Top 5 TV TRP Rating: సాధారణంగా ఒక సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మంచి సక్సెస్ అందుకుంటే, ఇంకొన్ని వారాలు థియేటర్లలో కొనసాగుతుంది. లేకపోతే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత ఏదైనా పండుగ లేదా ముఖ్యమైన రోజు లేదా శని, ఆదివారాలలో ఆ సినిమాల శాటిలైట్ హక్కులు దక్కించుకున్న టీవీ చానల్స్ లో ప్రసారం చేస్తూ ఉంటారు.అయితే ఇక్కడ కూడా అత్యధికంగా టాప్ టీవీ టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా అందులో అల్లు అర్జున్ (Allu Arjun) చిత్రాలు సృష్టించిన టిఆర్పి రేటింగ్ కి ఇక బన్నీని మించినోడు లేడా అంటూ నెటిజన్స్ అలాగే అభిమానుల నుంచి కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. మరి పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
పుష్ప -2 రికార్డ్ బ్రేక్ చేస్తుందా..?
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. థియేటర్లలో రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పుడు టీవీలో కూడా అత్యధిక టీఆర్పి రేటింగ్ సాధించే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే ఇప్పటికే పుష్ప-1 సినిమాకు టెలివిజన్ రేటింగ్ లో సుమారుగా 25.2 టిఆర్పి రేటింగ్ రావడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు ఎంతగానో మద్దతు ఇచ్చారు అనే విషయం స్పష్టం అవుతుంది. అలాగే పుష్ప-2 కూడా అదే రేంజిలో టీవీ రేటింగ్ సాధించే అవకాశం ఉందని అటు విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
టాప్ -5లో మూడు చిత్రాలు బన్నీవే..
అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా ఇప్పటికీ టెలివిజన్లో నెంబర్ వన్ టిఆర్పి రికార్డును సొంతం చేసుకుంది. 29.4 టిఆర్పి రేటింగ్ తో మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా రేటింగ్ ను ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదు. అలాగే బన్నీ మరొక సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ కూడా 21.7 టిఆర్పి తో ఈ లిస్టులో ఐదవ స్థానంలో నిలిచింది. అటు మరొకవైపు మహేష్ బాబు(Maheshbabu) నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 23.4 టిఆర్పి రేటింగ్ తో మూడో స్థానంలో నిలవగా.. ప్రభాస్ (Prabhas) ‘బాహుబలి 2’ 22. 7 టిఆర్పి రేటింగ్ తో టాప్ -4లో నిలిచింది. ఇక రాబోయే రోజుల్లో పుష్ప 2 ఓటిటిలో మాత్రమే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా సరికొత్త సంచలనాలు సృష్టించబోతోందని స్పష్టం అవుతుంది. ఇప్పటివరకు టాప్ టిఆర్పి రికార్డుల్లో ఉన్న ఈ చిత్రాలను బన్నీని మళ్లీ కొట్టగలడు అనే నమ్మకం కూడా అభిమానులలో భారీగా పెరిగిపోయింది. ఏది ఏమైనా టాప్ ఫైవ్ లో ఏకంగా టాప్ 3 చిత్రాలు బన్నీవే ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈమె సినిమాలలో కామెడీ, మాస్ ఎలిమెంట్స్, సంగీతం అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాబట్టి ఇటు బుల్లితెరపై కూడా మంచి టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకున్నారు అని చెప్పవచ్చు.