భారతీయ రైల్వే కొంత మందిని ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది. అంటూ వారు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు, రైల్వే కార్మికులు, అనారోగ్యంతో బాధపడే వ్యక్తులు, కొన్ని ప్రత్యేక కేసులకు సంబంధించి ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇంతకీ ఎవరు ఉచితంగా రైలు ప్రయాణం చేయవచ్చు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అన్ని రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. రాజధాని, శతాబ్ది లాంటి అత్యంత వేగవంతమైన రైళ్లలో కూడా వీళ్లు ఫ్రీగా జర్నీ చేసే అవకాశం ఉంది. 2016 నుంచి ఈ రూల్ అందుబాటులోకి వచ్చింది. రైళ్లలో చిన్న పిల్లలకు టికెట్ అవసరం లేదు. పిల్లవాడు తల్లిదండ్రులతో సీటును షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక బెర్త్, సీటు ఉండదు. ఒకవేళ ప్రత్యేకమైన సీటు కావాలనుకుంటే టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అవసరం అయితే, పిల్లలకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ ను చూపించాల్సి ఉంటుంది.
రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబాలు ఉచితంగా రైలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు, ఉద్యోగ విరమణ చేసిన వారు కూడా ఈ సౌకర్యాన్ని పొందుతారు. రైల్వే కార్మికులు, జీవిత భాగస్వాములు, పిల్లలు, వారి తల్లిదండ్రులు ఉచితంగా రైలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. రైల్వే కార్మికులు, ఉద్యోగలకు ప్రత్యేక పాస్‌లు లభిస్తాయి. కార్మికులకు ప్రతి సంవత్సరం 3 పూర్తి పాస్‌లు, 4 సరసమైన టికెట్ ఆర్డర్‌లు లభిస్తాయి. మొత్తం కుటుంబం కలిసి ఒకే పాస్‌ను ఉపయోగించవచ్చు. భారతీయ రైల్వేలలో పనిచేసే వ్యక్తులకు ఇది ఒక ప్రయోజనకరంగా ఉంటుంది.
కొంతమంది అనారోగ్యంతో ఉన్నవారికి ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తుంది ఇండియన్ రైల్వే. క్యాన్సర్, తలసేమియా లాంటి ప్రాణాంతక సమస్యలో ఇబ్బంది పడుతున్న వారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. రోగితో పాటు ఓ సహాయకుడు ఉచితంగా వెళ్లే అవకాశం ఉంటుంది. సెకెండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ ఛార్జీ మీద 100% తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఈ ప్రయాణ సౌకర్యం ఉంటుంది. ప్రీమియం రైళ్లలో ఉండదు. ఉచిత ప్రయాణం పొందాలనుకునే వారు ప్రభుత్వ ఆసుపత్రి నుండి డాక్టర్ నోట్ ను చూపించాల్సి ఉంటుంది. రాయితీ కోసం ఒక ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది.
Read Also: మీరు రిజర్వు చేసుకున్న సీట్లో వేరొకరు కూర్చున్నారా? ఇలా చేస్తే సీటు మీకు వచ్చేస్తుంది!
సీనియర్ సిటిజన్స్ అంటే 58 ఏళ్లు పైబడిన మహిళలు, 60 ఏళ్లు పైబడిన పురుషులు టికెట్ రేటుపై 50% తగ్గింపు పొందుతారు. విద్యార్థులు, ఆర్మీ సిబ్బందికి డిస్కౌంట్ లభిస్తుంది. తరచుగా నిబంధనలు మారే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు indianrail.gov.in లేదంటే IRCTCని చూడండి.
Read Also: దీపావళి వేళ అదిరిపోయే న్యూస్, అందుబాటులోకి 30 లక్షల బెర్తులు!