Gundeninda Gudigantalu Prabhavathi: ప్రముఖ బుల్లితెర టీవీ ఛానల్ స్టార్ మా లో కొత్త కొత్త సీరియల్ ప్రసారం అవుతుంటాయి. ఇందులో ప్రసారమైన సీరియల్స్ అన్ని మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి. అయితే కొన్ని సీరియల్స్ ఏకంగా రెండో సీజన్ కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ ప్రసారమవుతున్న సీరియల్స్ లలో గుండెనిండా గుడి గంటలు కూడా ఒకటి.. టాప్ టీఆర్పీ రేటింగ్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సీరియల్ లో అత్త పాత్రలో నటించింది ప్రభావతి.. డబ్బున్న కోడల్ని ఒకలాగా.. పేదింటి అమ్మాయిని మరోలాగా చూసే అత్త క్యారెక్టర్ లో నటించింది.. అసలు పేరు అనీలా శ్రీకుమార్.. ఈమె మలయాళ నటి. ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించింది. తెలుగులో పలు సీరియస్లలో నటిస్తూ వస్తుంది.. ఈమె రియల్ లైఫ్ గురించి.. రెమ్యూనరేషన్ గురించి ఒకసారి తెలుసుకుందాం..
అచ్చం తెలుగు వనిత లాగా కనిపిస్తున్న ఈమె మలయాళ నటి.. శ్రీకుమార్ తన నటనా జీవితాన్ని 1992లో మలయాళ చిత్రం సర్గంతో ప్రారంభించింది . దీపాంగళ్ చుట్టుమ్ , ద్రౌపది , జ్వాలయాయి , గుండెనిండా గుడిగంటలు , కృష్ణతులసి, చిన్న తంబి వంటి ప్రముఖ సీరియల్స్‌లో కనిపించి, మలయాళ టెలివిజన్ నుంచి తెలుగులో బిజీ నటి అయ్యింది. శ్రీకుమార్ ఫిబ్రవరి 11, 1970న కోజికోడ్‌లోని చెవాయూర్‌లో జన్మించారు. శ్రీకుమార్ ప్రొడక్షన్ కంట్రోలర్, శ్రీకుమార్‌ను వివాహం చేసుకున్నారు మరియు ఈ దంపతులకు అభినవ్ మరియు ఆదిలక్ష్మి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఈమె ఎన్నో మలయాళ సీరియల్స్లలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం వరుసగా సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది.
మలయాళం ఇండస్ట్రీ నుంచి సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. తెలుగులో రెండు మూడు సీరియల్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సీరియల్స్ కూడా ఆమె నటనకు అవార్డు దక్కింది. ప్రస్తుతం తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.
Also Read: ‘మొగలిరేకులు’ దేవి ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఇదే..?
సినిమా హీరోయిన్లతో పోలిస్తే సీరియల్లలో నటిస్తున్న వాళ్లకి ఎక్కువ రెమ్యూనికేషన్ వస్తుందన్న విషయం తెలిసిందే.. ఈమధ్య డైలీ సీరియల్ ద్వారా ఎక్కువ మంది బాగానే సంపాదిస్తున్నారు. ముఖ్యంగా మలయాళీ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సీరియల్ యాక్టర్స్ రెండు చేతుల సంపాదిస్తూ బిజీగా ఉన్నారు. మాలీవుడ్ ముద్దుగుమ్మలకు తెలుగులో డిమాండ్ ఎక్కువే. గుండెనిండా గుడిగంటలు సీనియల్ లో ప్రభావతి పాత్రలో నటి స్తున్న అనీలా తెలుగులో కొన్ని సీరియల్స్ చేసిన బాగా పాపులర్ అయింది. ఒక్క రోజుకి ఈమె 25 వేలకు పైగా వసూలు చేస్తున్ననే సమాచారం.. ఈ లెక్కన చూస్తే.. సీరియల్ నెలకు 20 రోజులు షూటింగ్ ఉంటుంది. ఎటు లేదనుకున్న లక్షల్లో సంపాదన మాత్రం ఉంటుంది.