Gundeninda GudiGantalu Today episode January 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. పొద్దున్నే బాలు మీనా దగ్గరికి వస్తాడు బాత్రూంలో సోప్ లేదని చెప్పాను కదా సోప్ పెట్టావా అని అంటాడు. ఆ సెల్ఫ్ లో సోప్ ఉంది మీరు వెళ్లి కింద గదిలో స్నానం చేయండి అని అంటుంది ఏం మన గదికి ఏమన్నా మన గదికి ఏమైంది మన గదిలో బాత్రూంకి ఏమైనా రిపేర్లు చేస్తున్నారా? ఏమన్నా అయిందా అని అడిగితే మన గదిని రాత్రి వాళ్లకి ఇచ్చాం కదా మీరు కామెడీగా మాట్లాడొద్దని అంటుంది. నువ్వెక్కడ చేసావంటే నేను ఇక్కడ బాత్రూం లోనే చేశానని అంటుంది. వాళ్ళని ఎలా బయటికి పంపించాలని చూసుకుంటానని బాలు పైకి వెళ్తాడు పైన రవి గారు రెడీ అవ్వడం చూసి ఏం బాబు శోభన్ బాబు అంత అయిందా రెడీ అవుతున్నావా అద్దంలో ముస్తాబు తీరిందా? ఇక బయటికి వెళ్ళు అనేసి బయటికి గెంటేస్తాడు. లగేజ్ ని తీసుకొని బయటికి రవిని గెంటేస్తాడు బాలు. ఇక రవి కిందకి సైలెంట్ గా వచ్చి ఏం మాట్లాడకుండా టిఫిన్ చేస్తాడు బాలు వెంటనే వచ్చి మీనా టిఫిన్ పెట్టు అనగానే రండి కూర్చోండి అంటుంది మీనా.. అని నేను టిఫిన్ దానికి నేను కలిసి కూర్చొని నిలిచిన తినను వాళ్లంతా మర్యాదస్తులు కదా వాళ్ళని కూర్చొని తినమను ఈ ప్రభావతమ్మ కొడుకుని తెచ్చుకునింది కదా సంకనేసుకుని గోరుముద్దలు తినిపించమను అని వెళ్ళిపోతాడు. మీనా ను గదిలోని వస్తువులన్నీ తీసుకోమని చెప్పి గదికి తాళం వేసుకుని బయటికి వెళ్లిపోతాడు. ప్రభావతి బాలు గదికి తాళం వేసుకోవడానికి మీనానే కారణమని తిడుతుంది. ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పాలు తాళం వేసుకుని రావడం చూసి ప్రభావతి నిలదీస్తుంది.. ఆ తర్వాత రెండు రోజులే కదా సర్దుకోలేరా అని ప్రభావతి అంటుంది. ముందు రెండు రోజులే అంటావ్. ఆ తర్వాత వాళ్లను పర్మినెట్ గా అక్కడే ఉంచేస్తావ్. వాడిని తీసుకొచ్చేముంది ఎక్కడ ఉంచాలో ముందే నిర్ణయించుకోవాల్సింది. వీడు చేసిన పనికి ఇంట్లోకి రానివ్వడమే తప్ప’అని అంటాడు. మొండి పట్టు పట్టకుండా తాళం ఇవ్వమని మీనా రిక్వెస్ట్ చేసిన బాలు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. తమని రూమ్ ఎక్కడ ఇవ్వమంటుందోనని మనోజ్ రోహిణి అక్కనుండి మెల్లగా జారుకుంటారు. బాలు అన్న మాటలకు రవి బాధపడుతూ బయటకు వెళ్ళిపోతాడు.. ఇక మీనా ను ప్రభావతి తిడుతుంది నీ కళ్ళు చల్లబడ్డాయా ఏం మొగుడు పక్కలో లేకుంటే నీకు పడుకోబుద్ధి కాలేదా అనేసి దారుణంగా మాట్లాడుతుంది.. దానికి మీనా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళింది రవి మళ్ళీ లోపలికి వచ్చి లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రభావతి ఆపి ఎక్కడికి రా వెళ్తున్నామని అడుగుతుంది. ఇంట్లో చోటు లేనప్పుడు నేను అత్తగారింటికైనా వెళ్తాను లేదు ఎక్కడైనా ఉంచి చూసుకుంటానో ఆ మాత్రం నేను భార్యని పోషించుకోలేనా అని రవి.. నువ్వేం బాధపడకు రా నువ్వు వచ్చేలోగా నీకు రూమ్ సిద్ధంగా ఉంటుంది. అని ప్రభావతి రవిని బయటికి పంపిస్తుంది. ఇక మీ నాకు మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది..
నీకు కావాల్సింది ఇదే కదా ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా. డబ్బున్నా ఇద్దరు కోడలు సంతోషంగా ఉండాలని నేను అనుకున్న కానీ నువ్వు వాళ్ళని చూసి కుళ్లుకుంటున్నావ్ అందుకే నువ్వు ఇలా చేస్తున్నావ్ నీ మొగుడిని ఉసిగొలిపి తాళం వేసుకొని ఇలా చేసావని ప్రభావతి మీనాను అంటుంది. నీ మొగుడికి ఏ మందు పెట్టావే? ఇంతగా మార్చేసావు మీ కొంగును కట్టేసుకున్నావ్ అని అంటాడు అంటుంది.. మీనాని సమయం సందర్భం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ప్రభావతి.. ఇక మీనా బాలుకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది మొత్తానికి బాలుని ఇంటికి రప్పిస్తుంది. మరోవైపు శృతి డబ్బింగ్ స్టూడియో కు రవి వెళ్తాడు. రవిని చూసి సర్ప్రైజ్ అవుతుంది. మనం టూర్ కి వెళ్దామని చెప్తాడు. కానీ, రవిని అలా చూసిన శృతి ఏం జరిగిందని ఆరా తీస్తుంది. దీంతో అసలు విషయాన్ని చెప్పేస్తాడు. అయినా.. ఇంటికి వెళ్ళిపోదాం ముందుగానే ఈ విషయాలను ఊహించాను. వాళ్ళ రూమ్ లో వాళ్లు ఉండటమే న్యాయం కదా అంటూ రవికి సర్ది చెబుతోంది. కానీ, రవి ఆందోళన చెందుతుంది ఇంటికి బయలుదేరుతారు.
ఇక ప్రభావతి మీనా పై కావాలనే మాటలతో తిడుతుంది. మీనా ఏడుస్తూ బాధపడుతుంది. మొగున్ని కొంగుకుముడి వేసుకున్నవ్.. వాడికి ఏ మందు పెట్టావే.. ఈ విషయం శృతికి తెలిస్తే .. అక్కనుండే అక్కడికి వెళ్ళిపోతుంది. వెంటనే బాలుకి ఫోన్ చేసి.. వచ్చి రూమ్ తాళం తీయమని చెప్పు అని మీనాకు ఆర్డర్ వేస్తోంది ప్రభావతి. మీ మాటలు పడలేకనే ఇప్పటికి వందసార్లు ఫోన్ చేశా.. అయినా బాలేదు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటుంది మీనా. నేను ఏం చెప్పినా వినను. రవి, శృతి ఇంటికి వచ్చేలోపు బాలు వచ్చి రూమ్ తాళం తీయాలి. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. ఇక మొత్తానికి బాలు ఇంటికి వస్తాడు. మీనా ఏడవడం చూసి అందర్నీ నిలదీస్తాడు. ప్రభావతి అన్న మాట తెలుసుకుని షాక్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..