుంది. దీంతో నీ మెడలో మూడు ముళ్లు వేసినప్పుడే ఆ హక్కు వచ్చింది. అయితే తాళి కట్టినందుకే మీకు ఆ హక్కు ఉందని మీరు అనుకుంటే ఈ తాళే నాకు అక్కరలేదు.. మనం కలిసి ఉండటానికి మనకు ఈ బిడ్డే మీకు అడ్డం అవుతుంది అనుకుంటే మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్లడానికి కూడా నేను సిదమే అంటుంది కావ్య.

దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇంద్రాదేవి కోపంగా ఒసేయ్‌ కావ్య నీకేమైనా పిచ్చి పట్టిందా.? వాడేదో వాగుతుంటే.. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి..? అంటుంది. దీంతో కావ్య మరింకేం చేయమంటారు అమ్మమ్మ  మీ మనవడు నాకు వేరే అవకాశమే ఇవ్వలేదు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఉన్న కోపంతో ఇంటి పరువువను కూడా పణంగా పెట్టేశారు మీ మనవడు. ఇంకా ఈయన వల్ల ఎంత మంది బాధపడాలి.. ఎంత మందిని బాధపెట్టాలి. ఒక ప్రాణాన్ని తీయడానికి సిద్దపడిన ఆయనే అంత మొండిగా ఉన్నప్పుడే.. అదే ప్రాణాన్ని కాపాడటానికి చూస్తున్న నేను ఇంకెంత మొండిగా ఉండాలి..? అంటూ చెప్పగానే..

Advertisement

రాజ్‌ కోపంగా ఇన్‌డైరెక్టుగా నన్ను వదిలేస్తాను అని చెప్తున్నావా..? అని అడుగుతాడు. డైరెక్టుగానే చెప్తున్నాను.. బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకో అని చెప్పింది మీరు… ఇంకా ఈ భూమి మీద అడుగుపెట్టని  బిడ్డను చంపాలని మీరు చూస్తున్నప్పుడు ఆ బిడ్డకు తల్లిగా ఇంతకంటే నాకు వేరే దారి లేదు. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది.. తేల్చుకోవాల్సింది మీరు.. అంటూ చెప్పి వెళ్లిపోతుంది.

తర్వాత రూంలోకి వెళ్లిన కావ్య దగ్గరకు అపర్ణ, ఇంద్రాదేవి వెళ్తారు. అసలు నీకు ఏమైందే.. వాడేదో ఆవేశంలో మాట్లాడితే నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటే..? అని అడగ్గానే… కావ్య ఇదంతా అబద్దం రాజ్‌ మనసులో నిజం తెలుసుకోవడానికి ఆడిన నాటకం అని చెప్తుంది కావ్య. తర్వాత రాహుల్‌, రుద్రాణి బయటకు వెళ్లి హ్యాపీగా ఫీలవుతుంటారు. ఇక కావ్య విడాకులు తీసుకుని వెళ్లిపోతే ఇంట్లో మనక ఎదురే ఉండదు.. ఇక వాళ్లిద్దరి మధ్య మరింత గొడవ పెరిగేలా మనం చేయాలి అని ప్లాన్‌ చేసుకుంటారు. ఇక రూంలో ఏడుస్తూ కూర్చున్న అప్పు దగ్గరకు కళ్యాణ్‌ వెళ్లి ఓదారుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాని అడిగితే అక్కా బావ విడిపోతే ఆ పాపం మనదే అవుతుంది అంటుంది. ఇందులో మన తప్పేం లేదు కూచి.. పరిస్థితులు అలా ఉన్నాయి అంటాడు కళ్యాణ్‌.

మరోవైపు రూంలో సుభాష్‌ కూడా కావ్య, రాజ్‌ల గురించి ఆలోచిస్తూ బాధగా కూలబడిపోతాడు. అపర్ణ వచ్చి ఓదారుస్తుంది. తర్వాత కావ్య దగ్గరకు అప్పు వెళ్లి నీతో కొంచెం మాట్లాడాలి అక్కా అంటుంది ఏ విషయం అప్పు అని అడగ్గానే.. నీ విడాకుల గురించి అని చెప్తుంది. దీంతో కావ్య సైలెంట్‌ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Big Stories

Advertisement
×