Hyderabad Crime News: హైదరాబాద్ శివారు ప్రాంతంలో రేవ్ పార్టీని భగ్నం చేశారు రాచకొండ పోలీసులు. ఓ రిసార్ట్స్‌పై దాడి చేసిన పోలీసులు, లిక్కర్‌తోపాటు 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిలో 22 మంది అమ్మాయిలు ఉన్నారు. అంతేకాదు ఏపీకి చెందిన ఓ బిజినెస్ మేన్ కూడా ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ
రేవ్ పార్టీలపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రేవ్ పార్టీల పేరుతో డ్రగ్స్, గంజాయ్ వినియోగించడంతో అటువైపు దృష్టి సారించారు. కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు. ఇదే అదునుగా భావించిన ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త బిజినెస్ మీట్ పేరుతో ఈ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు చెబుతున్నారు.
మహేశ్వరం మండలం చెర్రపల్లి గ్రామ శివారులో చంద్రారెడ్డి పేరుతో ఓ రిసార్ట్స్ నడుస్తోంది. అయితే ఏపీలోని గుంటూరుకి చెందిన ఓ వ్యాపారవేత్త తన ఫెర్టిలైజర్ కంపెనీ పేరిట పార్టీని మంగళవారం గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి భారీ మద్యం, వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించారు. కంపెనీ డీలర్లు, వ్యాపార భాగస్వాముల కోసం అతడు ఈ పార్టీకి ఆతిథ్యం ఇచ్చాడు.
హైదరాబాద్, బెంగుళూరు నుంచి ప్రొఫెషనల్ మహిళా డ్యాన్సర్లు
రిసార్ట్స్‌లో డీజే సౌండ్లతో మార్మోగింది. ఉన్నట్లుండి రిసార్ట్స్ నుంచి భారీగా సౌండ్ రావడంతో ఆ గ్రామ ప్రజలు అనుమానం వచ్చింది. వెంటనే రాచకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చంద్రారెడ్డి రిసార్ట్స్‌పై దాడి చేశారు. మొత్తం 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి వరకు సోదాలు చేశారు.
అందులో గుంటూరుకి చెందిన ఓ వ్యాపారవేత్త కూడా ఉన్నారు. ఎందుకంటే సహచరు లు, డీలర్లకు ఆ పార్టీ ఇచ్చింది ఆయనేనట. మొత్తం 28 మంది పురుషులు, 22 మంది యువకులు పోలీసులకు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు నుండి ఏడుగురు ప్రొఫెషనల్ మహిళా డ్యాన్సర్లు ఈ పార్టీలో ఉన్నారని సమాచారం.
ALSO READ: ఆర్మీ విన్యాసాలు.. తెలుగు మేజర్ రోడ్డు ప్రమాదంలో మృతి
అర్థరాత్రి వరకు పార్టీ కొనసాగినట్టు తెలుస్తోంది. అనేక మంది వ్యాపారవేత్తలు, యువతీ యువకులు హాజరైనట్లు పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాలు, మద్యం, క్యాసినో నాణేలు ఆ పార్టీలో లభించాయి. ఇవన్నీ లభించడంతో బిజినెస్ మీట్ కాదని అంటున్నారు. పార్టీ లైటింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. రిసార్ట్, పార్టీ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఎక్సైజ్ శాఖ, నార్కోటిక్స్ బృందాలు రంగంలోకి దిగాయి. పార్టీకి సంబంధించి అదనపు సమాచారాన్ని సేకరిస్తున్నారు అధికారులు. రేవ్ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నాయి. అయినా గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్‌గా జరిగిపోతున్నాయి.
రేవ్ పార్టీని భగ్నం చేసిన రాచకొండ SOT పోలీసులు..
మహేశ్వరంలోని కే.చంద్రారెడ్డి రిసార్ట్స్ పై పోలీసుల దాడులు
రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన ఏపీకి చెందిన ఫెర్టిలైజర్ కంపెనీ
డయల్ 100కి ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన SOT పోలీసులు
లిక్కర్ తో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు pic.twitter.com/G0tg6QZwo0
— BIG TV Breaking News (@bigtvtelugu) October 14, 2025