Comedian Ramachandra:ఒకానొక సమయంలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని.. ఇప్పుడు సడన్ గా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఇటు అభిమానులను కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటారు కొంతమంది సెలబ్రిటీలు. ఈ క్రమంలోనే ఒకప్పుడు తన అద్భుతమైన కామెడీతో.. హీరోల గ్యాంగ్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన కమెడియన్ రామచంద్ర (Comedian Ramachandra) గత 45 రోజులకు పైగా పక్షవాతం బారినపడి ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైన ఈయన.. ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయకపోతారా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మంచు వారసుడు మంచు మనోజ్(Manchu Manoj) ఆయనను కలిసి ఆర్థికంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు..
ఇప్పుడు బుల్లితెర సీరియల్ నటి కూడా వచ్చి ఆయనకు అండగా నిలిచింది. ఆయనను పరామర్శించడమే కాకుండా.. తన వంతు సహాయంగా కొంత డబ్బును ఇచ్చి అండగా నిలిచింది. ఆమె ఎవరో కాదు ‘గుండమ్మ కథ’ సీరియల్ తో తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న అనిత. తాజాగా రామచంద్ర ఇంటికి వెళ్లిన ఈమె అక్కడ ఆయనతో కాసేపు ముచ్చటించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అనంతరం ఆయనకు ఆర్థికంగా సహాయం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:Bhadrakaali trailer: విజయ్ ఆంటోని 25వ మూవీ ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
స్టార్ హీరోలు స్పందించకపోవడంపై నెటిజన్స్ ఫైర్..
ఈ విషయాలు బయటకు రావడంతో రామచంద్రకు సంబంధంలేని వ్యక్తులు కూడా వచ్చి రామచంద్రకు సహాయం చేస్తున్నారు.. మరి రామచంద్ర తో పెద్దపెద్ద హీరోలు సినిమాలు చేశారు కదా.. ఎందుకు వారు రామచంద్రకి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా తన ఆరోగ్య పరిస్థితి గురించి చిరంజీవి(Chiranjeevi ), రవితేజ (Raviteja) వంటి అగ్ర హీరోల వరకు చేరాలి అని.. రామచంద్ర కోరుతున్నారు. ఇక ప్రస్తుతం రామచంద్ర కు అండగా నిలిచిన సీరియల్ నటి అనిత (Anitha) పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రామచంద్రకు అసలు ఏమైందంటే?
ఫ్రెండ్ పిలిచారని షూటింగ్ నిమిత్తం వెళ్లిన ఈయన.. అక్కడ ఉన్నట్టుండి అనారోగ్యంతో ఇంటికి వచ్చారట. వెంటనే ఫ్యామిలీ డాక్టర్ ను కలవగా.. స్కానింగ్ చేసిన ఆయన బ్రెయిన్ లో లెఫ్ట్ సైడ్ రెండు బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని.. వాటిని తొలగిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పారట. అయితే ఇంటికి వచ్చిన రెండు రోజులకే ఎడమ కాలు, ఎడమ చేయి పనిచేయడం ఆగిపోయాయి. దీనికి కారణం ఆ బ్లడ్ క్లాట్స్ ని వాటిని తొలగిస్తే తప్ప ఈయన మామూలు స్థితికి రాడు అని తెలియజేసినట్లు సమాచారం. అయితే దీనికి ఖర్చవుతుందని, తన దగ్గర అంత స్తోమత లేదని, అందుకే సెలబ్రిటీల ద్వారా ఆర్థిక సహాయం పొందాలని చూస్తున్నట్లు రామచంద్ర తెలిపారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో మంచానికే పరిమితమై పెరాలసిస్ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు రామచంద్ర.
?utm_source=ig_web_copy_link