Gundeninda GudiGantalu Today episode October 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి కామాక్షి ఇంట్లో ఏర్పాటు చేసిన డాన్స్ స్కూల్ గురించి అందరికీ చెప్తుంది. రిబ్బన్ కట్ చేయడానికి శృతి వాళ్ళ అమ్మని పిలుద్దామని అనుకున్నాను. కానీ కుదరలేదు. ముందు జ్యోతి ప్రజ్వల చేయాలి అనగానే ప్రభావతి షాక్ అవుతుంది. దీంతో రిబ్బన్ కట్ చేస్తే నా డాన్సర్ స్కూల్ మూసుకోవాల్సిందే అని ప్రభావతి అనుకుంటుంది. ఇద్దరి కోడళ్లతో జ్యోతి వెలిగించినప్పుడు నా భార్యతో రిబ్బన్ కట్ చేయాల్సిందే అని బాలు వార్నింగ్ ఇస్తాడు.. ప్రభావతికి అందరూ షాక్ ఇస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా చేత రిబ్బన్ కట్ చేయించాల్సిందే అని పట్టుబడతాడు. నీ షాప్ కి వీళ్ళ అమ్మ చేత ఓపెన్ చేయించారు మొదటి రోజే సోఫా కొన్నారు మళ్ళీ తిరిగి ఇచ్చేశారు చూశావుగా ఏం జరిగిందో అని శ్రుతి వాళ్ళమ్మ పై సెటైర్లు వేస్తాడు. బాలు గొడవ చేయడం చూసి సత్యం ప్రభావతి పై సీరియస్ అవుతాడు. ముగ్గురు కోడల్ని ఒకేలా చూడడం ఎప్పుడు నేర్చుకుంటావో తెలియడం లేదు అంటూ సత్యం కూడా ప్రభావతికి గడ్డి పెడతాడు. ముగ్గురు కోడల్ని సమానంగా చూడాలి. మనకి దేవత లాంటి ముగ్గురు కోడలు ఉన్నారు వాళ్ళ ముగ్గురు చేత రిబ్బన్ కట్ చేస్తే మంచిది అని సత్యం అంటాడు. ప్రభావతి చేసేదేమీ లేక ఒప్పుకుంటుంది.
ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ప్రభావతి మాత్రం అక్కడే ఉంటుంది. ఆ డాన్స్ క్లాస్ గురించి అందరికీ తెలిసేలా చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. మీనా అందరికీ కాఫీ తెచ్చి ఇస్తుంది. సత్యం మాత్రం ఈ వయసులో చేయాల్సిన పనులు కావు ఇవి. తను డాన్స్ స్కూల్ పెట్టాలని అనుకుంది మంచి విషయమే కానీ వయసుకు తగ్గ పనులు చేస్తే మంచిదే కదా రేపు జరగరానిది ఏదైనా జరిగితే ఏం చేయాలి అని సత్యం టెన్షన్ పడుతూ ఉంటాడు. అత్తయ్య ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేయాలని అనుకుంది దాన్ని చేయనివ్వండి మీరు అడ్డుపడకండి అని రోహిణి అంటుంది.
శృతి కూడా భరతనాట్యం చేసుకోవడం అంత సులువైన పని కాదు. అది అందరికీ రాదు. ఇంటికి ఇంత మంచి టాలెంట్ ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు అని పొగడ్తలు వర్షం కురిపిస్తుంది. బాలు ఆమె ఆరోగ్యం పాడైన పర్లేదు కానీ ఈ డాన్స్ స్కూల్ ద్వారా పేరు సంపాదించాలని మీరు అనుకుంటున్నారా అంటూ సెటైర్లు వేస్తాడు. మీనా అత్తయ్యకు ఇన్నాళ్లకు మంచి ఆలోచన వచ్చింది. ఆమెని దయచేసి తప్పుగా చూడకండి. ఆమె చేయాలనుకున్న పనిని చేయనివ్వండి.. ఏమన్నా అయితే మనమందరం ఉన్నాం కదా మనం చూసుకుంటామని మీనా బాలుకి క్లాస్ పీకుతుంది.
మనోజు అమ్మని చూస్తుంటే కచ్చితంగా నాలాగే బిజినెస్ లో సక్సెస్ అవుతుంది అని అనిపిస్తుంది అని అంటాడు. ఇక రోహిణి బాలుకి సెటైర్లు వేస్తుంది. ప్రభావతి తన డాన్స్ క్లాస్ కి ఎవరు రాలేదని బాధపడుతూ ఉంటుంది. కామాక్షి ఇంటికి ఒక్కొక్కరు రావడం చూసి ప్రభావతి నిరాశపడుతుంది. అయితే ఒకతను వచ్చి డాన్స్ స్కూల్ గురించి వివరాలు అడగగానే అన్ని విషయాలు చెబుతుంది. నేను ఎలక్ట్రిసిటీ అపార్ట్మెంట్ నుంచి వచ్చాను మీరు ఇంతగా వాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మూడింతల బిల్లు వస్తుంది అని షాక్ ఇస్తాడు.
Also Read: సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు..
ఆ తర్వాత ఓ అతను తన కూతుర్ని తీసుకొని డాన్స్ క్లాస్ కోసం వస్తాడు. అయితే కామాక్షి మాత్రం ఇక్కడ డాన్స్ లేదు ఏం లేదు ఊరికే బోర్డు పెట్టాము అని వాళ్ళని పంపించేస్తుంది. ప్రభావతి ఇంటికెళ్లి ఎవ్వరూ రావట్లేదు అంటూ బాధపడుతుంది. ఆ తర్వాత సత్యం ప్రభావతిని చూసి ఏమైంది అలా ఉన్నావు వస్తారులే పెట్టిన ఒక్కరోజుకే రావాలంటే రారు కదా.. నువ్వేం బాధపడకు అంటూ ధైర్యం చెప్తాడు. బాలు వచ్చి సెటైర్లు వేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భరతనాట్యం నేర్చుకోవడానికి మీన వెళ్తుంది..