Mogalirekulu Devi : బుల్లితెరపై ఒకప్పుడు వచ్చిన సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సీరియల్స్ ని చూడ్డానికి జనాలు కచ్చితంగా టైం కి టీవీలకు అతుక్కుపోయేవారు. ఈ మధ్య రివెంజ్ డ్రామా స్టోరీలతో సీరియల్స్ వస్తున్నాయి. కానీ ఆ రోజుల్లో ఒక చక్కటి ప్రేమ కథతో ఎన్నో సీరియల్స్ వచ్చాయి.. అందులో ఎక్కువగా చెప్పే సీరియల్ మొగలిరేకులు. ఈ సీరియల్కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద అందరూ కలిసి ఈ సీరియల్ ని చూసేవారు. అంతగా పాపులర్ అయింది. ముఖ్యంగా ఈ సీరియల్ అంతగా హైలైట్ అవ్వడానికి కారణం మున్నా, దేవిల లవ్ స్టోరీ.. ఈ సీరియల్ లో దేవి పాత్రలో నటించిన లిఖిత కామిని ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆమె ఇండస్ట్రీకి ఎందుకు దూరమయ్యారు అన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం లిఖిత దూరమవడానికి అసలు కారణం ఏంటో వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మొగలిరేకులు సీరియల్ అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. మున్నా, దేవీలు ఎప్పుడు కలుస్తారు అన్నది యూత్ ని బాగా ఆకట్టుకుంది. దేవి పాత్రలో లిఖితకామిని చాలా అద్భుతంగా నటించింది. అయితే ఈమె అప్పట్లో చేసింది కొన్ని సీరియల్స్ అయినా కూడా బాగా ఫేమస్ అయింది. ఫ్యూచర్ లో మరిన్ని భారీ ప్రాజెక్టులు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సడన్గా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందుకు కారణం లేకపోలేదు.. కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయింది. దాంతో తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తుంది.
Also Read : వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న కాంట్రవర్సీ క్వీన్.. రచ్చ మాములుగా ఉండదు మరి..!
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ సీరియల్ మొగలిరేకులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రతిక్షణం ఊహించని మలుపులతో ఆద్యంతం ఆకట్టుకుంది ఈ సీరియల్. ఇప్పటికీ ఈ సీరియల్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. యూత్ ని ఆకట్టుకునే లవ్ ఎంటర్టైనర్ స్టోరీ తో పాటుగా.. యాక్షన్, థ్రిల్లింగ్ సీన్స్ కూడా ఉండడంతో ఈ సీరియల్ చాలా ఏళ్లు ప్రసారమైంది.. ఇందులో నటించిన నటీనటులు కొంతమంది నటనకు స్వస్తి చెబితే.. మరి కొంతమంది మాత్రం వరుస అవకాశాలను అందుకుంటూ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఆ మధ్య ఈ సీరియల్ ని మళ్లీ ప్రసారం చేశారు. ఇప్పుడు ఈ సీరియల్ కి సెకండ్ భాగం వేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా సీరియల్ ని టైప్ చేస్తూ మరీ రిక్వెస్ట్లు కూడా పెడుతున్నారని తెలుస్తుంది. దీనిపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. ఏది ఏమైన ఇప్పటిల్లో ఈ సీరియల్ వస్తే మళ్లీ టాప్ రేటింగ్ ను అందుకోవడం కామన్..