Intinti Ramayanam Srikar : స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్స్లలో ఇంటింటి రామాయణం ఒకటి. ఈ సీరియల్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తన పెళ్లి చెడిపోయింది అన్న కారణంతో ఓ యువతీ అదే ఇంటికి మరొకరి భార్యగా అడుగుపెడుతుంది. అందరూ కలిసి తనకు ఇష్టమైన వ్యక్తిని దూరం చేశారనే కక్ష కట్టి ఆ ఇంట్లో సంతోషాన్ని ఎలాగైనా సరే దూరం చేయాలనే ఉద్దేశంతో అడుగుపెడుతుంది. తను అనుకున్నట్లుగానే ఇంట్లో గొడవలను క్రియేట్ చేసి కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తుంది. చివరకు ఆ కుటుంబంలో మనస్పర్ధలు తొలగిపోయి అందరూ ఒక్కటవుతారు. స్టోరీ జనాలను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో శ్రీకర్ పాత్రలో అభిషేక్ నటించారు. ఈయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంటింటి రామాయణం సీరియల్స్ లో నటించిన చాలామంది నటులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. అలాగే ఈ సీరియల్లో రెండవ కొడుకు శ్రీకర్ పాత్రలో నటించిన అభిషేక్ కూడా ముంబై నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. వేరే రాష్ట్రం నుంచి వచ్చినా కూడా తెలుగులో టాప్ సీరియల్స్లలో అవకాశాన్ని అందుకొని బిజీగా మారాడు. “చామంతి,” “గుండమ్మ కథ,” “మనసు మమత,” అలాగే “నా పేరు మీనాక్షి” వంటి సీరియల్స్‌లో కూడా అభిషేక్ నటించారు.. ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన ఇప్పటివరకు నటించిన ప్రతి సీరియల్ కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది.. అన్ని సీరియల్స్ లోను కూల్ గా ఉండే పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈయన రియల్ లైఫ్ లో పెళ్లి అయ్యిందో లేదో తెలియలేదు. కానీ సోషల్ మీడియాలో కూడా తన పెళ్లి గురించి ఎక్కడ ఫోటోలను షేర్ చేసుకోలేదు. ఒకవైపు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటాడు. తన లేటెస్ట్ ఫోటోలను ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటాడు.
తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ ద్వారా చాలామంది బాగానే సంపాదిస్తున్నారు. సినిమాలతో పోలిస్తే సీరియల్స్లలో వచ్చే రెమ్యూనరేషన్ భారీగానే ఉంటుందన్న విషయం తెలిసిందే. సినిమాకు ఒక్కసారి రెమ్యూనరేషన్ ఉంటుంది. అది డైలీ సీరియల్స్ లో మాత్రం పేమెంటు డైలీ ఉంటుంది. ఇక సీరియల్ కూడా నెలలో 25 రోజుల వరకు షూటింగ్ ఉండడంతో ఇందులో నటిస్తున్న వాళ్లకు లక్షల్లోనే రెమ్యూనరేషన్ వస్తుంది. ఇంటింటి రామాయణం శ్రీకర్ ఒక్క రోజుకి 20 వేలకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కను చూస్తే ఆయన నెలకు భారీగానే సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ లో నటిస్తున్న ఈయన మరో రెండు సీరియల్కు సైన్ చేసినట్లు తెలుస్తుంది. వాటి గురించి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.