OTT Movie : రామాయణంలో అహల్యా పాత్ర అందరికి సుపరిచితమే. అయితే దీనికి ఒక మోడరన్ టచ్ ఇచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్ ని తెరకెక్కించారు. సస్పెన్స్ తో సాగే ఈ కథ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రాధికా అప్టే తన అందాలతో కనువిందు చేసిన ఈ షార్ట్ ఫిలిం, ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ఆసక్తికరంగా సాగే ఈ షార్ట్ ఫిలిం, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? దీని పేరు ఏమిటి ? కథ ఎలా ఉంటుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘అహల్యా’ (Ahalya) అనేది ఇండియన్ మిస్టరీ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్. సుజాయ్ ఘోష్ దీనిని రూపొందించారు. ఇందులో రాధికా అప్టే, సౌమిత్ర చట్టర్జీ, టోటా రాయ్ చౌధరి ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 2015 మార్చి 6 న ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. ఇది ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.
కలకత్తాలో ఇంద్ర సేన్ అనే ఒక పోలీసు ఆఫీసర్, అర్జున్ అనే వ్యక్తి మిస్సింగ్ కేస్ గురించి విచారించడానికి గౌతం ఇంటికి వస్తాడు. అయితే అక్కడికి వచ్చాక, అహల్యా అనే అందమైన యువతిని చూస్తాడు. గౌతంకి దాదాపు అరవై ఏళ్ళు ఉండటంతో మొదట ఆమెను అతనికి కూతురుగా భావిస్తాడు. అయితే ఆమె అతనికి భార్య అని తెలిసి ఆశ్చర్యపోతాడు. ఇక తేరుకుని అర్జున్ గురించి వాళ్ళని అడుగుతాడు. అర్జున్ మా దగ్గర మోడల్ గా పనిచేసేవాడని, మాకు కూడా కనిపించట్లేదని వాళ్ళు సమాధానం ఇస్తారు.
Read Also : ఏం థ్రిల్లర్ భయ్యా…. అమ్మాయి ఓపెన్ ఆఫర్… చొంగ కార్చారో ఆమె దెబ్బకు ఫసక్
ఇక ఇంద్ర చెకింగ్ కోసం ఆ ఇంటిని చెక్ చేస్తాడు. ఇంద్రతో అహల్యా ఫ్లర్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఇంద్రకు అహల్యా మీద ఫీలింగ్స్ కలుగుతాయి. ఇంద్ర అర్జున్ గురించి క్లూస్ వెతుకుతాడు. అహల్యా ఇంద్రతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో కొన్ని పాత బొమ్మలు కనిపిస్తాయి. ఇంద్రకు వాటిని చూసినప్పుడు అనుమానం వస్తుంది. ఇక ఆమెను చూస్తూ ఆగలేక ఆ పని కూడా కానిస్తాడు. దీంతో అసలు విషయం బయటికి వస్తుంది. ఇంద్ర కూడా ఇప్పుడు ఒక బొమ్మలా మారిపోతాడు. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది ? అహల్యతో గడిపిన వాళ్ళు ఎందుకు బొమ్మలుగా మారుతున్నారు ? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ ను చూసి తెలుకోండి.