Big tv Kissik Talks: బిగ్ టీవీ ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమం ఒకటి. ప్రతివారం ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు హాజరవుతూ వారికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి బుల్లితెర నటి విష్ణు ప్రియ(Vishnu Priya) హాజరయ్యారు. విష్ణు ప్రియ త్రినయని సీరియల్లో హాసని పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే స్టార్ మా లో జానకి కలగనలేదు సీరియల్ లో మల్లిక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా విష్ణు ప్రియ ఈ కార్యక్రమంలో పాల్గొని తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగతమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.
త్రినయిని సీరియల్ లో హాసిని పాత్రకు తాను ఒప్పుకున్నప్పుడు చాలామంది ఎందుకు ఇలాంటి పాత్రలో నటిస్తున్నావు అంటూ ప్రశ్నించారు . బయటకు ఎక్కడికైనా వెళ్తే కోడిగుడ్డు టమోటాలు నామీద పడేవని తెలిపారు. ఇక ఈమె ఈ కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత విషయాల గురించి ముఖ్యంగా తన తల్లి గురించి మాట్లాడారు. అమ్మకు క్యాన్సర్ రావడంతో హాస్పిటల్లో ఉండిపోయిందని తాను రాత్రి రెండు గంటల సమయంలో అమ్మ దగ్గరికి వెళ్లడానికి వీలుండేదని అప్పుడు వెళ్తే ఐసియులోకు కూడా నన్ను వెళ్ళనిచ్చేవారు కాదని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
ఇలా రెండు గంటల సమయంలో ఐసీయులోకి అనుమతి లేకపోవడంతో అమ్మ ఆఖరి చూపును కూడా నోచుకోలేకపోయారని విష్ణు ప్రియ తెలిపారు. గత రెండు సంవత్సరాల క్రితం నాన్న కూడా మరణించారు అంటూ తన జీవితంలో జరిగిన చేదు సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఈమెకు తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ తల్లిలా చూసుకునే అత్తయ్య దొరికిందని మాత్రం తెలుస్తుంది. ఈమె మరొక సీరియల్ నటుడు సిద్ధార్థను ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తోటి నటీనటుల గురించి, తన పెళ్లి గురించి అలాగే తన కెరియర్ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక పూర్తి ఎపిసోడ్ శనివారం రాత్రి 7 గంటలకు బిగ్ టివి ప్లస్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విష్ణు ప్రియ ఇంకా ఎలాంటి విషయాలను అభిమానులతో పంచుకున్నారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక విష్ణు ప్రియా ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక బుల్లితెర కార్యక్రమాలలో కూడా తన భర్త సిద్దుతో కలిసి సందడి చేస్తున్నారు.
Also Read: Rajamouli: రాజమౌళికి ‘ జక్కన్న’ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? ఇంత స్టోరీ ఉందా?