OTT Movie : క్రేజీ స్టోరీలతో మలయాళం సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. వీటిని మాత్రం వదిలి పెట్టకుండా చూస్తున్నారు ప్రేక్షకులు. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అడవిలో విందు కోసం ఒక జింకను వేటాడటంతో మొదలయ్యే ఈ కథ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో చూపు తిప్పుకోకుండా చేస్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘మీషా’ (Meesha) ఒక మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఎమ్సీ జోసెఫ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో కత్తిర్, హక్కీం షా, సుధీ కోప్ప, షైన్ టామ్ చాకో, జెయో బేబీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 జూలై 31న థియేటర్లలో రిలీజ్ అయింది. Sun NXT, మనోరమా మాక్స్‌లో 2025 సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్‌లో ఉంది. ఇది IMDbలో 9.4 /10 రేటింగ్ తో మలయాళం, తమిళం, తెలుగు వెర్షన్స్ లో అందుబాటులో ఉంది.
మిథున్ అడవిలో ఒక గార్డ్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. మిథున్ తన పాత స్నేహితులు ఆనందు, ఇమోధ్ లను 2 సంవత్సరాల తర్వాత అడవిలో ఒక విందుకు పిలుస్తాడు. వాళ్లు కలిసి సరదాగా, గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. మిథున్ కిథో అనే ఒక హంటర్‌ను కూడా ఆహ్వానిస్తాడు. వాళ్లందరూ కలిసి ఒక జింకను వేటాడటానికి ప్లాన్ చేస్తారు. మొదట అంతా ఫన్‌గా, ఎక్సైటింగ్‌గా ఉంటుంది. కానీ రాత్రి అవ్వగానే అడవిలో భయంకర సంఘటనలు మొదలవుతాయి. స్నేహితుల మధ్య టెన్షన్ పెరుగుతుంది, ఎవరు నిజమైన స్నేహితుడు, ఎవరు మోసం చేస్తున్నారు అనే సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది.
Read Also : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా
మిథున్ ఈ హంట్‌ను ఒక సీక్రెట్ కారణంతో ప్లాన్ చేశాడని తెలుస్తుంది. అడవిలో ఒకరు హంటర్‌గా మారి, మిగిలిన వాళ్లను టార్గెట్ చేస్తారు. ఎవరు ఎవరిని చంపడానికి ట్రై చేస్తున్నారో అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళకి అడవి భయంకరంగా కనిపిస్తుంది. వాళ్లు సర్వైవ్ వవ్వడానికి ఫైట్ చేయాల్సి వస్తుంది. ఒకరిమీద ఒకరికి నమ్మకం పోతుంది. ఇక చివరి వరకు కథ సస్పెన్స్ తో నడుస్తుంది. వీళ్ళంతా ప్రాణాలతో బయట పడతారా ? మిథున్ ఎందుకు వీళ్ళను టార్గెట్ చేశాడు ? అనే విషయాలను, ఈ మలయాళం సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.