OTT Movie : ఈ వారం ఓటీటీలో సరికొత్త తమళ సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. ఇప్పటికే ‘కాంతార చాప్టర్ 1’ ‘లోక’ సినిమాలు ఓటీటీని షేక్ చేస్తున్నాయి. ఇక నవంబర్ నెల కూడా వచ్చింది. ఈ రెండు నెలల్లో 2025 కూడా ముగిసిపోతుంది. దీంతో కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. మరికొన్ని ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నాయి. అవి ఎలాంటి సినిమాలు ? ఏ ఓటీటీలోకి వస్తున్నాయి ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
బ్యాడ్ గర్ల్ అనేది వర్ష భరత్ దర్శకత్వం వహించిన, వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మించిన తమిళ కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా. ఈ చిత్రంలో అంజలి శివరామన్ కథానాయిక రమ్యగా నటించింది. ఆమె సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఒక బ్రాహ్మణ అమ్మాయి. ఫ్యామిలీలో కఠినమైన నియమాలు ఉంటాయి. కానీ ఆమె ప్రేమ కోరికలు, కౌమారదశలోని అల్లకల్లోలాలతో పోరాడుతుంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేక పోయినా ఓటీటీలో సందడి చేసే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలతో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ NETPAC అవార్డును కూడా గెలుచుకుంది. ఈ సినిమా నవంబర్ 4 నుంచి Jio Hotstarలో స్ట్రీమింగ్ కానుంది.
కిస్ అనేది తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా. దీనిని కొరియోగ్రాఫర్ సతీష్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కవిన్ నెల్సన్ పాత్రలో నటించారు. ఇందులో అతను ఒక మ్యాజిక్ పుస్తకాన్ని పొంది, దాని ద్వారా ఏ జంట అయినా ముద్దు పెట్టుకున్నప్పుడల్లా వారి భవిష్యత్తును చూసే అతీంద్రియ శక్తిని పొందుతాడు. దీనికి జెన్ మార్టిన్ సంగీతం అందించారు. ఇందులో VTV గణేష్, రావు రమేష్, ప్రభు, దేవయాని వంటి నటులు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ZEE5లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
ఆరోమలే నూతన దర్శకుడు సారంగ్ తియాగు దర్శకత్వం వహించిన తమిళ రొమాంటిక్ డ్రామా. ఇందులో కిషన్ దాస్, శివాత్మిక రాజశేఖర్, హర్షత్ ఖాన్ VTV గణేష్ తదితరులు నటించారు. ఈ కథ ఆరోమలే అనే ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను ఒక మ్యారేజ్ సంస్థలో పని చేసూ, ఇతరులకు ప్రేమలో సహాయం చేస్తుంటాడు. సిద్ధు కుమార్ దీనికి సంగీతం, గౌతమ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా నవంబర్ 7 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తరువాతనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది.
Read Also : నడిరోడ్డుపై ఒంటిపై నూలుపోగు లేకుండా పడుండే అమ్మాయి… చిన్న పిల్లలు చూడకూడని లీగల్ డ్రామా