IND VS AUS: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ పూర్తికాగానే వెస్టిండీస్ తో టెస్టులు ఆడుతున్న టీమిండియా… అనంతరం వన్డేలకు సిద్ధం కానుంది. ఈనెల 19వ తేదీ నుంచి టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ రెండు జట్ల మధ్య 3 వన్డేలు జరగనున్న నేపథ్యంలో ఇవాళ తుది జట్టును ప్రకటించబోతున్నారు. అయితే ఆస్ట్రేలియా తో ఆడే టీమ్ ఇండియా జట్టులో కీలక మార్పులు ఉంటాయని సమాచారం అందుతోంది.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India vs Australia ) మధ్య త్వరలో జరగబోయే వన్డే సిరీస్ కోసం జట్టును ఇవ్వాల భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించబోతోంది. అయితే ఈ జట్టుకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టి20 కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. అతని కెప్టెన్సీ లోనే మొన్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 tournament ) కూడా టీమ్ ఇండియా గెలుచుకుంది. ఇలాంటి నేపథ్యంలో వన్డేల్లో కూడా సూర్యకుమార్ యాదవ్ కు అవకాశం ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుందట. ఇందులో భాగంగానే రోహిత్ శర్మను కాదని సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. దీంతో రోహిత్ శర్మతోపాటు గిల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవంగా కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ… ఈ ఒక్క ఫార్మేట్ లోనే కెప్టెన్ గా ఉన్నాడు. అలాంటి రోహిత్ శర్మకు అవమానం జరిగేలా కెప్టెన్సీ తొలగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే కెప్టెన్సీ నుంచి తప్పిస్తే వన్డే సిరీస్ అనంతరం రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు రోహిత్ శర్మ అభిమానులు అంటున్నారు. ఇక అటు టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న గిల్ కూడా… టీమిండియా కెప్టెన్సీ పై కన్ను వేశాడు. వన్డే కెప్టెన్ కావాలని ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు గిల్. అలాంటి శుభమాన్ గిల్ ను కూడా బీసీసీఐ పక్కన పెట్టినట్లు సమాచారం అందుతోంది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో పెద్దగా రాణించినందుకుగాను గిల్ కు అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 12 లేదా రెండు గంటల సమయంలో జట్టులో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Shoaib Malik Divorce: మూడో భార్యకు కూడా షోయబ్ మాలిక్ విడాకులు..? సానియా మీర్జా పాపం తగిలిందా !
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా కోసం ఆడే జట్టు అంచనా
టీమిండియా : రోహిత్ శర్మ, సూర్య భాయ్, గిల్, కోహ్లీ, జైస్వాల్, శ్రేయాస్, కెఎల్ రాహుల్, శాంసన్, జడేజా, అక్సర్, నితీష్, కుల్దీప్, వరుణ్, అర్ష్‌దీప్, సిరాజ్, హర్షిత్, ప్రసిద్ధ్.