Gundeninda GudiGantalu Today episode May 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. కారు డ్రైవర్లు అందరూ కూడా నీకు వడ్డీ కట్టం కదా మళ్లీ ఇలా వచ్చావ్ ఏంటి అని అడుగుతారు.. వడ్డీ కట్టారు సరే నన్ను మీవాడు కొట్టాడు కదా అందుకే నేను చాలా హర్ట్ అయ్యాను మీలాంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయానని అంటారు. ఏదైనా కష్టం వస్తే మీ బాలు కచ్చితంగా వస్తాడు కదా వాడిని అడిగి ఏదైనా చేసుకోండి అని అంటాడు. ఇప్పుడు ఎందుకు వచ్చావు గుణ అని రాజేష్ అడుగుతాడు. వడ్డీ ఇచ్చారు సరే నేను అంత మంచివారిని కాదు అసలు కూడా నాకు రెండు రోజులు ఇవ్వాలి లేదంటే మీకు కార్లన్నీ తీసుకుపోతానని గుణ అంటాడు. అదేంటి నీకు కార్లు ఇస్తే మేము ఎలా బతుకుతాం నీకు డబ్బులు ఇవ్వాల్సినవి ఇస్తున్నాం కదా మళ్లీ కార్లు ఇవ్వమంటే మా ఇంటిని ఎలా పోషించికోవాలి అని అంటారు. ఏది ఏమైనా కూడా బాలు చేసిన దానికి ఆ గుణ గాడే రెచ్చిపోతున్నాడు అని అనుకుంటారు.. శృతి, రవిని ఓ ఆట ఆడుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శృతి,రవి సైకిల్ మీద వెళ్లడం చూసి సురేందర్ షాక్ అవుతాడు. హోటల్ ఓనర్ని చేసుకోవాల్సింది హోటల్ లో పని చేసే వారిని చేసుకుంది ఎలా భరిస్తుందో చూసావా అని శోభాతో సురేందర్ అంటాడు. కూతుర్ని అలా సైకిల్ మీద వెళ్లడం చూసి తల్లిదండ్రులు బాధపడతారు. వాడు ఇంకొకసారి నేల మీద నడుచుకొని పోకుండా చూడాలి అని సురేందర్ అనగానే శోభా నేను చూసుకుంటాను లేండి అసలు ఏం జరిగిందో నీకు అనుకుంటానని అంటుంది. ఇక కారు డ్రైవర్ల అందరు ఒకచోట మాట్లాడుకుంటూ ఉంటారు.
అయితే అప్పుడే గుణ అక్కడికి వచ్చి మీకు ఇచ్చిన టైం అయిపోయింది. కారులో నేను తీసుకుని వెళ్ళిపోతాను అని అంటాడు. ఇంత సడన్ గా డబ్బులు అడిగితే ఎలా ఇస్తాను గునా కాస్త టైం అయిన ఇవ్వాలి కదా అని రాజేష్ అడుగుతాడు. నా పని ఏదో నేను చేసుకుంటున్నాను నేను వడ్డీలకి డబ్బులు ఇచ్చాను ఆ డబ్బుల్ని రాబట్టుకుంటున్నారు. అంతేకానీ నేను మీ దగ్గర మీరు దౌర్జన్యంగా చేయట్లేదు కదా అని గుణం అంటాడు. సడన్ గా నువ్వు డబ్బులు కట్టమంటే ఎలా కడతాం కారు లేకుండా అంటే మా కుటుంబం ఎలా సాగుతుంది అని డ్రైవర్లు అందరూ బాధపడతారు.
మీరు ఎందుకు బాధపడుతున్నారు.. మీ ఆపద్బాంధవుడు బాలు ఉన్నాడు కదా వాడు కడతాడు డబ్బులు అని అనగానే అంతలోకి బాలు అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. నిన్న చెప్పింది నీకు గుర్తుంది కదా రా వచ్చి నాకు కాళ్ళు పట్టుకో అని గుణ అంటాడు. బాలు మాత్రం ఒక్క కాలితో తంతే ఎక్కడపడతావో నాకు తెలియదు అని వార్నింగ్ ఇస్తాడు. అదేంటి ఇంకా నీకు పొగరు తగ్గలేదా ఇప్పుడు కార్లు తీసుకొని వెళ్తాను నువ్వు నీ ఫ్రెండ్స్ ఏం చేస్తారో చేసుకోండి అని గుణ అంటాడు. దానికి బాలు ఒక్క నిమిషం నీ డబ్బులు ఏదో నీ మొహం కొట్టేస్తామని అందరినీ పక్కకు తీసుకెళ్తాడు.
ఎవరెవరు ఎంత అప్పు తీసుకున్నారు తెలుసుకొని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వాడి మొహనా కొట్టండి అని బాలు చెప్తాడు. గుణ చేతిలో అందరూ డబ్బులు పెడతారు. అయితే బాలు వీడిని నమ్మడానికి అసలు వీల్లేదు వీడియో తీయని రాజేష్ కి చెప్తాడు. నీ డబ్బులు నీకు ఇచ్చాను కదా ఇక ఇటువైపు వస్తే మర్యాదగా ఉండదని బాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో గుణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివుని చూసి మీనా, పార్వతి బాధ పడుతూ ఉంటారు. మీనాన్ని చూసి అందరూ ఏమైందని అడుగుతారు. అయితే శివ మాత్రం మీ ఆయన నిన్ను కూడా కొట్టాడా అని అడుగుతాడు. దానికి మీనా మీ ఆయన ఏంటి బావ ఆన్లైన్ అరుస్తుంది.
అప్పుడే వాళ్ళింటికి సత్యం వస్తాడు. సత్యంను అందరూ తలా ఒక మాట అనేసి తన కొడుకు చేసింది తప్పే అని బాధ పెడతారు. మీనా ఒకవైపు తన తల్లికి చెప్తూ ఉన్నా కూడా పార్వతీ వినకుండా బాలుదే తప్పు అంటూ సత్యంను అడుగుతుంది. ఇప్పుడు నా కొడుకుని కొట్టాడు కళ్ళముందే ఉన్న మీనా అని కొట్టడానికి గ్యారెంటీ అని నాకు చాలా భయమేస్తుంది అన్నయ్యగారు అని పార్వతి అంటుంది. దానికి సత్యం మీరేం భయపడాల్సిన అవసరం లేదు మీనా గురించి మాకు తెలుసు మీ నాకు మేమున్నాం చూసుకుంటాము. వాడు మీరు అనుకున్నంత చెడ్డవాడివి కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక రాజేష్ ఇంత డబ్బులు నీకు ఎక్కడ నుంచి వచ్చాయి రాని బాలుని అడుగుతాడు. నేను మీ అందరి కుటుంబాల్లో చీకటి నింపాలి అనుకోవట్లేదు రా అందుకే నా కారుని అమ్మేశానని చెప్పేస్తాడు. బాలు కారు నమ్మిస్తే నువ్వెలా బతుకుతావు రా అని రాజేష్ అంటాడు. నాకేమన్నా అయితే చూసుకోవడానికి మీరు ఉన్నారు కదా అని బాలు అంటాడు.. ఇక మనోజ్ ఏం చేస్తున్న హోటల్ కి తనకు అప్పు ఇచ్చిన తన ఫ్రెండు అక్కడికి వస్తాడు. మనోజ్ అతను చూసి లోపలికి వెళ్లబోతుంటే అతను అడ్డుపడతాడు.. అప్పు వసూలు చేసుకోవడం నాకు రాదు అనుకున్నావా అని అతను మనోజ్తో అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. అసలు నిజాన్ని చెప్తాడేమో చూడాలి…