E-Paper
Advertisement

Intermediate Exams 2026: ఇంటర్ పరీక్షలు షురూ.. తెలంగాణలో 10 లక్షల మంది విద్యార్థుల బిగ్ ఫైట్

Intermediate Exams 2026: ఇంటర్ పరీక్షలు షురూ.. తెలంగాణలో 10 లక్షల మంది విద్యార్థుల బిగ్ ఫైట్
Advertisement

Intermediate Exams 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమవుతున్నాయి. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,89,126 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. నేటి నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసింది.

అయితే పరీక్షల సమయపాలన విషయంలో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. గతంలో అమల్లో ఉన్న ‘ఒక్క నిమిషం ఆలస్యం’ నిబంధనపై విద్యార్థుల్లో ఉన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, ఈసారి 5 నిమిషాల వరకు వెసులుబాటు కల్పించారు. అంటే, 9:05 గంటల వరకు వచ్చే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అయితే, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవడం ఉత్తమం.

Advertisement

అంతేకాకుండా పరీక్షల నిర్వహణలో ఎటువంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసింది. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చడంతో పాటు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది. విద్యార్థులు తమ వెంట కేవలం హాల్ టికెట్, రైటింగ్ ప్యాడ్, పెన్నులు మాత్రమే తీసుకెళ్లాలి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోరు.

విద్యార్థుల సౌకర్యార్థం రవాణా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పరీక్షా సమయాల్లో విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా ఇబ్బందులు తొలగనున్నాయి. అలాగే, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్షా సమయంలో మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

Advertisement

పరీక్షల ఒత్తిడిని అధిగమించడానికి, విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని అందించడానికి ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు అనవసరమైన ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లను కూడా అందుబాటులో ఉంచారు.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×