BigTV English

Somu Veerraju: సోము వీర్రాజుపై డౌట్స్.. తెలుగు తమ్ముళ్లు గరం

Somu Veerraju: సోము వీర్రాజుపై డౌట్స్.. తెలుగు తమ్ముళ్లు గరం

Somu Veerrajuఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరిగి ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్నారు. ఖాళీ అయిన 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో మూడు టిడిపి, ఒకటి జనసేన తీసుకోగా పట్టుబట్టి మరి బీజేపీ మరొకటి దక్కించుకుంది. అంతకు ముందు బీజేపీకి ఒక రాజ్యసభ స్థానం కేటాయించడంతో చంద్రబాబు ఆ సారి ఆ పార్టీకి ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వరని భావించారు. అయితే బీజేపీ ఆ స్థానానికి సోము వీర్రాజుని ఎంపికచేయడం తెలుగు తమ్ముళ్లకు మింగుడుపడటం లేదంట. అసలు టీడీపీ శ్రేణులు వీర్రాజుపై అంత ఆగ్రహంగా ఉండటానికి కారణమేంటి?


సోము వీర్రాజుకి మరోసారి మండలి పదవి

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును మరోసారి మండలి పదవి వరించింది. అనూహ్యంగా ఆయన పేరును అధిష్ఠానం ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజైన సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు బీ ఫాం పంపింది. దీంతో టీడీపీ కూటమి నేతలతో కలిసి వీర్రాజు నామినేషన్‌ వేశారు. గతంలో 2014లో కూడా టీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయనకు తొలిసారి మండలి సభ్యత్వం దక్కింది.


గత ఎన్నికల్లో రాజమండ్రి టికెట్ ఆశించిన సోము వీర్రాజు

ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిశాక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన వీర్రాజు.. 2024 ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్‌ లేదా రూరల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి ప్రయత్నించారు. అయితే సిటింగ్‌ స్థానాలను మిత్రపక్షాలకు ఇవ్వలేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేయడంతో ఆయన ఆశలు ఫలించలేదు. తాజాగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవడంతో తమ పార్టీకీ ఒక సీటు కేటాయించాలని బీజేపీ పెద్దలు కోరారు. బీజేపీ పెద్దలు అడగడంతో ..కాదనలేకపోయిన చంద్రబాబు అయిష్టంగానే కేటాయించారు. వీర్రాజును ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది.

జగన్ సానుభూతిపరుడిగా ముద్ర ఉన్న సోము

సోము వీర్రాజు పేరుకి బీజేపీ నాయకుడైనప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్ సానుభూతిపరుడిగానే టిడిపి శ్రేణులు చూస్తుంటాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు పై ఆయన చేసిన విమర్శలే కారణం. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన ఉన్న సమయంలో టిడిపి అంటే మండిపడుతుండేవారు. అప్పట్లో పొత్తుల ప్రస్తావన వస్తే టీడీపీని వెలి వేసినట్లు మాట్లాడేవారు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వైసీపీని టార్గెట్ చేయకుండా టీడీపీపైనే విమర్శలు గుప్పించేవారు. దాంతో పసుపు సైన్యం ఇప్పటికీ ఆయన్ని వైసీపీ కోవర్టుగానే భావిస్తుంది.

సోము వీర్రాజు ఎంపికపై టీడీపీ శ్రేణులు అసహనం

ఆ క్రమంలో సోమూ వీర్రాజుకి టీడీపీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడంపై టీడీపీలో నేతలు, కార్యకర్తలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులు కూడా మండి పడుతున్నారు. బీజేపీకి ఇప్పటికే ఒక రాజ్యసభ స్థానం కేటాయించిన నేపధ్యంలో అసలు ఆ పార్టీకి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడమే దండగని.. అలాంటిది ఏకంగా జగన్‌కి వీరవిధేయుడని పేరున్న సోము వీర్రాజుకు ఎలా కేటాయిస్తారని క్షేత్రస్థాయి టిడిపి కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సోము వీర్రాజు వైసీపీ అధ్యక్షుడ్ని టార్గెట్ చేస్తారా?

నిజానికి ఈ సీటును బీజేపీకి చెందిన ఉత్తరాంధ్ర నాయకుడు మాధవ్ కి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ సడన్ గా సోము వీర్రాజు పేరు ఖరారైంది. ప్రస్తుతానికి శాసనమండలిలో వైసిపిదే బలం. అక్కడ తమ వాయిస్ బలంగా వినిపించడానికి కూటమి పెద్దలు వైసిపి పాలన లో జరిగిన తప్పులను ఎండగట్టే నాయకులకే ఎమ్మెల్సీ సీట్లు కట్టబెడుతున్నారు. టిడిపి నుంచి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన నుండి నాగబాబులు వైసీపీని టార్గెట్ చేయడంలో ముందుండే నాయకులే. ఇటు చూస్తే టిడిపి పై విమర్శలు చేసిన సోము వీర్రాజుకి బీజేపీఎమ్మెల్సీ సీటు ఇచ్చారు.. మరి ఆయన ఆ స్థాయిలో వైసీపీపై విరుచుకుపడతారా? అసలు జగన్‌ని టార్గెట్ చేయగలరా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

సోము వీర్రాజు మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు

సోము వీర్రాజు మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు. ఆయన గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అయిన వెంటనే హైదరాబాద్ వెళ్లి మరీ మెగా ఫ్యామిలీని కలిసి వచ్చారు. ప్రస్తుతం సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ సీటు దక్కడం వెనక జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ పని చేసింది అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న బిజెపి నాయకుల్లో అంతో ఇంతో మాస్ ఇమేజ్ ఉంది సోము వీర్రాజుకు మాత్రమే అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారంట.

వైసీపీని ఎండగట్టే విషయాల్లో సోము వీర్రాజుకు అంత సినిమా ఉందా?

అయితే మాధవ్ తరహాలో సబ్జెక్ట్ బేస్డ్‌గా మాట్లాడటం, వైసీపీని ఎండగట్టే విషయాల్లో సోము వీర్రాజుకు అంత సినిమా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదలా ఉంటే 2027లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో మాధవ్ కి కూడా సీటు ఇవ్వడం ద్వారా ఎన్నికల ముందు ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా న్యాయం చేశామనే మెసేజ్ పంపే ఆలోచన బిజెపి హై కమాండ్ చేస్తోందంట.

వైసీపీ కోవర్ట్‌గానే చూస్తున్న తెలుగు తమ్ముళ్లు

ఏదైతేనేం కూటమిలో చేరింది అన్న ఒకే ఒక కారణంతో రాష్ట్రంలో ఖాళీ అయ్యే అన్ని పదవుల్లోనూ బిజెపి వాటాకు రావడంపై తెలుగుదేశం శ్రేణులు చిర్రుబుర్రులాడుతున్నాయి. ఇప్పటికే ఒక రాజ్యసభను ఆర్ కృష్ణయ్య కోసం తీసుకుపోయారు. విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానాన్ని కూడా బిజెపి అడుగుతోందంటున్నారు. అది కాకుండా ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఒకటి బీజేపీ పట్టుకుపోవడం.. అది కూడా చంద్రబాబుపై గతంలో విమర్శలు గుప్పించిన సోము వీర్రాజుకు కేటాయించడం తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి కారణమవుతోంది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×