Gundeninda GudiGantalu Today episode October 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. ఏంట్రా ఇన్నాళ్లకు మా ఇంటికి వచ్చావా నువ్వు బాలు అడుగుతాడు. పెళ్లి రా అందుకే కార్డు ఇవ్వడానికి ఇంటికి వచ్చాను అని తన ఫ్రెండ్ అంటాడు. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావా అదేంటి అని బాలు వెటకారంగా అడుగుతాడు. నా పెళ్లి కాదురా మా అన్నయ్య పెళ్లి అని బాలు తో తన ఫ్రెండ్ చెప్తాడు. అదేంటి మీ అన్నయ్య పెళ్లికి నువ్వు పిలవడానికి వచ్చావు అని బాలు అడుగుతాడు. అయినా అప్పట్లో మీ అన్నయ్య ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు కదా పెళ్లి కూడా చేసుకుంటాడు అని అనుకున్నారు కదా మరి ఇప్పుడేంటి కొత్తగా ఇంకొక అమ్మాయిని అని బాలు అడుగుతాడు. బాలు మీనాతో బలవంతంగా కాపురం చేస్తున్నాడని ప్రభావతి అనగానే మీనా విని ఫీల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు తన ఫ్రెండ్ తో అన్నమాట విని మీనా బాగా హర్ట్ అవుతుంది. ఆ తర్వాత బాలు వచ్చి ఎంత అడిగినా సరే మీనా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. నేను టిఫిన్ చేయను ఏం చేయను రేపటి నుంచి బోర్డు పెడతాను టిఫిన్ చేయను అని అంటూ మీనా కోపంగా మాట్లాడుతుంది. దీనికి పొంతన లేకుండా మాట్లాడుతుంది అని ప్రభావతి అనుకుంటుంది. బాలు మీన దగ్గరికి వచ్చి మాట్లాడిన సరే మీనా మాట్లాడదు. మీ ఫ్రెండ్ తో అలా మాట్లాడారేంటి అంటే మీరు నన్ను బలవంతంగా భరిస్తున్నారా? నేనంటే మీకు ఇష్టం లేదా అని మీనా అడుగుతుంది. కానీ మీనా మాత్రం కోపంగా ఉందన్న విషయం బాలుకు అర్థమవుతుంది. మీనా టిఫిన్ లేదా అని బాలు అడిగినా సరే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. పార్వతి ఫోన్ చేసినా సరే మీనా ఏదో ఒకటి మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది.
ఆ తర్వాత బాలు కారు స్టాండ్ కెళ్ళి కోపంగా ఉండడం చూసి రాజేష్ ఏమైంది రా అని అడుగుతాడు. బాలు కోపంగా మీనా పై నోరు జారిన విషయాన్ని చెప్తాడు.. సత్యం సాయంత్రం పెళ్లికి వెళ్లి ఇంటికి వస్తాడు. అయితే నాకు ఒక కాఫీ తీసుకురాని ప్రభావతికి చెప్తాడు. మీనా ఇంట్లో లేదు అని ప్రభావతి కావాలని సత్యంతో ఉంటుంది. మీనా లేకుంటే ఏంటి నువ్వు ఉన్నావు కదా నువ్వు తీసుకురా నేను సత్యం అంటాడు. ఉదయం నుంచి అమ్మగారు ఎక్కడికి వెళ్లారు తెలియడం లేదు. బయట స్కూటీ ఉంది కదా మరి నేను ఎక్కడికి వెళ్ళింది నువ్వే ఏదో ఒకటి అని అంటావు బాధపడుతూ వెళ్ళిపోయి ఉంటుంది అని ప్రభావతికి క్రాస్ పీకుతాడు.
అప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలు స్వీట్ ప్యాకెట్ తీసుకొని వస్తాడు.. ఏంటి ఏదో తీసుకొచ్చావు అని ప్రభావతి అడుగుతుంది. ఏంట్రా సత్యం కూడా అడుగుతాడు. పొద్దున నోరు జారాను కదా నాన్న అందుకనే నేను కూల్ చేయాలని స్వీట్ పట్టుకొచ్చా నని అంటాడు. ప్రభావతి ఆ మహాతల్లి ఇంట్లో ఉంటే కదా నువ్వు స్వీట్ పెట్టి కూల్ చేయడానికి అని వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చినా రవి శృతి మీనా ఇంకా ఇంట్లోకి రాలేదా అని అడుగుతారు. అనేది అదే కదా ఎక్కడికి వెళ్లిందో ఈ మహాతల్లి ఇంకా ఇంటికి రాలేదు అని ప్రభావతి అంటుంది.
రోహిణి మనోజ్ కూడా అప్పుడే ఇంటికి వస్తారు. ఏంటి వీళ్లిద్దరు కూడా వచ్చేశారు అన్నం సంగతి ఏంటి.. ఈవిడ గారు ఉదయం నుంచి ఏమి చేయకుండా ఎక్కడికి వెళ్లిపోయారు తెలియడం లేదు అని ప్రభావతి నోరు పారేసుకుంటుంది. బండి బయటే ఉంది కదా మరి నేను ఎక్కడికి వెళ్ళింది అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.
కానీ మనోజ్ మాత్రం ఇప్పుడు కూడా ఇంట్లో ఫుడ్ లేదా ఆ మాట ముందే చెప్తే బయట తినేసి వచ్చేవాళ్ళం కదా అని అంటాడు. ఇంటికి వచ్చి ప్రశాంతంగా తినేసి పడుకున్నావ్ అనుకున్నాను చాలా అలసిపోయాను అని మనోజ్ అంటాడు. ఆ మాట వినగానే రవి మీకు కూడా అలసిపోయే వస్తాం అన్నయ్య.. నేను కూడా పని చేస్తున్నా ము అంటాడు. నీకు నాకు పోలికెంటిరా నేను ఒక బిజినెస్ మాన్ ని అని మనోజ్ అంటాడు.. సరే ఆగండి ఎందుకు గొడవ పడుతున్నారు మీ అందరికీ నేనే ఏదో ఒక కూర చేసి అన్నం వండుతాను అని రోహిణి అంటుంది.
Also Read : మందు తాగిన ప్రేమ.. పార్టీలో పెద్ద రచ్చ.. నర్మదకు వల్లి ప్లాన్ తెలిసిపోతుందా..?
ఏబీసీ జ్యూస్ లాగా సాంబార్ కూడా చేస్తూనేమో అమ్మ అమ్మ వతి తినే సి హ్యాపీగా పడుకో నిద్రపో అని బాలు అంటాడు. అయితే సత్యం రవి శృతి బాలు మీనా ఎక్కడికి వెళ్లినా అని టెన్షన్ పడుతుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయిందన్న విషయాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియనంటే సోమవారం ఎపిసోడ్ని అస్సలు మిస్ అవ్వకుండా చూడాలి…