Gundeninda GudiGantalu Today episode October 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి అన్నం తినకుండా బాధపడుతూ ఉంటుంది. మీరు నన్ను ఇలా ఎత్తి పొడుస్తున్నారు కాబట్టే నాకు ఆకలి వేయడం లేదు అంటూ అంటుంది. నాకేం వద్దు మీరే తినండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మీనా అయ్యో అత్తయ్య గారు తినకుండా వెళ్ళిపోతున్నారు అని బాధపడుతూ ఉంటుంది.. నువ్వేం బాధపడకు అమ్మ నేను తన ఒప్పించి తీసుకొని వస్తాను నువ్వు మా ఇద్దరికీ అన్నం వడ్డించు అని అంటాడు.. అత్తయ్య బాధను తగ్గించాలి అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు పాపం అన్నం కూడా తినట్లేదు అని మీనా బాధపడుతూ ఉంటుంది.. మీనా బాధలు చూసినా బాలు నా దగ్గర ఒక ఐడియా ఉంది అది ఫాలో అయితే కచ్చితంగా మా అమ్మ రేపటి నుంచి భోజనం చేస్తుంది అని అంటాడు. మీనా బాలు ప్రభావతి దగ్గర స్టూడెంట్స్ గా జాయిన్ అవుతారు. పోటీపడి డాన్స్ వేసి ప్రభావతి మెడ పట్టేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మనోజ్ తన వర్కర్ ఖాళీగా కూర్చోవడం చూసి అందరిపై సీరియస్ అవుతాడు.. అక్కడ కస్టమర్లందరూ ఉంటే మీరేంటి ఇక్కడ ఖాళీగా కూర్చుని ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు అని అరుస్తాడు. వాళ్ళు కేవలం చూడడానికే వచ్చారు సార్ అందుకే మేము ఇక్కడ కూర్చున్నాం వాళ్ళు కొనాలి అనుకుంటే పిలుస్తారు కదా అని వాళ్లంటారు. అయినా మీ షర్టు ఏంటి ఇలా మురికి పట్టి ఉంది అని అడుగుతాడు. మీరు కూలీలను కూడా తీసేసారు మేమే కూలీలుగా అన్ని బండ్లో పెట్టాల్సి వస్తుంది. అందుకే మురికి పడుతున్నాయి అని వాళ్లంటారు. రోజు ఇస్త్రీ బట్టలు వేసుకోవాలంటే డబ్బులు కావాలి కదా సార్ అని అడుగుతారు.
మనోజ్ తెలివిగా ఆలోచించి వాళ్ళందరికీ ఐరన్ బాక్సులు తీసుకొచ్చి ఇస్తారు. మీరంతా మంచివారు సార్ మా అందరికీ ఐరన్ బాక్స్ లు ఇస్తున్నారు అని అంటారు. నేనేమీ ఊరికే ఇవ్వలేదు నెక్స్ట్ మంత్ శాలరీలో కట్ చేసుకుంటాను అని అంటాడు. రోహిణి నీకేమైనా పిచ్చా వాళ్లకి ఊరికే ఐరన్ బాక్స్ ఎందుకు ఇచ్చావు అని అడుగుతుంది. ఊరికే ఈమె పోలేదు శాలరీలో కట్ చేసుకుంటానని చెప్పానని మనోజ్ అంటాడు. అప్పుడే విద్య అక్కడికొస్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చావ్ ఏంటి అంటే రోహిణి కోసం వచ్చానని అంటుంది. మనోజు విద్యను ఒక ఆట ఆడుకుంటాడు.
విద్య మీ షాప్ లో ఈ ఫోటో పెడితే ధనం ఆకర్షితం అవుతుందట అందుకే తీసుకొచ్చాను. నాకు పూజలు చేసే అంత టైం ఎక్కడుంది మీ నాకే ఈ పని చేస్తే సరిపోతుంది కదా అని మీనాకు ఫోన్ చేసి రోహిణి అసలు విషయం చెప్తుంది. మన షాపులోనే కదా రోహిణి నేను రోజు పూలు తెచ్చి పూజ చేస్తాను లే అని అంటుంది. మాణిక్యం బయట కనిపించడంతో మీనా అతని ఫాలో అవుతూ వస్తుంది. అతను రోహిణి వాళ్ళ షాప్ లోకి పరిగెత్తుకుంటూ వస్తాడు. మీనా నన్ను చూసింది అని చెప్పగానే రోహిణి విద్య షాక్ అవుతారు.
మీనా ఇప్పుడు ఇక్కడికే వస్తుంది. మీనా రావడం చూసినా విద్య వచ్చేసింది ఈ మాణిక్యం ఎక్కడైనా దాచి పెట్టాలి అని ఒక బీరువాలో దాచిపెడతారు. మీనా నేను మీ మాణిక్యం మావయ్యని చూసాను అని అంటుంది. ఎక్కడ ఉన్నాడు నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకున్నావు అని అంటుంది. మీనా పూజ చేసే వెళ్తూ ఉండగా బాలు రాజేష్ ని తీసుకొని వస్తాడు. బీరువా కొనాలని అనుకుంటే అక్కడ విద్య బీరువాని చూసి నేను కొందామని అనుకుంటున్నాను అని అంటుంది. అందులోనే మాణిక్యం ఉన్నాడు అని రోహిణి తో అనగానే అవును విద్య ఈ బీరువాని కొనాలని అనుకుంటుంది. ఎవరి పేమెంట్ ఇస్తే వాళ్లకి ఇస్తానని మనోజ్ అంటాడు.
Also Read: ‘ఇంటింటి రామాయణం’ శ్రీకర్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
రాజేష్ డౌన్ పేమెంట్ కాస్త ఇచ్చి ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్లో డబ్బులు ఇస్తామని అన్నా కూడా మనోజ్ ఒప్పుకోడు. ఇక విద్య మాణిక్యం బతికాడో లేదో చూడాలి అని అనుకుంటుంది. నాకు రాజమౌళి సినిమాలో ఛాన్స్ అన్నారు. కానీ నాకు ఎప్పుడో ఈ విషయం గురించి తెలుసు. మీరు అయితే ఏదో పెద్ద సమస్యలో ఉన్నారని తెలుస్తుంది. నువ్వు కూడా నాకు చెల్లె లాంటి దానివే కదా నీకు అందుకే సాయం చేస్తున్నానని అంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..