OTT Movie : హారర్ జానర్ లో వచ్చే సినిమాల టార్గెట్ ఆడియన్స్ ని భయపెడుతూ ఎంటర్టైన్ చేయడం. వీటిలో కొన్ని సినిమాలు. అనుకున్నట్లే సీన్ తో సీన్ రీచ్ అవుతుంటాయి. ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ థ్రిల్ ను ఇస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటి థ్రిల్ నే ఇస్తోంది. ఈ కథ ఒక యువతి తన తల్లిదండ్రుల మరణం వెనుక సీక్రెట్ తెలుసుకోవడానికి రాత్రి పూట వాచ్‌మ్యాన్ జాబ్ చేస్తుంది. ఒక సీరియల్ కిల్లర్ తో ఫైట్ చేస్తుంది. ఈ సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘నైట్‌వాచ్: డెమన్స్ ఆర్ ఫారెవర్’ (Nightwatch demons are forever) ఒక డానిష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. ఇది 1994లో వచ్చిన ‘నైట్‌వాచ్’ సినిమాకు సీక్వెల్. దర్శకుడు ఓలే బోర్నెడాల్ దీనిని రూపొందించారు. ముఖ్య పాత్రల్లో ఫాన్నీ లీండర్ బోర్నెడాల్, నికోలాజ్ కోస్టర్, కిమ్ బోడ్నియా నటించారు. ఈ సినిమా 2024 మే 24న అమెరికాలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ఎమ్మా అనే అమ్మాయి ఒక మెడికల్ స్టూడెంట్. ఆమె తల్లిదండ్రులు ముప్పై సంవత్సరాల క్రితం, ఒక ఫోరెన్సిక్ ఇన్‌స్టిట్యూట్‌లో రాత్రి వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తూ చనిపోయారు. ఆ మరణాలకు సీరియల్ కిల్లర్ వర్మర్ కారణమని అందరూ అనుకుంటారు. ఎమ్మా తన తల్లిదండ్రుల మరణం వెనుక నిజం తెలుసుకోవాలని, అదే ఇన్‌స్టిట్యూట్‌లో రాత్రి వాచ్‌మ్యాన్ జాబ్ చేస్తుంది. ఎమ్మా అక్కడ అడుగు పెట్టిన వెంటనే, ఇన్‌స్టిట్యూట్‌లో భయంకర శబ్దాలు, వింత సంఘటనలు మొదలవుతాయి. దీంతో ఆమెకు చాలా భయం వేస్తుంది.
ఎమ్మా ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తూ, తన తల్లిదండ్రుల మరణం గురించి పాత ఫైల్స్, వీడియోలు చూస్తుంది. వర్మర్ ఇప్పుడు కదలలేని స్థితిలో బెడ్ మీద ఉంటాడు. ఎమ్మా అతన్ని కలిసినప్పుడు, వర్మర్ కొన్ని వింత మాటలు చెబుతాడు. అవి ఆమెకు ఏదో హింట్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఎమ్మా తన తల్లిదండ్రుల మరణం వర్మర్ వల్ల కాదని, వేరే పెద్ద రహస్యం ఉందని అనుమానిస్తుంది. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో కొత్త మర్డర్స్ మొదలవుతాయి. ఎమ్మా తన తల్లిదండ్రుల మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుసుకుంటుంది.
Read Also : మేనమామ చావుకు రివేంజ్… ఓటీటీని షేక్ చేస్తున్న కొరియన్ సిరీస్… యాక్షన్ ప్రియులకు పండగే
ఇక క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ వస్తుంది. దీంతో ఆమె షాక్ అవుతుంది. హంతకుడు ఎవరో ఆమెకు తెలిసిపోతుంది. ఈ హంతకుడు ఎమ్మాను కూడా టార్గెట్ చేస్తాడు. ఎమ్మా కిల్లర్ నుంచి తప్పించుకుంటుందా ? అతని చేతిలో బలవుతుందా ? కిల్లర్ ఎవరు ? ఎందుకు ఎమ్మా ఫ్యామిలీని చంపాడు ? అనే విషయాలను, ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి