Brahmamudi serial today Episode: న్యూస్‌లో రాజ్ గురించి బ్యాడ్‌గా రావడంతో రుద్రాణి రెచ్చిపోతుంది. మన ఇంటి పరువు మర్యాదలను మంట కలిపిన మనిషిని రాజ్‌ను ఇబ్బంది పెడుతున్నారు. రాజ్ అలాంటి దిగజారిన వ్యక్తి కోసం నువ్వు దిగజారాల్సిన అవసరం లేదు.. నువ్వు ఊ అంటే అమ్మాయిలు క్యూ కడతారు అని చెప్పగానే.. ఇంద్రాదేవి కోపంగా రుద్రాణి అంటూ చెప్పపగలగొడుతుంది. ఇంకోక్క మాట నీ నోటి నుంచి వచ్చిందంటే చంపేస్తాను జాగ్రత్త నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా..? అంటుంది. అత్తయ్య రుద్రాణికి కాపురాలు కూల్చడం తెలిసినంత బాగా వాటిని నిలబెట్టడం రాదు కదా అంటుంది అపర్ణ. అయినా న్యూస్‌లో వచ్చింది అని తెగ గోల చేస్తున్నావు.. ఆ మీడియా వాళ్లు అడిగిన దాంట్లో తప్పేం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే తప్పున చేసింది నా మనవరాలు కాదు.. నా మనవడు.. అని ఇంద్రాదేవి చెప్పగానే..
అంటే మీరింకా కావ్యకే సపోర్టు చేస్తున్నారా..? అని రుద్రాణి అడగ్గానే.. అవును అది తప్పు చేయనంత వరకు దానికే సపోర్టు చేస్తాము.. నీకేమైనా ప్రాబ్లమా..? అని అపర్ణ అడగ్గానే.. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్టు మీకే లేనప్పుడు నాకెందుకు ఉంటుంది అని రుద్రాణి చెప్పగానే.. ఇంద్రాదేవి కోపంగా అయితే నోరు మూసుకుని ఉండు.. అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇక అపర్ణ ఓరేయ్ రాజ్ ఇప్పటి వరకు అల్లరి పాలు అయింది చాలు. ఇంకా లేటు చేసి మన పరువును మన ఇంటిని రోడ్డున పడేయకు.. వెళ్లు వెళ్లి దాన్ని ఇంటికి తీసుకుని రా అని చెప్తుంది. అమ్మ తను రాను రాను అంటుంటే ఎలా తీసుకురావాలి. నేను చేయాల్సిన ప్రయత్నాలు చేశాను. ఇక నా వల్ల కానే కాదు అని చెప్పగానే..
అపర్ణ మరింత కోపంగా గట్టిగా ప్రయత్నిస్తే ఈ ప్రపంచంలో కానిది అంటూ ఏదీ ఉండదు.. చిన్నప్నుడు నువ్వు అన్నం తిననని మారాం చేశావు. అన్నం పెట్టకుండా వదిలేశానా..? స్కూల్‌కు వెళ్లనని మారాం చేశావు. చదువు నేర్పించకుండా వదిలేశామా..? తల్లిగా నా బాధ్యతలు నేను పూర్తి చేశాను. భర్తగా దాన్ని తీసుకొచ్చి నీ బాధ్యత కూడా పూర్తి చేసుకో చూడు రాజ్ తప్పు చేసింది నువ్వు నీ తప్పుకు నా కోడలు శిక్ష అనుభవిస్తుంది. నువ్వేం చేస్తావో అంతే నా కోడలు నా ఇంటికి రావాల్సిందే అని చెప్పి వెళ్లిపోతుంది. రాజ్ ఆలోచిస్తుంటాడు.
రూంలోకి వెళ్లిన రాహుల్ పిచ్చిగా నవ్వుతుంటే.. రుద్రాని తిడుతూ రేయ్ నీకైమైనా పిచ్చిపట్టిందా..? ఎందుకు నవ్వుతున్నావు.. నేనేమైనా జోక్ చేశానా..? అని అడుగుతుంది. దీంతో రాహుల్ నువ్వే ఓ జోకర్ లా కనిపిస్తుంటే ఇక సపరేట్ గా జోకులు వేయడం ఎందుకు మమ్మీ అంటాడు రాహుల్. దీంతో రుద్రాణి కోపంగా రేయ్ అనగానే ఏంటి కోపం వచ్చిందా..? మరి నువ్వు ప్లాన్ చేసిన ప్రతిసారి ఫెయిల్ అవుతుంటే నాకు ఎలా ఉంటుంది. ఆ రాజ్‌కు కావ్యకు మధ్య దూరం పెంచేస్తాను. వాళ్లిద్దరిని విడగొట్టేస్తాను అని చెప్తుంటే నాకెలా ఉంటుంది. ఇప్పుడు నీ ప్లాన్ నీకే రివర్స్ కొట్టింది. అయినా నాకు తెలియక అడుగుతాను మమ్మీ నీ జీవితంలో ఒక్కసారి కూడా సక్సెస్ అవ్వవా..? నువ్వేమైనా ఓటమికి కేరాఫ్ అడ్రస్సా చెప్పు మమ్మీ అని అడగ్గానే..
రుద్రాణి కోపంగా ఏంట్రా వెటకారమా..? ఈ ఇంట్లో అందరూ దాన్ని నెత్తిన పెట్టుకున్నారు. అందుకే అది ఏం చేసినా వాళ్లకు తప్పుగా అనిపించడం లేదు. రాజ్‌కు సపోర్టు చేసి ఆ కావ్యను ఇంట్లోంచి గెంటేస్తారని ఆ ప్లాన్ చేశాను. కానీ అంతా రివర్స్ అయింది. ఇంటిల్లి పాది దాన్ని ఎందుకు అంతలా మోస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదురా అంటూ చెప్తుండగానే.. కావ్య ఫోన్ చేస్తుంది. షాకింగ్ గా చూస్తుంది రుద్రాణి. దీంతో రాహుల్ ఏంటి మమ్మీ షాక్ కొట్టిన కాకిలా అలా అయిపోయావు.. ఎవరు ఫోన్ అని అడగ్గానే.. ఆ కావ్య చేస్తుందిరా..? అని చెప్పగానే..
ఏంటి కావ్య చేస్తుందా..? కొంపదీసి ఆ మీడియా వాళ్లన పంపించింది మనమే అని డౌటు వచ్చిందా మమ్మీ అని అడగ్గానే.. రేయ్ అనవసర డౌట్టు పెట్టుకోకు అంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది. కావ్య గట్టిగా రుద్రాణిని తిడుతుంది. మీడియా ప్లాన్ నీదేనా అంటూ నిలదీస్తుంది. దీంతో రుద్రాణి షాక్ అవుతుంది. కావ్య రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత రాజ్ దీని కంతటికి కారణం ఆ కళావతే అని చెప్తాను దాని పని అనుకుంటూ కావ్యకు ఫోన్ చేసి తిడతాడు. దీంతో కావ్య బాధపడుతుంది. కనకం వచ్చి ఓదారుస్తుంది. మరోవైపు కావ్య ఫోటో చూస్తూ.. రాజ్ బాధపడుతుంటాడు. ఇంకోవైపు తన ఫోన్‌లో రాజ్ ఫోటో చూస్తూ కావ్య బాధపడుతుంది.
మరుసటి రోజు మహిళా సంఘాల నుంచి కొంత మంది వచ్చి రాజ్‌ను తిడుతుంటారు. ఆడవాళ్లను టార్చర్ చేస్తే మేము ఎంత దాకా అయినా వెళ్తామని బెదిరిస్తారు. మధ్యలో రుద్రాణి కల్పించుకుని వాళ్లని మరింత రెచ్చగొడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.