BigTV English

India Flights: వెంటాడుతున్న భయం.. ఆ నగరాలకు విమాన రాకపోకలు రద్దు

India Flights: వెంటాడుతున్న భయం.. ఆ నగరాలకు విమాన రాకపోకలు రద్దు

India Flights: ఉత్తరాదిలో విమానాలు తిరుగుతున్నాయా? పౌర విమానయాన శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇ‌చ్చినా ఆలోచనలో పడ్డాయి కీలకమైన ఎయిర్ లైన్స్ సంస్థలు? రాత్రి సాంబా సెక్టార్‌లో పాకిస్తాన్ డ్రోన్లు రావడమే కారణమా? ఈ రోజు గమనించిన తర్వాత బుధవారం నుంచి నడపాలో లేదో నిర్ణయం తీసుకోనున్నాయా? అవుననే అంటున్నాయి ఎయిరిండియా, ఇండిగో విమాన సంస్థలు.


భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు విమానయాన సంస్థ ఆలోచనలో పడ్డాయి. ఒకటి ఎయిరిండియా, మరొకటి ఇండిగో. గగనతల ఆంక్షలు, భద్రతా చర్యల నేపథ్యంలో ఈ రెండు సంస్థలు మే 13(నేటి వరకు) ఉత్తరాది, పశ్చిమ భారత్‌లోని దాదాపు ఏడు నగరాలకు విమాన కార్యకలాపాలను నిలిపివేశాయి. ఈ విషయాన్ని ఆయా సంస్థలు స్వయంగా వెల్లడించాయి.

సోమవారం ప్రధాని మోదీ ప్రసంగం, ఆ తర్వాత సాంబా సెక్టార్‌లోని దాయాది దేశానికి చెందని డ్రోన్లు రావడంతో ఎయిరిండియా, ఇండిగో సంస్థలు ఆలోచనలో పడ్డాయి. తమ సేవలను మంగళవారం రద్దు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు ఎయిరిండియా, ఇండిగో సంస్థ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాయి. జరుగుతున్న పరిణామాలు నేపథ్యంలో ప్రయాణికుల భద్రత తొలి ప్రాధాన్యంగా రాసుకొచ్చాయి.


జమ్మూ, అమృత్ సర్, చండీగఢ్‌, లెహ్, శ్రీనగర్, రాజ్‌కోట్‌కు మే 13న (మంగళవారం) రాకపోకలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఎయిరిండియా ఎనిమిది నగరాలకు విమానాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రయాణాలు సిద్ధం చేసుకున్నవారి పరిస్థితి అర్థం చేసుకోగలరని పేర్కొన్నాయి.

ALSO READ: ఆధార్ ఒక్కటే కాదు.. వాటితోనూ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు

జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించాయి. ప్రస్తుతం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపాయి. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే తెలియజేస్తామన్నారు. అలాగే ఎయిర్‌పోర్ట్‌కు వచ్చేముందు విమానం స్టేటస్‌ మా వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో చెక్‌ చేసుకోగలరని తెలియజేశాయి. ప్రయాణికులకు సాయం అందించేందుకు నిత్యం అందుబాటులో ఉంటామని పేర్కొన్నాయి.

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా విమానాలు నడుపుకోవచ్చని పౌర విమానయాన శాఖ సోమవారం నోటమ్ జారీ చేసింది. ఉత్తరాది, పశ్చిమ వైపు 32 నగరాల్లో విమాన శాఖ విధించిన ఆంక్షలను ఎత్తేసింది. దీంతో విమానాలు పునఃప్రారంభం అవుతాయని ప్రయాణికులు, టూరిస్టులు భావించారు. అయితే మంగళవారం పరిస్థితి గమనించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ట్రావెలర్లు ఆలోచనలో పడ్డారు.

 

Related News

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

UP Man: ఒక రైలు ఎక్కబోయి.. మరో రైలు ఎక్కాడు.. చివరి ప్రాణాలు కోల్పోయాడు!

Woman Train Driver: తొలి లేడీ లోకో పైలెట్ సురేఖ పదవీ విరమణ, ఘన వీడ్కోలు పలికి సిబ్బంది!

Trains Derail: పట్టాలు తప్పిన రైలును మళ్లీ పట్టాలు ఎక్కించడం ఇంత కష్టమా? అస్సలు ఊహించి ఉండరు!

Airways New Rule: కాఫీ తాగొద్దు, ఫోటోలు తియ్యొద్దు, సిబ్బందిపై విమానయాన సంస్థ కఠిన ఆంక్షలు!

Dussehra – Diwali: పండుగ సీజన్ లో భారతీయులు వెళ్లాలనుకుంటున్న టాప్ ప్లేసెస్ ఇవే, మీరూ ట్రై చేయండి!

IRCTC – Aadhaar: వెంటనే ఇలా చేయండి.. లేకపోతే అక్టోబర్ 1 నుంచి టికెట్ల బుకింగ్ కష్టమే!

Big Stories

×