E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: సాగర్ గుట్టు రట్టు.. రామరాజు మాటతో కన్నీళ్లు.. నర్మదకు షాకివ్వబోతున్న భాగ్యం..

Illu Illalu Pillalu Today Episode: సాగర్ గుట్టు రట్టు.. రామరాజు మాటతో కన్నీళ్లు.. నర్మదకు షాకివ్వబోతున్న భాగ్యం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా వనజకు 20 లక్షలు ఇచ్చి ఆ తర్వాత వెంటనే తన తండ్రితో ఈ విషయాన్ని తేల్చుకోవాలని తన పుట్టింటికి వెళ్తుంది.. ఎందుకు నాన్న నువ్వు ఇలాంటి పని చేశావు అని నర్మదా వాళ్ళ నాన్నని నిలదీసి అడుగుతుంది. మీ అల్లుడికి జాబ్ రావడం కోసం నువ్వు గొప్పగా చెప్పుకోవడం కోసం ఇలా లంచం ఇచ్చి జాబును కొనమని చెప్పావా? కొంచమైనా నీకు బుద్ధుందా? అని నర్మదా అంటుంది.. నేనేమీ తప్పు పని చేయలేదు. నా అల్లుడు గొప్పగా ఉండాలని అనుకున్నాను. అందుకే ఇలా చెప్పాను నేను పోస్ట్ చేసిన ఆ జాబ్ లో జాయిన్ అవ్వాలి. డబ్బులు కట్టాలి అని చెప్పలేదు అని ప్రసాద్ అంటాడు. అయినా కానీ రేపు డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకున్నాడు అన్న విషయం తెలిస్తే నాకు ఇంట్లో మర్యాద గౌరవం ఉంటాయా..

జీవితాంతం నేను నిందలు మోస్తూ బతకాల అని నర్మదా ప్రసాద్ ని అడుగుతుంది. నర్మదా మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసుకోండి నేను వెళ్ళిపోతున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. శ్రీవల్లి ఎలాగైనా సరే సాగర్ ప్లాన్ గురించి బయట పెట్టాలని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శ్రీవల్లి భాగ్యం ఆనందరావు ముగ్గురు కూడా గెటప్ లు మార్చుకొని సాగర్ కి జాబ్ ఇచ్చినా ఏజెంట్ దగ్గరికి వెళ్తారు.. అక్కడ అతన్ని మాటల్లో పెట్టి శ్రీవల్లి అతనికి లైన్ వేసినట్లు నాటకమాడి నిజమే రాబట్టాలని అనుకుంటారు.. ఆ ఏజెంటు శ్రీవల్లి మాయలో పడిపోతాడు. ఇక శ్రీవల్లి తనని ట్రాప్ చేసి ఎలాగైనా సరే సాగర్ డీటెయిల్స్ ని కనుక్కోవాలని అనుకుంటుంది. ఇక ఇద్దరూ కలిసి అతని మాయలో ముంచేస్తారు.. మా ఆయనకి జాబ్ కావాలని అడగగానే ఐదు లక్షల కట్టాలని అతను అంటాడు. డబ్బులు కట్టిన తర్వాత మీరు డబ్బులు తీసుకొని పారిపోతే ఎలా అని భాగ్యం అడుగుతుంది. నేను అంత మోసం చేసేవాళ్లకు కనిపిస్తున్నానా మీకు మిగతా వాళ్ళకి అయితే పది లక్షలు మీ కుట్టి ప్రేమగా అడిగింది కాబట్టి ఐదు లక్షల ఒప్పుకున్నాను.. నేను జాబులు ఇప్పిచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి ఎవరికి ఫోన్ చేయమంటారో చెప్పండి వాళ్లకి ఫోన్ చేసి అడుగుతాను అని అతను అంటాడు.

అక్కడ సర్టిఫికెట్లలో సాగర్ ఫోటో కనిపించడంతో అందరూ షాక్ అవుతారు.. అయితే అది చూపించి ఇతను జాబ్ ఎన్ని లక్షలకు కొన్నాడు అని అడుగుతారు. 25 లక్షలు పెట్టి జాబ్ కొన్నాడు అని చెప్పగానే శ్రీవల్లి భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆ ఫైల్ నీ వీడియో తీయమని భాగ్యం చెప్తుంది. ఇక మొత్తానికి శ్రీవల్లి భాగ్యం ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది.. ఎలాగైనా సరే మనము ఈ సాగర్ బండారు అని బయట పెట్టాలి అని అనుకుంటారు..

Advertisement

ఇక సాగర్ నర్మదా ఇద్దరు లోపలికి వస్తారు.. నాకు తెలియదు సాగర్ నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు నన్ను వదిలేయ్ నాకు ఏది చెప్పకు అని నర్మదా అంటూ వస్తుంది. అది విన్న వేదవతి ఏంట్రా ఏం జరిగింది నర్మదా ఎందుకు అలా ఉంది అని అడుగుతుంది.. ఏం లేదమ్మా నాకు జాబ్ వచ్చింది కదా వాళ్ళ నాన్న పార్టీ వాళ్ళనే అనుకుంటున్నాడు పార్టీకి బంధువులని అందరిని పిలవాలని అనుకుంటున్నాడు. మిమ్మల్ని కూడా పిలుస్తానంటే వద్దు నేను చెప్తానని ఆయనతో చెప్పాను. ఆయన పదేపదే మిమ్మల్ని తీసుకురావాలని అన్నాడు అని సాగర్ అంటాడు. మీరు తప్పకుండా పార్టీకి రావాలి నాన్నగారు అని అనగానే రామరాజు నేను మూటలు మూసుకుని ఆ పార్టీకి పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు.

నాలాంటి వాళ్ళు అక్కడికి వస్తే నీకే అవమానంగా ఉంటుంది.. నేను రాను అని చెప్పగానే సాగర్ నర్మద ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇక తర్వాత ఎంత చెప్తున్నా సరే వినకపోవడంతో వేదవతికి అనుమానం వస్తుంది.. అయినా వాళ్ల నాన్న పార్టీ అరేంజ్ చేస్తే నర్మద చెప్పాలి కదా నువ్వు ఎందుకు చెప్తున్నావు అని చెప్పగానే.. ఇంట్లో వాళ్లందరికీ బాగోలేదు కదా అత్తయ్య అందుకే ఈ పార్టీ ఎందుకని నేను అన్నాను అందుకే కాస్త కోపంగా ఉన్నాను. మీరు తప్పకుండా రావాలి అని అన్న కూడా రామరాజు నేను రాను అని మొహం మీదే చెప్పేస్తాడు.. శ్రీవల్లి భాగ్యం వల్ల అక్కడికొచ్చి ఏం ఘనకార్యం చేశారని ఇప్పుడు పార్టీకి రమ్మంటారు అని అడుగుతుంది..

Also Read :అక్షయ్ కు రాజేశ్వరి వార్నింగ్..కన్నీళ్లు పెట్టుకున్న అవని.. అడ్డంగా దొరికిపోయిన పల్లవి..

శ్రీవల్లి నిజం చెప్పకపోతే భాగ్యం మాత్రం అడ్డుకుంటుంది.. అయితే వేదవతి రామరాజు మాటకి బాధపడిపోతుంది.. నర్మదా నువ్వేం బాధపడకు నార్మదా నేను మీ మావయ్య గారిని ఒప్పించే పని చేస్తాను కచ్చితంగా వస్తాను అని అంటుంది.. ఇక శ్రీవల్లి ఎందుకమ్మా నన్ను ఆపావు నిజం చెప్పేసినట్టే వాళ్ళ పరిస్థితి అయిపోయేది కదా అని అంటుంది.. ఇప్పుడు నిజం చెప్తే నలుగురికే తెలుస్తుంది రాత్రి పార్టీలో నిజం చెప్తే అందరికీ తెలిసిపోతుంది కదా అందుకే అని భాగ్యం అంటుంది.. ఇక తర్వాత ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా కార్ షోరూం కి వెళ్తారు.. అక్కడికి వెళ్ళగానే ప్రేమ ఇన్ని లక్షలు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చాయి రా అని అడుగుతుంది.. కార్ సెలెక్ట్ చేయి ఆ తర్వాత నేను చెప్తాను అని ధీరజ్ అంటాడు.. అక్కడ కూడా వీళ్లిద్దరు గొడవ పడడంతో ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ తీరదుల మధ్య ప్రేమ చిగురిస్తుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×