Vidadala Rajini: విడదల రజినీ..ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయిన పేరు. ఇటీవల జరిగిన పరిణామాలతో విడదల రజినీ పేరు ఏపీ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన పబ్లిసిటీ కంటే.. తాజాగా వచ్చిన పబ్లిసిటీ ఎక్కువగా ఉంటోంది. అయితే ఈ పబ్లిసిటీ నెగిటివా..? లేక.. పాజిటివా.. అసలేంటి విడదల రజినీ వివాదం..?
ఏపీలో విడుదల రజినీ దుమారం
సీఐతో గొడవతో ఫుల్ పబ్లిసిటీ
రచ్చతో రజినీకి మిగిలిందేంటి..?
మాజీ మంత్రి విడదల రజినీ వివాదం ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపింది. ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ టైంలో విడదల రజినీ పోలీసులను అడ్డుకోవడం సంచలనంగా మారింది. శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు అడ్డుపడ్డారామె. రజినీ వాహనంలోనే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడని ..అతన్ని ఓ కేసులో అరెస్ట్ చేయాలని పోలీసులు వెళ్లారు. ఈ సమయంలో కారు డోర్ తీసేందుకు సీఐ ప్రయత్నించగా..రజినీ అడ్డుపడ్డారు.
సీఐ ప్రవర్తనపై విడదల రజినీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నేత అరెస్ట్ పై ప్రశ్నిస్తే పోలీసుల దౌర్జన్యం చేశారని ఆమె ఆరోపించారు. సీఐ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారని.. తనపై కేసు పెడతానని బెదిరించారని చెప్పుకొచ్చారు. మహిళ అని చూడకుండా తనను పక్కకు తోసేశారన్నారు. దీంతో ఆమెపై సంపథీ వ్యక్తమైంది. సీఐ సుబ్బరాయుడు చేసింది తప్పని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
విడదల రజినీ ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి.. రత్నారెడ్డి అనే వ్యక్తి దగ్గర 28 లక్షలు తీసుకున్నారని అభియోగాలు నమోదయ్యాయి. వైసీపీ హయాంలో అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని తన దగ్గర శ్రీకాంత్ రెడ్డి 28 లక్షలు తీసుకుని మోసం చేశారని రత్నారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుసకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు విడుదల రజినీ వెళ్లారు. ఈ సమయంలో శ్రీకాంత్ రెడ్డి విడదల రజినీ కారులో ఉన్నారని తెలిసి పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. రజినీ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రజినీకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అతన్ని చీటింగ్ కేసులో అరెస్ట్చే స్తున్నామని.. అడ్డుకుంటే.. విధులకు ఆటంకం కలిగించినట్లు మీపై కేసు నమోదు చేస్తామని క్లియర్ గా రజినీకి సీఐ సుబ్బారాయుడు చెప్పినట్లు వీడియోలు విడుదలయ్యాయి. దీంతో వీడియోల విడదల కంటే ముందు రజినీ చెప్పినదంతా అబద్దమని తేలిపోయింది. సీఐ చెప్పినా.. కూడా రజినీ కావాలనే పోలీసులను అడ్డుకుందన్న నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెపై అప్పటి వరకు సింపథీ కురిపించిన వారు.. రజినీపై విమర్శలు వ్యక్తం చేశారు.
Also Read: నెక్స్ట్ సీఎం మీరే..! నాంచారమ్మ జాతరలో సోది జోస్యం చెప్పించుకుంటున్న కవిత
విడదల రజినీకి చాలా కేసులు చుట్టుముట్టుకుంటున్నాయి. దీంతో సింపథీ కోసం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా వర్కవుట్ కావడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల కాలంలో రజినీ పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టి..తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తనపై కుట్రలు చేస్తున్నారన్నారు. అటు పార్టీలో కూడా ఈ అంశం రజినీకి మైనస్ అయిందని తెలుస్తోంది. మొదట్లో రజినీకి మద్దతు తెలిపిన వైసీపీ కార్యకర్తలు.. ఈ అంశంలో రజినీదే తప్పన్న అభిప్రాయం వ్యక్తమయ్యే సరికి ఆమె ప్రవర్తనపై ఇంటర్నల్ గా విమర్శలు వ్యక్తం చేస్తున్నారట.
సీఐ సుబ్బరాయుడితో వివాదాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకుని..కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిన రజినీకి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈ అంశం ద్వారా రజినీకి ఉన్న ఇమేజ్ తో పాటు.. వైసీపీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిందా అన్న చర్చ జరుగుతోంది. రజినీ రాజకీయంగా ఎదగాలంటే.. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని..ఇలా చీటింగ్ చేసిన వారికి అండగా నిలిస్తే.. అసలుకే ఎసరు కాదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.