Formula-E Race Case: తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా-ఈ రేస్ కేసు దాదాపుగా క్లయిమాక్స్ చేరుకుంది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బుధవారం గవర్నర్‌కు ఏసీబీ నివేదిక ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే కేటీఆర్ సహా మరో నలుగురి ప్రాసిక్యూషన్‌కి చేయాలని ఏసీబీ భావిస్తోంది. ఆ సమయంలో అరెస్టు చేసినా చేయవచ్చు. చివరిగా చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఫార్ములా కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. ఆయనకు అక్కడ ఊరట లభించలేదు.అరెస్టు చేయకుండా మధ్యంతర ఆదేశాలు వచ్చాయి. హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది సుప్రీ ధర్మాసనం.
ఈ కేసులో విచారణ అవసరమని పిటిషన్‌ను కొట్టేస్తున్నామని సెప్టెంబరు రెండున ఆదేశాలు ఇచ్చింది. కేటీఆర్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన వెంటనే ఏసీబీ వేగంగా పావులు కదిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను క్రోడీకరించి ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఫార్ములా-ఈ కారు రేసులో క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ తేల్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి రూ.45 కోట్ల మేర నిధులు రేస్‌లో భాగస్వాములైన కంపెనీకి బదిలీ అయ్యాయి. అయితే ఆయా కంపెనీల నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తిరిగి రూ. 44 కోట్లు బీఆర్‌ఎస్‌కు వచ్చినట్టు ఏసీబీ అంచనా వేసింది.
ALSO READ: నారా లోకేష్ క్లారిటీ.. కేటీఆర్-నేను కలిశాం
దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించింది ఏసీబీ. క్విడ్ ప్రో కో కారణంగా ఫార్ములా రేసింగ్‌లో అనుభవం లేని ఏస్ నెక్ట్స్‌జెన్ భాగస్వామి అయ్యిందని గుర్తించారు. ఆ వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపింది ఏసీబీ. మంత్రివర్గం ఆమోదం లేకుండానే నిధులను బదిలీ చేసేశారని తేల్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిబంధనలను ఉల్లంఘించినట్టు అధికారుల మాట.
ఏ-1 కేటీఆర్, ఏ-2 ఐఏఎస్ అర్వింద్ కుమార్, ఏ-3 హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఉన్నారు. ఏస్ నెక్ట్స్ జెన్ సీఈవో కిరణ్‌రావు, ఎఫ్‌ఈవో కంపెనీలను మిగతా నిందితులుగా పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు వారిపై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి ఇవ్వాలని నివేదికతోపాటు ఫైలును రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ పంపింది.
ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి జరిగిన.. జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీ నేతలు గమనిస్తున్నారు. పార్టీ పెద్దలను ఒకదాని తర్వాత మరొకటి కేసులు వెంటాడుతు న్నాయని అంటున్నారు. ఇది కంటిన్యూ అయితే పార్టీకి ఇబ్బందులు తప్పవని ఆఫ్ ద రికార్డులో నేతలు చర్చించుకుంటున్నారు.