OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపే చూస్తున్నారు ప్రేక్షకులు. నచ్చిన సినిమాను, దొరికిన సమయంలో చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఒక్క క్లిక్ తో అన్ని భాషల్లో సినిమాలు వాలిపోతున్నాయి. గత ఏడాది వచ్చిన ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా, ఆడియన్స్ ని ఫుల్ చిల్ ని ఇస్తోంది. ఈ కథలో హీరో చేయని తప్పుకు జైలుకు వెళ్తాడు. ఆ తరువాత అతను దీన్నుంచి బయట పడటానికి చేసే ప్రయత్నాలు, కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. దీని పేరు ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘ట్రబుల్’ (Trouble) 2024లో వచ్చిన స్వీడిష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఇది 1988 స్వీడిష్ మూవీకి రీమేక్ గా వచ్చింది. జాన్ హోల్మ్‌బెర్గ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ఫిలిప్ బెర్గ్, ఆమీ, ఎవా మెలాండర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 అక్టోబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. IMDbలో 6.2/10 రేటింగ్ ని కూడా పొందింది.
హీరో ఒక ఎలక్ట్రానిక్స్ షాపులో జాబ్ చేస్తుంటాడు. అతను ఈ మధ్యనే భార్యతో విడాకులు తీసుకుని ఉంటాడు. తన కూతురు డయానాతో మాత్రమే క్లోజ్‌గా ఉంటాడు. ఒక రోజు అతను ఒక కస్టమర్ ఇంటికి TV ఇన్‌స్టాల్ చేయడానికి వెళ్తాడు. అక్కడ అతను ఒక దొంగతనం, మర్డర్ సీన్ చూస్తాడు. కానీ భయంతో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతాడు. అయితే ఆతరువాత అతన్ని పోలీసులు మర్డర్ కేసులో పట్టుకుని, జైలుకు పంపేస్తారు. జైలులో హీరో కొంత మంది క్రిమినల్స్‌తో కలుస్తాడు. వీళ్ళు జైలు నుంచి ఎస్కేప్ ప్లాన్‌లో బిజీ అవుతారు.
Read Also : మొగుడు పోగానే క్యూ కట్టే కేటుగాళ్ళు… డబ్బు కోసం అంతమందితో… అలాంటి సీన్లున్న సినిమానే
ఈ సమయంలో అతన్ని మర్డర్ కేసులో పోలీస్ లే కావాలని ఇరికించారని తెలుసుకుంటాడు. తన నిర్దోషిత్వం నిరూపించడానికి ట్రై చేస్తాడు. హీరో తన కూతురు డయానాతో మాట్లాడుతూ, ఆమె బాధను చూసి ఎమోషనల్ అవుతాడు. అతను క్రిమినల్స్‌తో కలిసి జైలు నుంచి ఎస్కేప్ అవుతాడు. కానీ అతనికి బయట కూడా డేంజర్ ఎదురవుతుంది. ఇన్ని సమస్యల్లో అతను అమాయకూడని నిరూపించుకుంటాడా ? పోలీసులు అతన్ని ఎందుకు ఇరికించారు ? అనే విషయాలను, ఈ స్వీడిష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.