Gundeninda GudiGantalu Today episode October 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. కామాక్షి ఇంటికి ఒక్కొక్కరు రావడం చూసి ప్రభావతి నిరాశపడుతుంది. అయితే ఒకతను వచ్చి డాన్స్ స్కూల్ గురించి వివరాలు అడగగానే అన్ని విషయాలు చెబుతుంది. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను మీరు ఇంతగా వాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మూడింతల బిల్లు వస్తుంది అని షాక్ ఇస్తాడు.ఆ తర్వాత ఓ అతను తన కూతుర్ని తీసుకొని డాన్స్ క్లాస్ కోసం వస్తాడు. అయితే కామాక్షి మాత్రం ఇక్కడ డాన్స్ లేదు ఏం లేదు ఊరికే బోర్డు పెట్టాము అని వాళ్ళని పంపించేస్తుంది. ప్రభావతి ఇంటికెళ్లి ఎవ్వరూ రావట్లేదు అంటూ బాధపడుతుంది. ఆ తర్వాత సత్యం ప్రభావతిని చూసి ఏమైంది అలా ఉన్నావు వస్తారులే పెట్టిన ఒక్కరోజుకే రావాలంటే రారు కదా.. నువ్వేం బాధపడకు అంటూ ధైర్యం చెప్తాడు. బాలు వచ్చి సెటైర్లు వేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రభావతి అన్నం తినకుండా బాధపడుతూ ఉంటుంది. మీరు నన్ను ఇలా ఎత్తి పొడుస్తున్నారు కాబట్టే నాకు ఆకలి వేయడం లేదు అంటూ అంటుంది. నాకేం వద్దు మీరే తినండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మీనా అయ్యో అత్తయ్య గారు తినకుండా వెళ్ళిపోతున్నారు అని బాధపడుతూ ఉంటుంది.. నువ్వేం బాధపడకు అమ్మ నేను తన ఒప్పించి తీసుకొని వస్తాను నువ్వు మా ఇద్దరికీ అన్నం వడ్డించు అని అంటాడు.. అత్తయ్య బాధను తగ్గించాలి అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు పాపం అన్నం కూడా తినట్లేదు అని మీనా బాధపడుతూ ఉంటుంది..
మీనా బాధలు చూసినా బాలు నా దగ్గర ఒక ఐడియా ఉంది అది ఫాలో అయితే కచ్చితంగా మా అమ్మ రేపటి నుంచి భోజనం చేస్తుంది అని అంటాడు. ఇక తర్వాత ప్రభావతి ఇంట్లో దోమలకు చంపుతూ ఉండటం చూసిన కామాక్షి సెటైర్ల వర్షం కురిపిస్తుంది. ఏంటి వదిన స్టూడెంట్స్ ఎవరు రాకపోవడంతో ఇంట్లో ఉన్న దోమల్ని చంపుతున్నావా అని అంటుంది.. ఏం చేయమంటావు కామాక్షి ఇప్పట్లో వస్తారా లేదా అని నాకు డౌట్ గా ఉంది అని బాధపడుతూ ఉంటుంది.. నువ్వేం బాధపడకు వదిన చీటీపాటికి వచ్చిన వాళ్ళకి నాట్య స్కూల్ గురించి చెప్పాను.
వాళ్ళందరిని మరో ముగ్గురికి ముగ్గురికి చెప్పమని చెప్పాను. కచ్చితంగా వాళ్ళు తమ పిల్లల్ని తీసుకొని వస్తారు. 60 నుంచి 80 మంది పిల్లలు వచ్చే అవకాశం ఉంది కచ్చితంగా జరుగుతుంది అని కామాక్షి అంటుంది. నువ్వు ఊరుకో కామాక్షి ఆశ బాగానే ఉంది కానీ అంత ఉంటుందంటావా అని ప్రభావతి అంటుంది. అప్పుడే ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వస్తే ఏ ఎలక్ట్రిసిటీ బిల్లువాడు వచ్చాడు అని ప్రభావతి డీల పడిపోతుంది. నువ్వు ఆగు వదిన నేను చూస్తాను అని ప్రభావతి అంటుంది..
మీనా బాలు రావడం చూసినా ప్రభావతి వీళ్ళు నన్ను కావాలని ఎత్తి పొడవాలని ఇక్కడికి వచ్చారు వీళ్ళని ఇక నుంచి పంపించేయని ప్రభావతి అంటుంది. మేము మీ దగ్గర శిష్యులుగా చేరడానికి వచ్చాము. మమ్మల్ని మీ శిష్యులుగా చేర్చుకోండి గురువుగారు అని బ్రతిమలాడతారు. దాంతో కామాక్షి అవును వదిన సంభవన కూడా తీసుకొని వచ్చారు మీ డాన్స్ స్కూలు ఫీజుని వీళ్ళు తీసుకొచ్చారు. ఒప్పుకో వదిన అని బలవంతంగా ఒప్పించేస్తుంది. అయితే డాన్స్ నేర్చుకోవడం అంటే కారు స్టీరింగ్ తిప్పడం, పూలు కట్టడం లాంటిది అనుకున్నారా అని అంటుంది.
మొత్తానికి ప్రభావతి మీనాన్ని అక్షరాలుగా ఒప్పుకుంటుంది.. ప్రభావతి మీనా సెటైర్లు వేసిన సరే ఇద్దరు కలిసి పోటీపడి మరి భరతనాట్యం చేస్తారు.. ఇక పాట అయిపోయిన తర్వాత ప్రభావతికి మెడ పట్టేస్తుంది. అయితే కామాక్షి పాటలు పై చాలా టైం అయింది ఇంకా ఇలా తిరగవేంటి వదినా అని అంటుంది. పాట అయిపోయింది వదిన ఇక తిరుగు అని కామాక్షి ఎంత చెప్తున్నా సరే ప్రభావతి అలాగే ఉండడం చూసి ఏమైంది అని అడుగుతుంది.. మెడ పట్టేసింది అని మీనా అనగానే అందరూ కలిసి ప్రభావతిని ఇంటికి తీసుకుని వెళ్తారు.
Also Read :‘గుండెనిండా గుడిగంటలు’ కామాక్షి రియల్ లైఫ్ లో అన్నీ కష్టాలే.. 12 ఏట పెళ్లి..
అందుకే చెప్పాను కదా మీ వయసుకు తగ్గ పనులు చేయాలి అని, నువ్వు మాత్రం అస్సలు వినవు అని ప్రభావతి పై సత్యం సీరియస్ అవుతాడు. అందరు కలిసి ప్రభావతి పై సెంటర్లు వేస్తారు అందరు కలిసి ప్రభావతి పై సెంటర్లు వేస్తారు. ఇక ఒక మసాజ్ చేసామని తీసుకొని కామాక్షి వస్తుంది. ప్రభావతి నొప్పులు పడడం చూసి ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లు మాణిక్యం మీనాక్షి దొరుకుతాడు. అది ఏం జరుగుతుందో చూడాలి..