Dhee 10 Raju: లవ్.. ఇద్దరు వ్యక్తుల మనసుల కలయిక.. ఆస్తి, అంతస్తు, కులం, వర్గం, మతం, జాతి లాంటి భేదాలు చూడకుండా మనసుకు నచ్చిన వారిని ఇష్టపడడమే ప్రేమంటే.. అయితే దీనిని ఈ మధ్యకాలంలో కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. ఎదుటివారి ఆస్తులను, కుల మతాలను చూస్తూ ఆ తర్వాత అన్నీ సెట్ అయితేనే ప్రేమ అనే పేరు జోడించి పెళ్లి చేసుకుంటూ ఉండడంతో నిజమైన ప్రేమకు విలువ లేకుండా పోతోందని పలువురు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అని నమ్మిన వారు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని, దాని దిశగా అడుగులు వేస్తుంటే.. ఇంకొంతమంది ప్రేమించిన వారికి గుర్తింపు లేదని విడిపోవడం నిజంగా బాధాకరమనే చెప్పాలి. ఈ క్రమంలోనే తాను కూడా అలాంటి జాబితాలోకే చేరిపోతాను అంటూ తన లవ్ బ్రేకప్ స్టోరీ గురించి చెప్పి అందరికీ కన్నీళ్లు తెప్పించాడు ఢీ 10 రాజు.
Amardeep : నా గుండె ముక్కలైంది.. మత్తుకు బానిసైన.. రోడ్లపై పడ్డానని అంటున్న అమర్దీప్..!
గుర్తింపు లేక అందరూ దూరం అయ్యారు..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజు, తన ప్రేమ విషయాన్ని చెబుతూనే, తన ప్రేమ బ్రేకప్ అవ్వడానికి గల కారణాన్ని కూడా తెలిపారు.ఇంటర్వ్యూలో భాగంగా రాజు మాట్లాడుతూ.. ఇప్పుడుసుధీర్(Sudheer ), రష్మీ(Rashmi ) ఎలా అయితే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండిస్తున్నారో అప్పుడు నేను కూడా ఆ అమ్మాయితో అలాగే చేశాను. అయితే ఆ అమ్మాయితో నేను స్క్రీన్ పై కాస్త చనువుగా ఉండేవాడిని. ఆ అమ్మాయికి అది స్క్రీన్ వరకే అయినా.. నేను మాత్రం నిజంగానే ప్రేమించాను. పీకల్లోతు మునిగిపోయాను. ఆ అమ్మాయి ఎక్కడుంటే, అక్కడికి పరిగెత్తుకు వెళ్లేవాడిని. అయితే ఇదంతా నాకు గుర్తింపు ఉన్నప్పుడు మాత్రమే. ఇక ఒకవైపు కొరియోగ్రఫీ చేద్దామంటే అవకాశాలు లేవు. మరొకవైపు నటుడిగా అవకాశాలు వస్తున్నాయి కానీ నటనలో పెద్దగా అవగాహన లేదు. ఇక గుర్తింపు లేదు. ఎవరూ కూడా మెసేజ్లు చేయలేదు. ఇక అమ్మాయి కూడా దూరం అయిపోయింది. మొత్తానికైతే ఫేమ్ తగ్గిపోవడంతో అందరూ దూరం అయిపోయారు. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. పిచ్చి పట్టినట్టు అయింది. ఏం చేయాలో తెలియక అందరిని అన్ ఫాలో చేసేసాను. అంటూ రాజు తెలిపారు. ఇక అమ్మాయి గురించి ఏదైనా చెబుతావా అని యాంకర్ ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆమె తన లైఫ్ లో సంతోషంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను ఆమె గురించి చెప్పి ఆమెను బ్లేమ్ చేయలేను. ఆమె ఒకరకంగా చెప్పాలి అంటే చాలా మంచిది. నేనే కాస్త” అంటూ రాజు వెల్లడించారు.
మూడు రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు..
“అదే సమయంలో కాస్త హార్ట్ బీట్ కూడా స్లో అయ్యింది. దాంతో నన్ను మూడు రోజుల పాటు హాస్పిటల్లో ఉంచారు.
సాధారణంగా కొంతమందికి పుట్టుకతోనే హార్ట్ బీట్ కూడా స్లోగా ఉంటుందట. అలా ఉంటే ప్రాబ్లం లేదు కానీ మధ్యలో వస్తే ప్రాబ్లం అని వైద్యులు కూడా చెప్పారు. ఇప్పటికీ అప్పుడప్పుడు స్ట్రెస్ ఎక్కువ అయితే కళ్ళు తిరిగి పడిపోతాను. ఛాతిలో మంట ఉంటుంది. కాసేపు రెస్ట్ తీసుకొని నీళ్లు తాగితే సెట్ అవుతుంది” అంటూ తన బాధను బయటపెట్టారు రాజు. ప్రస్తుతం రాజు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.