Big tv Kissik Talks: త్రినయని సీరియల్ అంటే అందరికీ టక్కున హాసిని పాత్రలో నటించిన విష్ణు ప్రియ(Vishnu Priya) గుర్తుకు వస్తారు.. ఇలా త్రినయిని సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ స్టార్ మా లో ప్రసారమైన జానకి కలగనలేదు సీరియల్ లో మల్లిక పాత్రలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా దశబ్దన్నర కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ పలు సీరియల్స్ లో బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న విష్ణు ప్రియ తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv Kissik Talks)కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఈమె త్రినాయిని సీరియల్ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే వర్ష సైతం ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఆమె నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వర్ష విష్ణు ప్రియను ప్రశ్నిస్తూ నీ జీవితానికి సంబంధించి ఏదైనా ఒక గాసిప్ క్రియేట్ చేయాలి అంటే ఏది క్రియేట్ చేస్తావు విష్ణు అంటూ ప్రశ్న వేశారు. వెంటనే విష్ణు సమాధానం చెబుతూ తన సెకండ్ ప్రెగ్నెన్సీ(Secondy Pregnancy) గురించి ఒక గాసిప్ క్రియేట్ చేస్తాను అంటూ ఈమె సమాధానం ఇచ్చారు. అలాగే ఈ గాసిప్ ఎవరికైనా చెప్పి వారి రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలని చెప్పడంతో వెంటనే విష్ణు ప్రియ మరొక సీరియల్ నటి మేఘన(Meghana)కు ఫోన్ చేశారు.
ఇలా మేఘన ఫోన్ లిఫ్ట్ చేయగానే తను ప్రెగ్నెంట్ అనే డౌట్ వచ్చిందని చెప్పగానే ఒక్క సారిగా మేఘన ఎమోషనల్ అవుతూ కంగ్రాట్స్ చెప్పారు అయితే ఆమెకు పిల్లలు లేకపోవడంతో ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. ఇలా మేఘన ఏడుస్తున్నారని తెలియగానే వర్ష వెంటనే మేఘన గారికి క్షమాపణలు చెప్పారు దీంతో మేఘన ఫ్రాంక్ చేశారని తెలుసుకొని ఇద్దరికీ దెబ్బలు పడతాయి అంటూ మాట్లాడారు. ఇలా ఈమె ఒక గాసిప్ క్రియేట్ చేయడం అంటే తన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి గాసిప్ క్రియేట్ చేశారంటే ఆమె త్వరలోనే నిజంగానే ఈ గుడ్ న్యూస్ చెప్పబోతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇక విష్ణుప్రియ మరొక సీరియల్ నటుడు సిద్ధార్థను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇలా ఈ జంట కలిసి పలు సీరియల్స్ లో నటించారు. ఇలా వృత్తిపరమైన జీవితంలోను వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. సీరియల్స్ మాత్రమే కాకుండా ఈ జంట యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ కార్యక్రమంలో విష్ణు ప్రియ ఇంకా ఎలాంటి విషయాలను అభిమానులతో పంచుకున్నారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
Also Read: Big tv Kissik Talks: అమ్మకు క్యాన్సర్.. ఆఖరి చూపు కూడా లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న విష్ణు ప్రియ!