Gudigantalu Kamakshi : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకప్పుడు యావరేజ్ డిఆర్పి రేటింగ్ను సొంతం చేసుకున్న ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ సీరియల్స్లలో టాప్ ఫైవ్ లో ఉండడం గమనార్హం.. ప్రముఖ ఛానల్ స్టార్ మా లో ఇది ప్రసారమవుతుంది. ఇందులో నటించిన నటీనటులు చాలావరకు అందరికీ తెలిసే ఉంటారు. అందులో కామాక్షి అనే కామెడీ క్యారెక్టర్ ఒకటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ పాత్రలో నటించింది సీనియర్ యాక్టర్ రాగిణి. ఈమె పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి చాలామందికి తెలియదు. అడుగడుగునా కష్టాలతో.. ఆకలి మంటతో ఎన్నో రోజులు గడిపిన ఆమె ప్రస్తుతం మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని వరుస సీరియల్స్ సినిమాలలో నటిస్తుంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి వివరంగా తెలుసుకుందాం..
నటి రాగిణికి పెళ్లవ్వలేదన్న విషయం అతి కొద్ది మందికే తెలుసు.. కానీ ఆమెకు 12వ ఏటనే పెళ్లి చేసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. రాగిణి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె తండ్రికి 13 మంది సంతానం. అందులో 12 కూతురు ఈమె. బతుకుభారంతో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు.. ఆ తర్వాత నటిగా అవకాశాలు రావడంతో అటు అడుగులు వేశారు. అయితే ఈయనకు పెళ్లి కాలేదని చాలామంది అనుకుంటున్నారు. దానికి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాగిణి తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన పెద్దక్క ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేసినట్లు ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సరిగ్గా ఏడాది పాటు మా కాపురం బాగానే సాగింది. ఈ ఏడాదిలో నాకు ఒక బాబు పుట్టాడు.. ఆ తర్వాత నాకు నరకాన్ని చూపించాడు.. మందుకు బానిసైనా అతను నన్ను నాన్న రకాల ఇబ్బంది పెట్టే వారిని రాగిణి అన్నారు. చివరికి అతని హింస భరించలేక అతని వదిలేసి వెళ్ళిపోవాలని అనుకున్నాను. తన బాబును అక్క బాబులాగా పెంచుతున్నట్లు ఆమె అన్నారు. అలా ఇప్పటికీ రెండో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు.
రాగిణి మంచి నటి. 550 కి పైగా సీరియల్స్లలో నటించింది అంటే ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నాటి నుంచి నేటి వరకు ఆమె నటించిన సీరియల్స్ అన్నీ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఈ వయసులో కూడా తన నటనపై ఆసక్తిని చంపుకోకుండా ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అమృతం, మై నేమ్ ఈజ్ మంగతాయారు, శశిరేఖా పరిణయం, అగ్నిసాక్షి, నాన్న వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. 190 కి పైగా సినిమాల్లో కూడా నటించారు. గణేష్, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, అష్టాచెమ్మా, ఈరోజుల్లో, జులాయి, భలే భలే మగాడివోయ్ వంటి సినిమాలు ఎన్నో చేశారు. ఇండస్ట్రీలోకి ఆమె ఎంట్రీ ఇచ్చి దాదాపు 30 ఏళ్లకు పైగా అయ్యింది. ఇప్పటికీ సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తున్నారు.