Amardeep : అమర్దీప్ (Amardeep).. ఒకప్పుడు పలు సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈయన.. బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss S7)లో టైటిల్ ఫేవరెట్ గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా బీటెక్ యువత కష్టాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడడంతో ఎంతోమంది యువతకు బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పాలి. ఇక నువ్వా నేనా అని రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) తో పోటీపడ్డ అమర్దీప్.. చివరికి రన్నర్ గా నిలిచారు.ఇక ప్రస్తుతం హీరోగా ఒక సినిమా చేస్తున్న ఈయన మరొకవైపు పలు షో లలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమర్దీప్ బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానుల నుండి తాను, తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, అలాగే తాను బీటెక్ లో ఉన్నప్పుడు తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
బ్రేకప్ తోనే సగం చచ్చిపోయా – అమర్దీప్..
అమర్దీప్ మాట్లాడుతూ .. “నేను బీటెక్ చదివేటప్పుడు నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇక బీటెక్ అయిపోయింది మంచి నిర్ణయం తీసుకుందాము అనుకునే లోపే.? ఈ బ్రేకప్ జరిగింది. ప్రేమించిన అమ్మాయి.. నువ్వు వెయిట్ చేయి నీకోసం వస్తాను అని చెప్పింది. ఎందుకంటే నేను చెప్పినప్పుడు ఆమె నాకోసం ఎదురుచూసింది. ఇక ఆమె చెప్పినప్పుడు నేను కూడా ఆమె కోసం వెయిట్ చేయాలి కదా.. అలా ఆమె కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాను. ఆమెను నమ్మాను. కానీ ఆమె మాత్రం రాలేదు ఇక బ్రేకప్ అయిపోయింది. దీని తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మత్తుకి బానిస అయ్యాను. బాధ తట్టుకోలేక మందు తాగి రోడ్లపై తిరిగాను. ఇక నన్ను చూసి నా తల్లిదండ్రులు ఏమైపోతాడో అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అప్పట్లో నా బాధ నుంచి నేను తేరుకోవడానికి అదొక్కటే దారిలా అనిపించింది. ఇక ఆ తర్వాత నా రూట్ ఇది కాదు.. నాకు కావాల్సింది అది అని అర్థం చేసుకున్నాను. అలాంటి వాటికోసం చేస్తే రేపటి రోజున మనకు పేరు ఉంటుంది. కానీ ఇలాంటి అవసరంలేని వాటికోసం జీవితాన్ని వృధా చేసుకోవడం మంచిది కాదు అని నిర్ణయించుకొని అప్పుడే ఇంకొక యాంగిల్ ను బయటకు తీశాను. ప్రస్తుతం తేజూను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాను. ఎప్పటికీ హ్యాపీగానే ఉంటాను” అంటూ తెలిపారు అమర్దీప్.
నేనేంటో చూపిస్తా.. ప్రశాంత్ ఫ్యాన్స్ కి ఇన్ డైరెక్ట్ వార్నింగ్..
ఇకపోతే అమర్దీప్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆయన కోసం బయట పెద్ద యుద్ధమే చేసింది ఆయన భార్య తేజస్విని గౌడ (Tejaswini Gowda). బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా ఆమెపై దాడి ఆగలేదు. మాటల దాడి మాత్రమే కాదు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ తో పాటు ఆయన తల్లి, భార్యని కూడా ఇబ్బందులు పెట్టారు. వాళ్ల కారుని ధ్వంసం చేశారు. అయినా సరే ఆ సందర్భంలో నోరు మూసుకొని ఉన్న అమర్దీప్ ఇప్పుడు తానేంటో చూపిస్తానని తెలిపారు. నేను ఈ మాట అంటే ఏంట్రా నువ్వు చూపించేది అని కామెంట్ సెక్షన్లో ఒక బ్యాచ్ వచ్చి కామెంట్ చేస్తారు. వాళ్ళకి కూడా చెబుతున్నాను. కచ్చితంగా నేనేంటో మీ అందరికీ చూపిస్తాను ” అంటూ ఇండైరెక్టుగా పల్లవి ప్రశాంత్ ని అతడికి సపోర్ట్ చేసే వారిని టార్గెట్ గా చేస్తూ అమర్దీప్ కామెంట్లు చేశారు.