Gundeninda GudiGantalu Today episode march 4th : నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ కు జాబ్ లేకపోవడంతో రోహిణిని అందరు నానా మాటలు అంటారు. రోహిణిని అనడంతో ఏం చెప్పాలో తెలియక ఫీల్ అవుతుంది. మనోజ్ క్షమించమనీ అడిగినా కూడా రోహిణి సహించలేకపోతుంది. ఇదంతా సహించలేకపోయిన రోహిణి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. మనోజ్ వచ్చి ఎంత ఓదార్చాలని ప్రయత్నించినా కూడా రోహిణి మాత్రం అసలు వినదు. తన ఫ్రెండ్ విద్య దగ్గరికి వెళ్లి మనోస్ నన్ను దారుణంగా మోసం చేశాడని బాధపడుతుంది. నేను ఒక పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడ్డాను ఇప్పుడు మనోజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉన్నాను నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతున్నాను అని అంటుంది. మనోజ్ జాబ్ లేదని చెప్పకపోవడం తప్పే కానీ నువ్వు ఎంత పెద్ద మోసం చేసి ఆ ఇంటికి కోడలు అయ్యావు ఆ విషయం తెలిస్తే మీ పరిస్థితి ఏంటి నువ్వు ఇప్పుడు ఎన్ని మాటలు అయితే మనోజ్ ను అన్నావో అవన్నీ రివర్స్ నీకే తగులుతాయి అని నువ్వు ఆలోచించవా అని విజ్జి హెచ్చరిస్తుంది.. మనోజ్ బాలుతో గొడవ పడతాడు. ఇద్దరు కొట్టుకుంటారు. సత్యం బాలు, మనోజ్ ను రోహిణిని వెతకడానికి వెళ్లమని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి ఎక్కడికి వెళ్ళిందో వెతకాలి అని మనోజ్ ని బాలుని బయటకు పంపిస్తాడు. వాళ్ళిద్దరూ రోహిణిని వెతుకుతూ ఉంటారు అయితే కేపీ పాలెం బస్సు ఎక్కిందని పార్లర్లో ఒక అమ్మాయి చెప్పడంతో అక్కడికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. మీనా ఫోన్ చేస్తే మీనా కూడా రమ్మని బాలు అంటాడు. ఇక బాలు మనోజ్ని ఆట ఆడుకుంటాడు నువ్వు జాబ్ లేకుండా పార్కులో పడుకున్నావ్ ఆ పాలరమ్మ నిన్ను వదిలేసి పోయింది మధ్యలో నాకేంటి తిప్పలు. నిన్ను ఏసుకొని ట్రిప్ కి వెళ్ళినట్టు వెళ్తున్నాను అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటాడు.
ఇక మీనా ఫోన్ చేస్తుంది రోహిణి దొరికిందా ? ఎక్కడికెళ్ళిందో తెలిసిందని బాలుని అడుగుతుంది. అయితే ఇంక బాలు మేన దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుంటాడు. ఇక మీనాని వెనక కూర్చోకుండా ముందు కూర్చొమనీ వెనక్కి పంపిస్తాడు. మీనాని చూసుకొని ఇంకా రెచ్చిపోతాడు బాలు. ఒకవైపు బాలు నాకు ఆకలేస్తుందని ఫుడ్ ని తెచ్చుకుంటాడు. కానీ మనోజ్ మీనా మీరు కాస్త మాట్లాడడం మానేసి కారును పోనిస్తారా అని అంటారు అయినా కూడా బాలు రెచ్చిపోయి పాటలు పాడుతాడు. ఇక మనోజ్ నేను వెళ్ళిపోతాను కారు ఆపరా అని అంటాడు కానీ బాలు మాత్రం నడుచుకుంటూ వెళ్ళిపోతావా అయితే వెళ్ళు మరి నీ చేతిలో చిల్లి కవ్వ కూడా లేదు అంటూ ఎగతాళి చేస్తాడు.
ఇక మీనా బాలు మనోజ్ కేపీ పాలెం లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతుంటారు. ప్రభావతి కోడలు పోయిందని బాధతో ఉంటుంది అప్పుడే కామాక్షి ఇంటికి వస్తుంది. మనోజ్ చేసిన పనికి రోహిణి వెళ్ళిపోవడం బాధగా ఉంది అని అంటుంది. ఇన్ని రోజులు మనోజ్ని వెనకేసుకుని వచ్చావు అందుకే వాడు అలా తయారయ్యాడు పార్కులో పల్లీలు తింటూ ఆడుకుంటూ వారు ఎంజాయ్ చేశారు తప్ప నువ్వు జాబ్ తెచ్చుకోమని అని అంటే వాడు తెచ్చుకునే వాడు కానీ నువ్వు లైట్ తీసుకున్నావు వాడు కూడా లైట్ తీసుకున్నాడు ఇప్పుడు రోహిణి మోసపోయినట్టు ఫీల్ అయ్యి వెళ్ళిపోయింది అని హెచ్చరిస్తుంది.
ప్రతిదానికి బాలును అంటావేంటి బాలు వాడు చేసింది బయటపెట్టాడు. అయిన రోహిణి అంత గొప్పింటి అమ్మాయి వాళ్ళ నాన్నకి చెప్పి సీరియస్గా తీసుకుంటే ఆయన డబ్బు లేకపోతే చంపిన చంపుతాడు లేదా ఇంకా ఏదైనా చేయొచ్చు కానీ నువ్వు జాగ్రత్త వదినా అని కామాక్షి వరుసగా శాఖలు ఇస్తుంది. ఇక మార్చురీలు అలాగే రైల్వే ట్రాక్లు కూడా వెతకమని చెప్పు వదినా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కామాక్షి నోటికి ఎంత వస్తే అంతేనా అపసెకనాలే ఏది మంచి మాట్లాడుతూ అని ప్రభావతి ఫీల్ అవుతుంది. బాలు మనోజ్ ని సందు దొరికితే ఆడుకుంటూనే ఉంటాడు బా పై సెటైర్లు వేస్తూనే ఉంటాడు. ఇక మనోజు కార్ ఆపరా నేను వెళ్ళిపోతానని అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో రోహిణి వాళ్ళ అమ్మతో మనజ్తోవిడాకులు తీసుకోబోతున్నట్లు చెబుతుంది. ఇక బాలు మీన మనోజ్ సుగుణమ్మ ఇంటికి వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి..